ఫోన్ ఛార్జింగ్ చేసే సమయంలో చాలా మంది ఇలాంటి తప్పులనే చేస్తున్నారు.. మీరు కూడానా..?
భారత్ లో స్మార్ట్‌ఫోన్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు వివిధ మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో తయారీ సంస్థలు భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లేతో ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. అయితే కొన్ని మందికి ఫోన్ వినియోగంపై సరైన అవగాహన లేకపోవడం కారణంగా ఫోన్ బ్యాటరీ సహా పనితీరుపై ప్రభావం చూపుతుంది.
ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు 3 నుంచి 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను అందిస్తున్నాయి. అంటే అప్పటి వరకు ఫోన్‌ను సురక్షితంగా వినియోగించుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా అప్‌డేట్స్ వస్తున్నా.. బ్యాటరీ పనితీరు సరిగ్గా లేకుంటే (Smartphone Charging Tips) ఫలితం ఉండదు. అందువల్ల బ్యాటరీ ఎక్కువ రోజులపాటు సక్రమంగా పనిచేసేలా అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు మెరుగైన ఫీచర్‌ను అందిస్తున్నాయి.

100 శాతం వరకు ఛార్జింగ్ చేస్తుంటారా ? :
కొంత మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు.. 100 శాతం ఛార్జింగ్ చేస్తుంటారు. ఇలా ఎక్కువ సార్లు ఇలాగే చేస్తే బ్యాటరీ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫోన్‌ను ఫుల్ ఛార్జి చేసే సమయంలో ఫోన్ వేడెక్కుతుంది. మరియు వోల్టేజ్ స్ట్రెస్ (Voltage Stress) కూడా ఉంటుంది. ఈ రెండు ఫోన్ బ్యాటరీ మన్నిక పై ప్రభావం చూపుతాయి.
60 శాతం ఛార్జింగ్ వరకు ఓకే :
ఎప్పుడో ఒకసారి ఫోన్ ఫుల్ ఛార్జీ చేయడం వల్ల బ్యాటరీ డ్యామేజీ అయ్యే అవకాశం లేదు. అయితే ప్రతిసారి 100 శాతం ఛార్జింగ్ చేస్తే మాత్రం బ్యాటరీ పనితీరు దెబ్బతింటుంది. ఫోన్ 60 శాతం ఛార్జింగ్ వరకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదు. ఆపే ఛార్జింగ్ చేస్తే ఫోన్ వేడెక్కడం సహా వోల్టేజ్ స్ట్రెస్ కారణంగా బ్యాటరీ పనితీరు దెబ్బతింటుంది.
80 శాతం దగ్గరే డిస్‌కనెక్ట్ :
అందువల్ల ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక రావాలంటే ఛార్జింగ్‌ను 80 శాతం దగ్గరే డిస్‌కనెక్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం విడుదల అవుతున్న అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఈ తరహా ఛార్జింగ్ ఆప్షన్‌ను కలిగి కలిగి ఉంటున్నాయి. ఈ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే 80 శాతం వరకు మాత్రమే ఫోన్ ఛార్జింగ్ కానుంది.
ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా :
దీంతోపాటు ఎక్కువ సార్లు ఫోన్‌ను ఛార్జింగ్ చేసే యూజర్లు... కేవలం అవసరం అయినప్పుడు మాత్రమే ఫోన్ ఛార్జ్ చేసుకోవాలి. మరియు అధిక సమయం పాటు స్మార్ట్‌ఫోన్ వినియోగించే యూజర్లు.. 80 శాతం వరకు ఫోన్ ఛార్జ్ అయ్యేలా చూసుకోవాలి. ఫలితంగా బ్యాటరీ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 80 శాతం వరకు ఛార్జింగ్ అయ్యేలా ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సెట్టింగ్స్‌లోని బ్యాటరీ ఆప్షన్స్ ద్వారా ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. పాత తరం ఫోన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో లేకుంటే.. 80 శాతం వరకు ఛార్జింగ్ చేయడం అలవాటు చేసుకోండి.
కొంత మంది యూజర్లు రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తుంటారు. అలా చేస్తే బ్యాటరీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతోపాటు ఫోన్ బాగా వేడెక్కి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా సూర్యకాంతి నేరుగా పడే ప్రదేశాల్లో స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ చేయకూడదు. వేగంగా వేడెక్కే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








