స్మార్ట్‌ఫోన్‌లు వినియోగిస్తున్నారా.. ఈ అంశాలను కచ్చితంగా తెలుసుకోవాలి..!
స్మార్ట్‌ఫోన్‌లు ఛార్జింగ్ సమయంలో (Smartphones) సాధారణంగా వేడెక్కుతుంటాయి. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అదే వేసవి కాలంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కుతుంటాయి. అయితే ఫోన్ వేడెక్కిన సమయంలో అంతర్గత విభాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. మరియు ఫోన్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
స్మార్ట్‌ఫోన్ వేడెక్కితే? :
వేసవి కాలంలో ముఖ్యంగా ఫోన్ ఛార్జింగ్ చేస్తున్న సమయంలో వేడెక్కితే.. కాసేపు వినియోగం ఆపేయాలి. లేదా ఫ్లైట్‌మోడ్ ఆన్ చేసి కాసేపు పక్కన పెట్టాలి. ఫలితంగా ఫోన్ త్వరగా సాధారణ ఉష్ణోగ్రత కు చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ కేస్ :
స్మార్ట్‌ఫోన్ ను ఛార్జింగ్ చేస్తున్న సమయంలో వేడెక్కుతున్నట్లు మీరు భావిస్తే.. ఫోన్ కేస్ ను తీసివేసి ఛార్జింగ్ చేయాలి. దీంతోపాటు స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉన్నా.. వేగంగా ఫోన్ వేడెక్కే అవకాశం ఉంది. మీకు ఎంత బ్రైట్‌నెస్ అవసరమో అంతే బ్రైట్‌నెస్‌తో వినియోగించాలి. ఎక్కువ బ్రైట్‌నెస్ కారణంగా కళ్లు కూడా త్వరలా అలసిపోయే ప్రమాదం ఉంది.
ఇలా చేయవద్దు :
వేసవి కాలం సహా ఎప్పుడు ఛార్జింగ్ చేసినా.. నేరుగా సూర్య కాంతి వచ్చే ప్రాంతంలో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచి ఛార్జింగ్ చేయవద్దు. ఇలా చేస్తే.. ఫోన్ మరింత వేగంగా వేడెక్కే అవకాశం ఉంది. ఫోన్ భాగా వేడెక్కితే... అందులోని అంతర్గత భాగాలు డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా వేడెక్కితే ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
డిలిటీ చేయాలి :
వివిధ అవసరాల కోసం ఫోన్‌లో ఎన్నో యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తుంటాం. పని పూర్తయ్యాక ఆయా యాప్స్‌ను డిలీట్ చేయడం మర్చిపోతుంటాం. ఈ యాప్స్ ఎక్కువ ర్యామ్ సహా డేటాను వినియోగించుకుంటాయి. ఫలితంగా ఫోన్ వేడెక్కడం సహా ఫోన్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఛార్జింగ్ :
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే సమయంలో.. ఆ సంస్థ అందించిన లేదా సిఫార్సు చేసిన ఛార్జర్‌లను మాత్రమే వినియోగించాలి. ఇతర ఛార్జర్‌ల వినియోగం ఫోన్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతోపాటు కొంత మంది 100 శాతం వరకు ఛార్జింగ్ చేస్తుంటారు.
ప్రతిసారి ఇలా ఫుల్ ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. అంటే బ్యాటరీ వేగంగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. 80 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్ అయ్యేలా చూసుకోవాలి. కొన్ని ఫోన్‌లలో ఈ తరహా ఆప్షన్ అందుబాటులో ఉంది. లేకుంటే 80 శాతం వరకే ఛార్జింగ్ చేసేలా అలవాటు చేసుకోండి.
కొన్ని యాప్స్ వినియోగిస్తున్న సమయంలో ఫోన్ ఎక్కువగా వేడెక్కే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు అలాంటి యాప్స్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఫోన్ వినియోగిస్తున్న సమయంలో పరిమితికి మించి వేడెక్కినట్లు భావిస్తే.. వెంటనే వినియోగాన్ని ఆపేయాలి.
వారానికి ఒక్కసారి :
దీంతోపాటు వారానికి ఒక్కసారి అయినా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. హాకింగ్ రిస్క్‌ను తప్పించుకోవడం, మెరుగైన పనితీరు. బ్యాటరీ లైఫ్‌ను మెరుగుపరచడం, నెట్‌వర్క్ సమస్యలను పరిష్కరించడం, బ్యాగ్రౌండ్ యాప్స్‌ను నిలిపివేయడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








