WhatsApp మ్యూట్ వీడియో ఫీచర్‌ను ఉపయోగించడం ఎలా?

|

వాట్సాప్ మెసెజింగ్ యాప్ లో బీటా పరీక్ష దశలో ఉన్న 'వాట్సాప్ మ్యూట్ వీడియో' ఫీచర్ ఎట్టకేలకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ యొక్క తాజా ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo బ్లాగ్ గత నెల ప్రారంభంలో ఈ కొత్త ఫీచర్‌ను పొందగలిగింది. వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ కొత్త మ్యూట్ వీడియో ఫీచర్ లభిస్తుందని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ఈ యాప్ యొక్క బీటా v2.21.3.13 సంస్కరణను ఉపయోగించే వినియోగదారులు ఎవరికైనా వీడియోను పంపే ముందు మ్యూట్ చేయడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. అవుట్‌గోయింగ్ వీడియోను మ్యూట్ చేసే వాల్యూమ్ ఐకాన్ ఇప్పుడు సీక్ బార్ కింద కనిపిస్తుంది. అయితే ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో మరియు అవాంఛిత స్క్రీచింగ్ ఆడియో ఫైల్‌ను ఎలా తొలగించాలో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Use WhatsApp Mute Video Feature Before Sending Videos to Others

వాట్సాప్ మ్యూట్ వీడియో ఫీచర్‌ను ఉపయోగించే విధానం

స్టెప్ 1: మొదట గూగుల్ ప్లే స్టోర్‌లో వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేసి అప్‌డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. (ఆటోమేటిక్ అప్‌డేట్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఆన్ చేసి ఉంటే కనుక యాప్ ఇప్పటికే అప్‌డేట్ ను అందుకోని ఉంటుంది).

స్టెప్ 2: యాప్ దాని తాజా సంస్కరణకు అప్‌డేట్ చేయబడిన తర్వాత దాన్ని మీ ఫోన్ లో ప్రారంభించండి.

స్టెప్ 3: కొత్త అప్‌డేట్ లో మ్యూట్ వీడియో ఫీచర్ అనేది వ్యక్తిగత చాట్ మరియు స్టేటస్ మోడ్ కోసం అందుబాటులో ఉంది.

How to Use WhatsApp Mute Video Feature Before Sending Videos to Others

స్టెప్ 4: ఈ క్రొత్త మ్యూట్ వీడియో ఫీచర్‌ను ఉపయోగించుకోవడానికి ఏదైనా వీడియోను రికార్డ్ చేయండి (చాట్ టైల్ లేదా స్టేటస్‌లో)

స్టెప్ 5: మీరు రికార్డింగ్ చేయడం పూర్తయిన తర్వాత ఎడమవైపు ఎగువ మూలలో వాల్యూమ్ ఐకాన్ ను చూస్తారు. మీ యొక్క వీడియోను మ్యూట్ చేయడానికి దానిపై నొక్కండి. ఆలా చేయడంతో మీరు శబ్దం లేని అవుట్‌గోయింగ్ వీడియోను మీ స్నేహితులకు పంపించడానికి సిద్ధంగా ఉంటారు

వీడియో యొక్క బ్యాక్ గ్రౌండులో ఇబ్బంది కలిగించే ఎటువంటి ఆడియోను అయినా సరే భంగపాటు లేకుండా ఇతరులకు వీడియోలను షేర్ చేయాలనుకునే వినియోగదారులకు ఈ ఫీచర్ సహాయపడుతుంది..

Best Mobiles in India

English summary
How to Use WhatsApp Mute Video Feature Before Sending Videos to Others

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X