ఆండ్రాయిడ్ ఫోన్‌లలో Split Screen ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?

ఆండ్రాయిడ్ 7.0 (నౌగట్) ఇంకా ఆపై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌ల కోసం Split Screen Mode పేరుతో విప్లవాత్మక ఫీచర్ ను గూగుల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

|

ఆండ్రాయిడ్ 7.0 (నౌగట్) ఇంకా ఆపై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌ల కోసం Split Screen Mode పేరుతో విప్లవాత్మక ఫీచర్ ను గూగుల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా స్ర్కీన్ పై ఒకేసారి రెండు యాప్స్ మధ్య మల్టిటాస్కింగ్‌ను నిర్వహించుకునే వీలుంటుంది. Split Screen Modeను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లయితే మీ ఆండ్రాయిడ్ డివైస్ తప్పనిసరిగా ఆండ్రాయిడ్ నౌగట్ లేదా ఆపై వెర్షన్ ఓఎస్ పై రన్ అయ్యేదిగా ఉండాలి. నేటి ప్రత్యక కథనంలో భాగంగా ఆండ్రాయిడ్ స్ప్లిట్ స్ర్కీన్ మోడ్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేదాని పై స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

how-to-use-split-screen-mode-on-android

తెలుగు వెబ్‌సైట్ నడిపేవారికి శుభవార్త,ఎంత రాస్తే అంత డబ్బులుతెలుగు వెబ్‌సైట్ నడిపేవారికి శుభవార్త,ఎంత రాస్తే అంత డబ్బులు

ఆండ్రాయిడ్ Split Screen Modeలోకి ఎంటర్ అవ్వటం ఎలా..?
తమ డివైస్‌లో Split Screen Modeను ఉపయోగించుకోవాలనుకునే ఆండ్రాయిడ్ యూజర్లు ఫోన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ బటన్స్ ద్వారా ఈ ప్రాసెస్‌ను కంప్లీట్ చేయవచ్చు. ముందుగా మీ ఫోన్ కెపాసిటివ్ టచ్ బటన్స్‌లోని స్క్వేర్ బటన్ పై టాప్ చేసినట్లయితే రీసెంట్‌గా ఓపెన్ చేసిన యాప్స్ లిస్ట్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది.

రెండు యాప్స్ మధ్య సన్నని బ్లాక్ స్ట్రిప్..
ఈ లిస్టును స్ర్కోల్ చేస్తూ వాటిలో మీకు అవసరమైన యాప్‌ను చేతి వేళ్లతో స్ర్కీన్ పైకి డ్రాగ్ చేసే ప్రయత్నం చేసినట్లయితే "Drag here to use split screen." పేరుతో చిన్న మెసేజ్ ఒకటి కనిపిస్తుంది. యాప్ టాప్ పొజీషన్‌లో ఇన్సర్ట్ అయిన తరువాత బోటమ్ భాగంలో ఉంచాల్సిన యాప్‌ను సెలక్ట్ చేసుకుని క్రిందకు డ్రాగ్ చేసుకోండి. ఈ రెండు యాప్‌లను ఒకేసారి మీ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే వీలుంటుంది. మీరు గమనించినట్లయితే స్ర్కీన్ పై ప్లేస్ అయిన రెండు యాప్స్ మధ్య సన్నని బ్లాక్ స్ట్రిప్ ఒకటి మీకు కనిపిస్తుంది.

నెట్ బ్యాకింగ్ చేస్తున్నారా,ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే !నెట్ బ్యాకింగ్ చేస్తున్నారా,ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే !

తాత్కాలికంగా హైడ్ చేయాలనుకుంటే..
Split Screen Mode ఆన్ అయిన తరువాత దానిని మీరు స్ర్కీన్ నుంచి హైడ్ లేదా రిమూవ్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. ఫోన్ హోమ్ బటన్ పై ప్రెస్ చేయటం తద్వారా Split Screen Modeను తాత్కాలికంగా మీరు హైడ్ చేయగలుగుతారు. స్ర్కీన్ హోమ్ పేజీకి రిటర్న్ అయిపోతుంది. సన్నని బ్లాక్ స్ట్రిప్ అనేది టాప్ ఎండ్‌కు మూవ్ చేయబడుతుంది. యాప్ స్విచర్ పై టాప్ చేయటం ద్వారా తిరిగి Split Screen Mode‌లోకి మీరు వెళ్లిపోతారు.

Best Mobiles in India

English summary
Throughout Android’s history, the option to switch between recent apps has been employed religiously. Therefore, it was nearly inevitable for Google to include a feature that enabled some sort of multitasking between two apps.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X