Home
How to

యూట్యూబ్ ‘Take a break’ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?

2018 గూగుల్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన యూట్యూబ్ సర్వీసును ఉద్దేశించి ఓ సరికొత్త ఫీచర్‌ను అనౌన్స్ చేసింది.

By Bommu Sivanjaneyulu

2018 గూగుల్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన యూట్యూబ్ సర్వీసును ఉద్దేశించి ఓ సరికొత్త ఫీచర్‌ను అనౌన్స్ చేసింది. 'టేక్ ఏ బ్రేక్ ’(Take a break) పేరుతో అనౌన్స్ చేయబడిన ఈ పీచర్ ద్వారా అంతరాయం లేకుండా యూట్యూబ్ కంటెంట్‌ను వీక్షించే యూజర్లు మధ్య మధ్యలో కొంత బ్రేక్ తీసుకునే వీలుంటుంది.

కళ్లకు విశ్రాంతి అవసరం..

కళ్లకు విశ్రాంతి అవసరం..

టేక్ ఏ బ్రేక్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం వల్ల యూట్యూబ్ వీడియోలను వీక్షిస్తోన్న సమయంలో ‘టేక్ ఏ బ్రేక్'పేరుతో ఓ రిమైండర్ స్ర్కీన్ పై వస్తుంది. దీంతో కొంత సేపు మీ కళ్లకు విశ్రాంతిని కల్పించుకునే వీలుంటుంది. యూట్యూబ్ ‘టేక్ ఏ బ్రేక్' ఫీచర్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి..

లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి..

యూట్యూబ్ టేక్ ఏ బ్రేక్ ఫీచర్ మీ ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ డివైస్ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ప్లాట్ ఫామ్ పై రన్ అయ్యేదిగా ఉండాలి. ఆ తరువాత మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను బట్టి గూగల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్ యూట్యూబ్ యాప్‌ను మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

టైమ్ ఇంటర్వెల్‌ను సెట్ చేసుకుని...

టైమ్ ఇంటర్వెల్‌ను సెట్ చేసుకుని...

యాప్‌ను లాంచ్ చేసిన తరువాత మెయిన్ స్ర్కీన్ పై టాప్ రైటర్ కార్నర్‌లో కనిపించే అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత ‘జనరల్' సెక్షన్‌లోకి వెళ్లి ‘Remind me to take a break' టోగుల్ పై టాప్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే మెనూలో టైమ్ ఇంటర్వెల్‌ను సెట్ చేసుకుని ఓకే బటన్ పై క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్ సేవ్ కాబడతాయి.

వద్దనుకుంటే డిస్మిస్ చేసేయవచ్చు..

వద్దనుకుంటే డిస్మిస్ చేసేయవచ్చు..

ఈ మొత్తం ప్రొసీజర్ విజయవంతంగా పూర్తయిన తరువాత నుంచి యూట్యూబ్ కంటెంట్‌ను వీక్షించే సమయంలో నోటిఫికేషన్ రిమైండర్‌ను యూట్యూబ్ మీకు సెండ్ చేస్తుంటుంది. ఒకవేళ మీకు బ్రేక్ తీసుకోవటం ఇష్టం లేకపోయినట్లయితే రిమైండర్‌లోని ‘Dismiss' ఆప్షన్ పై టాప్ ఇచ్చినట్లయితే వీడియా యూధావిధంగా కంటిన్యూ అయిపోతుంది.

Best Mobiles in India

English summary
How to use the take a break feature on youtube.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X