Alexa లాంటి స్మార్ట్ పరికరాలు ఉపయోగిస్తున్నారా.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం..!
Alexa Usage Tips : అమెజాన్ అలెక్సా తరహా స్పీకర్‌లను ప్రస్తుతం అనేక మంది ఉపయోగిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాల్లో వినియోగిస్తున్నారు. ఇష్టమైన సాంగ్స్‌ను ప్లే చేయడం నుంచి స్మార్ట్ హోం డివైజ్‌లను కంట్రోల్ చేయడం వరకు అనేక విధాలుగా వినియోగిస్తున్నారు. వాయిస్ రికార్డింగ్ వంటి సామర్థ్యాలు సహా ఇతర ఫీచర్ల కారణంగా కొంత మంది యూజర్లు ప్రైవసీ పరంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలెక్సా వంటి ఎకో డివైజ్‌లను వినియోగిస్తున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
అలెక్సా తరహా డివైజ్‌లు వాయిస్ రికార్డు చేయడం మరియు స్టోర్ చేయడం వంటి అనేక సామర్థ్యాలను కలిగి ఉంటాయి. మరియు కీ వర్డ్‌తో యాక్టివేట్ అవుతాయి. మళ్లీ ఆఫ్ చేసేంత వరకు అన్ని రకాల వాయిస్‌లను రికార్డు చేస్తుంటాయి. ప్రైవసీ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఈ ఎకో డివైజ్‌లను ఎలా నియంత్రించాలి.

అలెక్సా పదాన్ని మార్చండి :
సాధారణంగా అలెక్సా వంటి డివైజ్‌లను Wake Word సాయంతో యాక్టివేట్ చేస్తుంటారు. అలెక్సా అనే పదాన్నే ఎక్కువ మంది Wake Word గా ఉపయోగిస్తుంటారు. దీంతో అనుకోకుండా ఈ పదాన్ని పలికినా.. ఈ తరహా పరికరాలు యాక్టివేట్ అవుతుంటాయి. దీంతో అవసరం లేని సంభాషణను రికార్డు చేసేందుకు అవకాశం ఉంటుంది.
అందువల్ల భవిష్యత్‌తో ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలంటే.. అలెక్సా పదానికి బదులుగా వేరే పదాలను ఎంచుకోవడం ఉత్తమం. ఫలితంగా అనుకోకుండా ఈ తరహా డివైజ్‌లు యాక్టివేట్ కాకుండా ఉంటాయి.

మ్యూట్ చేసుకోవచ్చు :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఎకో స్పీకర్‌లు.. ప్రత్యేకమైన మ్యూ్ట్ బటన్‌ను కలిగి ఉంటున్నాయి. ప్రైవేటు సంభాషణల సమయంలో ఈ బటన్‌ను ఆఫ్ చేయడం ద్వారా అలెక్సా తరహా డివైజ్‌లు వాయిస్‌ను రికార్డు చేయకుండా నియంత్రించవచ్చు. ఎకో డివైజ్‌ను తిరిగి వినియోగించాలంటే.. ఆ మ్యూట్ బటన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది.
వాయిస్ రికార్డింగ్‌ను డిలీట్ చేయవచ్చు :
అలెక్సా వంటి ఎకో డివైజ్‌ల పనితీరును మెరుగుపరిచేందుకు వీలుగా వ్యక్తుల సంభాషణలను రికార్డు చేస్తుంటాయి. అయితే అలాంటి రికార్డింగ్‌లను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుండాలి లేదా ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రైవసీకి భంగం కలగకుండా జాగ్రత్తపడొచ్చు.
అలాంటి చోట్ల అస్సలే వద్దు :
కొంత మంది అలెక్సా తరహా ఎకో డివైజ్‌లను బెడ్ రూమ్స్‌లో ఏర్పాటు చేస్తుంటాయి. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల బెడ్‌రూమ్స్, బాత్‌రూమ్స్ వంటి ప్రాంతాల్లో ఎకో డివైజ్‌లను ఏర్పాటు చేయకూడదు.
ఇంట్లోని వంట గది, హాల్ వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవసీ వంటి సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉండదు. దీంతోపాటు అలెక్సా వంటి డివైజ్‌లు అమెజాన్ అకౌంట్‌కు లింక్ చేసి ఉంటాయి. మీ సంభాషణలు ఇతరులకు చిక్కకుండా ఉండేందుకు వీలుగా బలమైన పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
దీంతోపాటు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) వంటి ఫీచర్‌లు ఉంటే, యాక్టివేట్ చేసుకోవాలి. ఫలితంగా మీ డివైజ్‌ను ఇతరులు యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉండదు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకోవడం మంచిదే అయినా.. ప్రైవసీకి భంగం కలగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.


Click it and Unblock the Notifications