వాట్సాప్ రియాక్షన్స్ కొత్త ఫీచర్‌ని ఉపయోగించడం ఎలా?

|

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ప్రపంచం మొత్తం మీద అధిక మంది యూజర్లను కలిగి ఉంది. మరింత మంది యూజర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తూ వస్తోంది. ఏప్రిల్ నెలలో వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను తన యాప్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వాట్సాప్ వాయిస్ కాల్‌లో ఎక్కువ మందికి మద్దతును ఇవ్వడంతో పాటు కమ్యూనిటీస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. వాయిస్ కాల్ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది కానీ కమ్యూనిటీల ఫీచర్ ఇంకా అభివృద్ధిలో ఉంది.

 
వాట్సాప్ రియాక్షన్స్ కొత్త ఫీచర్‌ని ఉపయోగించడం ఎలా?

వాట్సాప్ ప్రకటించిన కొత్త ఫీచర్లలోని రియాక్షన్స్ ఫీచర్‌ను ఎట్టకేలకు తన వినియోగదారులకు విడుదల చేస్తోంది. సంస్థ ఈ అప్లికేషన్ ఫీచర్‌ను ప్రకటించిన దాదాపు రెండు వారాల తర్వాత తాజా రోల్‌అవుట్ లో భాగంగా వినియోగదారులందరికీ అందుబాటులోకి రానున్నది అని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తన పోస్ట్‌లోని సమాచారం విషయానికి వస్తే "వాట్సాప్‌లో 👍❤️😂😮😢🙏 వంటి రియాక్షన్స్ ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి" అని అన్నారు.

వాట్సాప్ రియాక్షన్స్ కొత్త ఫీచర్‌ని ఉపయోగించడం ఎలా?

వాట్సాప్ సంస్థ గత నెలలో చేసిన ప్రకటనల్లో రియాక్షన్స్ ఫీచర్ ఒకటి. ఈ ఫీచర్ వినియోగదారులు ఏదైనా మెసేజ్లకు ప్రతిస్పందించడాన్ని సులభతరం చేస్తుంది. ఇప్పటివరకు వినియోగదారులు మెసేజ్లకు ప్రతిస్పందించడానికి ఎమోజీని టైప్ చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మీరు ప్రతిస్పందించాలనుకుంటున్న మెసేజ్ ని నొక్కి పట్టుకోవడం ద్వారా తక్షణమే రియాక్షన్స్ కనబడతాయి.

వాట్సాప్ రియాక్షన్స్ ఫీచర్‌ని ఉపయోగించే విధానం

వాట్సాప్ రియాక్షన్స్ కొత్త ఫీచర్‌ని ఉపయోగించడం ఎలా?

** మొదటగా మీరు ప్రతిస్పందించాలనుకుంటున్న ఏదైనా చాట్‌ని ఓపెన్ చేయండి.

** మీరు ప్రతిస్పందించాలనుకుంటున్న మెసేజ్ ని ఎక్కువసేపు నొక్కి పట్టుకోండి.

** మీరు అలా చేసిన వెంటనే కొత్తగా విడుదలైన 'రియాక్షన్స్' ఆరు విభిన్న ఎమోజీలతో కూడిన పాప్ అప్ కనబడుతుంది.

** ఇందులో మీకు కావలసిన ఎమోజీని లాగి దానిని వదిలివేయాలి.

** తరువాత మీరు సాధారణంగానే నిర్దిష్ట మెసేజ్ క్రింద వారి యొక్క ప్రతిస్పందనను చూస్తారు.

ఈ ప్రత్యేక ఫీచర్ అనేక సంక్షిప్త మెసేజ్ల కోసం అధికంగా ఉండే గ్రూప్ చాట్‌లలో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. రియాక్షన్స్ ఫీచర్‌తో మీరు ప్రత్యేకంగా ఏదైనా రిప్లయ్ ని టైప్ చేయవలసిన అవసరం లేదు. మీరు కేవలం నొక్కి పట్టుకోవడం ద్వారా ప్రతిస్పందన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

Best Mobiles in India

English summary
How to Use WhatsApp Rolling Reactions New Feature: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X