స్నాప్‌చాట్ కొత్త ఫీచర్‌ 'షేర్డ్ స్టోరీస్'ని ఉపయోగించడం ఎలా?

|

స్నాప్‌చాట్ లోని వినియోగదారుల యొక్క బేస్ ని మరింత పెంచుకోవడానికి తన యొక్క విస్తారమైన ఫీచర్‌ల జాబితాకు "షేర్డ్ స్టోరీస్" అనే కొత్త ఫీచర్‌ని జోడించింది. ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉన్న "కస్టమ్ స్టోరీస్" ఫీచర్ యొక్క రీకండిషనింగ్ గా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో స్నాప్‌చాటర్‌లు ఏదైనా ఒక స్టోరీని సృష్టించవచ్చు మరియు వారి స్టోరీలను జోడించడానికి తమ యొక్క స్నేహితులను ఆహ్వానించవచ్చు. అంతేకాకుండా షేర్ చేసిన నిర్దిష్ట స్టోరీని జోడించడానికి స్నేహితులతో పాటుగా మరికొంత మంది వ్యక్తులను ఆహ్వానించవచ్చు.

 
స్నాప్‌చాట్ కొత్త ఫీచర్‌ 'షేర్డ్ స్టోరీస్'ని ఉపయోగించడం ఎలా?

స్నాప్‌చాట్ 'షేర్డ్ స్టోరీస్' లో స్నేహితులకు ఆహ్వాన అనుమతి

స్నాప్‌చాట్ లోని ఈ కొత్త ఫీచర్ షేర్ చేసిన క్షణాలను తం యొక్క జ్ఞాపకాలుగా మార్చుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది అని సంస్థ వెల్లడించింది. కస్టమ్ స్టోరీల మాదిరిగానే ఇది మీ స్నేహితులను స్టోరీలకి ఆహ్వానించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ ఫీచర్ సాయంతో మీ స్నేహితులను అలాగే వారి యొక్క ఇతర స్నేహితులను స్టోరీకి వారి జ్ఞాపకాలను అందించడానికి, షేర్ చేయడానికి మరియు ఆహ్వానించడానికి అనుమతిస్తుంది. స్నాప్‌చాట్‌లోని ఇతర స్టోరీల మాదిరిగానే ఇది కూడా 24 గంటల పాటు ఉండి ఆటోమ్యాటిక్ గా అదృశ్యమవుతుంది. ఈ ఫీచర్ గ్రూపులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు: ఫుట్‌బాల్ క్లబ్ లేదా క్రికెట్ జట్టు వారు తమ యొక్క టీమ్ లోని వ్యక్తులను అందరిని కూడా ఆహ్వానించవచ్చు మరియు షేర్డ్ మెమరీని సృష్టించవచ్చు.

స్నాప్‌చాట్ కొత్త ఫీచర్‌ 'షేర్డ్ స్టోరీస్'ని ఉపయోగించడం ఎలా?

"కొత్తగా అందుబాటులోకి వచ్చిన షేర్డ్ స్టోరీలతో గ్రూప్‌కి జోడించబడిన స్నాప్‌చాటర్‌లు తమ స్నేహితులను కూడా జోడించగలరు, ఇది మొత్తం సాకర్ టీమ్, క్యాంప్ స్క్వాడ్ లేదా కొత్త సహోద్యోగుల సమూహానికి వినోదాన్ని పొందడం సులభం చేస్తుంది." అని కంపెనీ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

స్నాప్‌చాట్ 'షేర్డ్ స్టోరీస్' కొత్త ఫీచర్‌ని ఉపయోగించే విధానం

స్నాప్‌చాట్ కొత్త ఫీచర్‌ 'షేర్డ్ స్టోరీస్'ని ఉపయోగించడం ఎలా?

1. స్నాప్‌చాట్ ఓపెన్ చేసి ఎడమ వైపు ఎగువ భాగంలో ఉన్న ప్రొఫైల్ చిహ్నంపై క్లిక్ చేయండి.

2. మై స్టోరీస్ హెడర్ పక్కన ఉన్న "+న్యూ స్టోరీ" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

3. ఫోన్ లో గల అనేక ఎంపికల జాబితా నుండి మీరు షేర్ చేయాలనుకునే షేర్డ్ స్టోరీలను ఎంచుకోండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Use Snapchat Introduces 'Shared Stories' New Feature: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X