మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాను Translatorలా మార్చటం ఎలా..?

అద్భుతమైన ఆలోచనలతో పుట్టుకొస్తున్న యాప్స్, స్మార్ట్‌ఫోన్‌లను అసాధారణ పరికరాలుగా తీర్చిదిద్దునున్నాయి. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు అద్బుతాలు సాధించవచ్చన్న కుతూహలాన్ని యాప్స్ మనలో కలిగిస్తున్నాయి. ఈ యాప్స్ సహాయంతో స్మార్ట్‌ఫోన్‌ను చిన్న సైజు కంప్యూటర్‌లా వాడుకుంటున్నాం.

మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాను  Translatorలా మార్చటం ఎలా..?

మనలో చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్ కెమెరాలను కేవలం ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. అయితే, స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఫోటోగ్రఫీకి మాత్రమే Translating (అనువదించే) టూల్ లా కూడా ఉపయోగించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న లేటెస్ట్ వర్షన్ Google Translate యాప్‌ను మీ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా అర్ధంకాని భాషను సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాను  Translatorలా మార్చటం ఎలా..?

Google Translate యాప్ ప్రత్యేకతలు

టైపింగ్ పద్ధతిలో 103 భాషలను ఈ యాప్ ట్రాన్స్‌లేట్ చేస్తుంది.
ఇంటర్నెట్ అందుబాటులో లేని సమయంలో 52 భాషలను ఈ యాప్ ట్రాన్స్‌లేట్ చేస్తుంది.
ఇన్‌స్టెంట్ కెమెరా ట్రాన్స‌లేషన్ : ఈ సదుపాయంతో మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఉపయోగించుకుని 29 భాషలను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.
కెమెరా మోడ్ : ఈ సదుపాయంతో మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా టెక్స్ట్‌ను ఫోటోల రూపంలో చిత్రీకరించుకుని 37 భాషల్లో హైక్వాలిటీ ట్రాన్స్‌లేషన్‌ను పొందవచ్చు.
కనర్వజేషన్ మోడ్ : ఈ సదుపాయంతో 32 భాషల్లో Two-way ఇన్ స్టెంట్ స్పీచ్ ట్రాన్స్‌లేషన్‌ను పొందవచ్చు.
హ్యాండ్‌రైటింగ్ : కీబోర్డ్ ఉపయోగించటం బదులు హ్యాండ్ రైటింగ్ ను ఉపయోగించుకుని 93 భాషల్లో ట్రాన్స్‌లేషన్‌ను పొందవచ్చు.

English summary
How To Use Smartphone Camera To Translate Anything. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot