ఇంటర్నెట్‌తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు పంపటం ఎలా..?

కొన్ని నెలల క్రితం వరకు కేవలం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన Paytm సేవలు, ఇప్పుడు బేసిక్ మొబైల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసాయి

|

నోట్ల రద్దు ముందు వరకు Paytm యాప్ గురించి చాలా మందికి తెలియదు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో దాదాపుగా మొబైల్ వాడుతోన్న ప్రతిఒక్కరి దగ్గర పేటీఎమ్ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో డిజిటల్ లావాదేవీలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అన్ని రకాల బిల్లు చెల్లింపులు దగ్గర నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ వరకు ఆన్‌లైన్ పేమెంట్ పోర్టల్స్ ద్వారానే జరగటం ప్రారంభమయ్యాయి.

Read More : మోటో జీ4 కంటే తక్కువ ధరకే మోటో జీ5

Paytm మరింతగా విస్తరించింది..

Paytm మరింతగా విస్తరించింది..

ఈ క్రమంలోనే పేటీఎమ్ తన కస్టమర్ బేస్‌ను మరింతగా విస్తరించుకోగలిగింది. కొన్ని నెలల క్రితం వరకు కేవలం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన Paytm సేవలు, ఇప్పుడు బేసిక్ మొబైల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసాయి.నగదు బదిలీని మరింత సులభతరం చేస్తూ పేటీఎమ్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

గుర్తు తెలియని మొబైల్ నెంబర్స్ విసిగిస్తున్నాయా..?గుర్తు తెలియని మొబైల్ నెంబర్స్ విసిగిస్తున్నాయా..?

 ఇంటర్నెట్‌తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు...

ఇంటర్నెట్‌తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు...

తాజా సదుపాయంతో ఇంటర్నెట్‌తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. ఇందుకు ఏ విధమైన మెసేజ్‌లను కూడా పంపాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్‌తో పనిలేకుండా బేసిక్ మొబైల్ ఫోన్ నుంచి సైతం నగదు బదిలీ చేసుకునే విధంగా సరిరికొత్త కాన్సెప్ట్‌ను Paytm అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుర్తు తెలియని మొబైల్ నెంబర్స్ విసిగిస్తున్నాయా..?గుర్తు తెలియని మొబైల్ నెంబర్స్ విసిగిస్తున్నాయా..?

మీ పేరిట Paytm అకౌంట్‌ ఓపెన్ చేసుకోండి..
 

మీ పేరిట Paytm అకౌంట్‌ ఓపెన్ చేసుకోండి..

ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్న వారు తొలత తమ పేరిట ఓ Paytm అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవల్సి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్నస్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా Paytm అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. మీ పేరిట Paytm అకౌంట్‌ క్రియేట్ అయిన వెంటనే credit/debit లేదా నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించుకుని మీ పేటీఎమ్ వాలెట్‌లోకి నగదును యాడ్ చేసుకోండి.

సామ్‌సంగ్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న యాపిల్..?సామ్‌సంగ్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న యాపిల్..?

టోల్ ఫ్రీ మొబైల్ నెంబర్..

టోల్ ఫ్రీ మొబైల్ నెంబర్..

డబ్బు మీ అకౌంట్‌లో యాడ్ అయిన తరువాత Paytm సర్వీసులను ఉపయోగించుకుంటోన్నఏ మొబైల్ నెంబర్‌కైనా ఇంటర్నెట్ కనెక్షన్‌తో పనిలేకుండా నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుంది. ఇందుకుగాను 1800-1800-1234 నెంబర్‌కు కాల్ చేయవల్సి ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ను ఉపయగించుకోవటం ద్వారా యాప్‌లోకి వెళ్లకుండానే నగదు చెల్లింపులను చేపట్టవచ్చు. 

ఇక ‘6' సిరీస్‌తో మొబైల్ నెంబర్లుఇక ‘6' సిరీస్‌తో మొబైల్ నెంబర్లు

Paytm PINతో...

Paytm PINతో...

ఈ సర్వీసుకు సంబంధించిన బెనిఫిట్లను పొందే క్రమంలో యూజర్లు ముందుగా తమ మొబైల్ నెంబర్లతో పాటు 4 డిజిట్ల Paytm PINతో పేటీఎమ్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది. ఆ తరువాత 1800-1800-1234 నెంబర్‌కు కాల్ చేసి మీరు నగదు పంపాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ నెంబర్ అలానే అతని Paytm PIN వివరాలను తెలపటం ద్వారా నగదును ట్రాన్స్‌ఫర్ చేసే వీలుంటుంది. ఈ ప్రక్రియలో సెండర్‌కు సంబంధించి పేటీఎమ్ వాలెట్‌లోని నగదును రిసిప్టెంట్ పేటీఎమ్ వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయటం జరుగుతుంది.

నోకియా పీ1, పూర్తి వివరాలునోకియా పీ1, పూర్తి వివరాలు

Best Mobiles in India

English summary
How to Use Paytm Offline Without the Internet. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X