పల్స్ ఆక్సిమీటర్‌ను ఉపయోగించడం ఎలా?

|

ఇండియాలో కరోనా యొక్క సెకండ్ వేవ్ యొక్క తీవ్రత అధికంగా ఉన్న ప్రస్తుత ఈ రోజుల్లో రోజువారి ఆరోగ్యంను పరీక్షించుకోవడానికి వీలుగా ఉండే ముఖ్యమైన గాడ్జెట్ చిన్న పల్స్ ఆక్సిమీటర్ ను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయడం కంటే పల్స్ ఆక్సిమీటర్ ను అధికంగా ఉపయోగిస్తున్నారు. కఠినమైన COVID సమయాల్లో ప్రతిఒక్కరికీ ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ ఉపయోగం కూడా అధికంగా ఉంది.

 

పల్స్ ఆక్సిమీటర్‌ను ఉపయోగించడం ఎలా?

ఈ సమయంలో ఆక్సిమీటర్ కొనడం కోసం తక్కువ అంటే రూ.2500 ఖర్చు చేస్తున్నారు. ప్రఖ్యాత బ్రాండ్ ఆక్సిమీటర్ కోసం కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. ఆక్సిమీటర్లు దేశవ్యాప్తంగా వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. పల్స్ ఆక్సిమీటర్ కొనడానికి ముందు గుర్తుంచుకోవలసిన చిట్కాలను మేము ఇంతకుముందు వివరించాము. అయితే ఇప్పుడు ఈ పల్స్ ఆక్సిమీటర్‌ను ఎలా ఉపయోగించాలో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పల్స్ ఆక్సిమీటర్‌ను సరిగ్గా ఉపయోగించే విధానం

పల్స్ ఆక్సిమీటర్‌ను ఉపయోగించడం ఎలా?

*** మొదటి విషయం రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పరీక్షించే ముందు మీరు 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకోని లోతైన మరియు బలమైన శ్వాసను తీసుకోవాలి. ఇది ఖచ్చితమైన కొలత కోసం సహాయపడుతుంది.

*** మీరు విశ్రాంతి తీసుకొనే కొద్దిసేపు ఛాతీపై ఒక చేతిని ఉంచుకొని అలాగే పట్టుకోవాలి.

*** మీ యొక్క కుడి చేతిని ఎంచుకోండి. మీ మధ్య లేదా చూపుడు వేలుకు ఆక్సిమీటర్ ను ఉంచండి. ఆక్సిమీటర్ యాదృచ్ఛిక బొమ్మలను చూపిస్తుందని మీరు అనుకుంటే కనుక చేయి మార్చి మళ్ళీ ప్రయత్నించండి.

*** పల్స్ ఆక్సిమీటర్‌ యొక్క రీడింగ్ స్థిరంగా ఉండే వరకు దానిని ఒకే చోట ఉంచాలి.

*** రీడింగ్ స్థిరంగా వచ్చిన తర్వాత మాత్రమే అత్యధిక ఫలితాన్ని నమోదు చేయండి. దాని కోసం మీరు కొన్ని సెకన్ల పాటు వేచి ఉండాలి.

*** రీడింగ్ ను జాగ్రత్తగా గుర్తించేలా చూసుకోండి.

*** మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని రోజుకు మూడుసార్లు ట్రాక్ చేయాలని ప్రస్తుతం డాక్టరులు కూడా సిఫార్సు చేస్తున్నారు. బలహీనత యొక్క సంకేతాలు లేదా ఏదైనా COVID లక్షణాలు ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించడం ఉత్తమం.

*** రక్తంలో ఆక్సిజన్ స్థాయి 93 శాతం లేదా అంతకంటే తక్కువకు పడిపోయినప్పుడు వైద్య నిపుణులను సంప్రదించాలని నిర్ధారించుకోండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Use Pulse Oximeter on COVID-19 Times?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X