జియో 4జీ సిమ్‌ను ఎయిర్‌టెల్ డాంగిల్‌లో వాడుకోవటం ఎలా..?
4జీ మార్కెట్లో సరికొత్త ఒరవడికి నాంది పిలికిన రిలయన్స్ జియో గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా జియో సర్వీసులను 2016, డిసెంబర్ 31 వరకు రిలయన్స్ ఉచితంగా అందిస్తోన్న నేపథ్యంలో చాలా మంది యూజర్లు ఈ సిమ్‌ను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Read More : కూల్‌ప్యాడ్ నోట్ 5, ఐదు దిమ్మతిరిగే ఫీచర్లు
స్టాక్ సమస్యలు కారణంగా ఈ సిమ్ అందరికి దొరకటం లేదు. ఈ సిమ్‌ను దక్కించుకున్న చాలా మంది యూజర్లు నెట్‌వర్క్ పనితీరు పట్ల మిక్సుడ్ టాక్‌ను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికి జియో సిమ్ ప్రభంజనం ఇప్పుడప్పుడే తగ్గేట్లు కనిపించటం లేదు.

స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే కాదు...
జియో సిమ్‌ను కేవలం స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే కాదు వివిధ కంపెనీలు ఆఫర్ చేస్తున్న ఇంటర్నెట్ డాంగిల్స్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు.. Airtel dongleలో కూడా జియో సిమ్‌ను వాడుకోవచ్చు. డాంగిల్‌లో జియో 4జీ సిమ్ కార్డ్‌ను వాడుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..?

మీరు జియో సిమ్ ఎలా పొందారు..?
మీరు జియో సిమ్‌ను సామ్‌సంగ్ లేదా ఇతర 4జీ స్మార్ట్‌ఫోన్ ఆధారంగా పొందినట్లయితే ఆ సిమ్‌ను డాంగిల్స్‌లో ఇన్సర్ట్ చేసుకుని ఉపయోగించకోవచ్చు. ఒకవేళ మీ వద్ద లైఫ్ ఫోన్ ద్వారా పొందిన జియో సిమ్ కార్డ్ ఉన్నట్లయితే ఆ సిమ్‌ను డాంగిల్‌లో ఉపయోగించుకోవటం కష్టం.

మీరు వాడుతన్న డాంగిల్ ఖచ్చితంగా..?
మీ వద్ద ఉన్న జియో 4జీ సిమ్ కార్డ్‌ను Airtel dongleలో వాడుకోదలచినట్లయితే, మీరు వాడుతన్న డాంగిల్ ఖచ్చితంగా ఎయిర్‌టెల్ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసేదిగా ఉండాలి. ముందుగా సిమ్ కార్డ్‌ను ఆ డాంగిల్‌లో ఇన్సర్ట్ చేయండి. తదుపరి చర్యలో భాగంగా ఆ డాంగిల్‌ను పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి కనెక్షన్‌ను Establish చేయండి.

డాంగిల్ మీ పీసీకి కనెక్ట్ అయిన తరువాత..?
డాంగిల్ మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ అయిన తరువాత నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఒకవేళ నోటిఫికేషన్ రానట్లయితే డాంగిల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. మీరు విండోస్ 8 లేదా ఆ పై వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను వాడుతున్నట్లయితే నోటిఫికేషన్ ప్యానల్‌లోకి వెళ్లి APN settingsను ఈ విధంగా మార్చాల్సి ఉంటుంది. ముందుగా.. Access Point Nameను: Jionetగా మార్చండి. యాక్సిస్ పాయింట్ నేమ్‌ను సెట్ చేసిన తరువాత మిగిలిన అన్ని కాలమ్స్‌ను ఖాళీగా ఉంచేసి ok బటన్ పై క్లిక్ చేయండి.

విండోస్ 7 వాడుతున్నట్లయితే..
మీరు విండోస్ 7 లేదా ఆ క్రింది వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను వాడుతున్నట్లయితే డాంగిల్ ఆటోమెటిక్ గా APN సెట్టింగ్స్‌ను ఎంపిక చేసుకుంటుంది. మీరు ఏ విధమైన సెట్టింగ్స్ మార్చవల్సిన అవసరం ఉండదు.

సెట్టింగ్స్‌ను మార్చిన తరువాత
APN settingsను మార్చిన తరువాత ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేసుకోండి. వెబ్ పేజీలు యాక్టివ్‌గా లోడ్ అవుతున్నట్లయితే కనెక్షన్‌ను మీరు మీ Airtel dongleలో జియో సిమ్‌ను విజయవంతంగా నెలకొల్పినట్లే.


Click it and Unblock the Notifications








