ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?
మన దేశంలో వాట్సాప్ యూజ్ చేయనివారి సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ (WhatsApp) భారత్‌లో దూసుకుపోతోంది. వాట్సాప్‌ను అనుసరిస్తూ హైక్ మెసెంజర్, వుయ్ చాట్ వంటి యాప్స్ తమ సత్తాను చాటుకుంటున్నాయి. మెసేజింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌ను వినియోగించుకోవాలంటే ప్రతిఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే!.

వాట్సాప్‌కు సంబంధించి అనేక బూటకపు సందేశాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిలో దేనిని నమ్మాలో, దేనిని నమ్మకూడదో తెలియక చాలా మంది యూజర్లు గందరగోళానికి గురువుతుంటే, మరికొందరు మాత్రం ఆ మోసపూరిత మెసేజ్‌లకు బుక్కయిపోతున్నారు.
Read More : రూ.599కే డ్యుయల్ సిమ్ ఫోన్

తాజాగా వాట్సాప్ యూజర్స్‌లో చాలామందికి ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ సారాంశం ఏంటేంటే.. వాట్సాప్ మెసేజ్‌లను ఇంటర్నెట్ లేకుండా పంపించడం ఎలా?. ఈ మెసేజ్‌లో ఓ లింక్‌ను కూడా ప్రొవైడ్ చేసారు. వాస్తవానాకి ఇది పక్కా ఫేక్ మెసేజ్. ఈ మెసేజ్‌ను నిజమనుకుని ఆ లింక్‌ను యాక్సెస్ చేసుకున్న చాలా మంది యూజర్లు వైరస్ బారిన పడక తప్పలేదు. అసలు వాట్సాప్ అంటేనే ఇంటర్నెట్‌కు సంబంధించిన ఓ సోషల్‌మీడియా సాధనం. అలాంటిది అది ఇంటర్నెట్ లేకుండా ఎలా పనిచేస్తుంది?
Read More : మార్కెట్లో రీసెంట్‌గా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?
గతేడాది షాంఘైలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వరల్డ్ ప్రీమియర్‌లో భాగంగా చాట్‌సిమ్ వరల్డ్ అనే కంపెనీ ‘చాట్‌సిమ్'(chatsim) పేరుతో సరికొత్త సిమ్‌కార్డ్‌ను ఆవిష్కరించింది. ఈ చాట్‌సిమ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ల పై ఏ విధమైన చార్జ్ చెల్లించకుండా ఉపయోగించుకోవచ్చు.గతేడాది షాంఘైలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వరల్డ్ ప్రీమియర్‌లో భాగంగా చాట్‌సిమ్ వరల్డ్ అనే కంపెనీ ‘చాట్‌సిమ్'(chatsim) పేరుతో సరికొత్త సిమ్‌కార్డ్‌ను ఆవిష్కరించింది. ఈ
చాట్‌సిమ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ల పై ఏ విధమైన చార్జ్ చెల్లించకుండా ఉపయోగించుకోవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?
వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, వుయ్‌చాట్ తదితర ప్రముఖ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌ను ఈ సిమ్‌కార్డ్ ద్వారా వాడుకోవచ్చు. చాటింగ్ మాత్రమే కాదు వాయిస్ కాల్స్ కూడా నిర్వహించుకోవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?
ఈ సిమ్‌లను చాట్‌సిమ్ వరల్డ్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఈ సిమ్‌లు ప్రపంచవ్యాప్తంగా డెలివరీ కాబడుతున్నాయి.

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?
వై-ఫై కనెక్టువిటీతో పనిలేకుండా ఈ చాట్‌సిమ్ పనిచేస్తుంది. చాట్‌సిమ్‌లోని సింగిల్ వాయిస్ కమ్యూనికేషన్ సిస్టం ద్వారా అన్ని ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ నిర్వహించుకోవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?
చాట్‌సిమ్‌ను ఫోన్‌లో ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌లను ఇంటర్నెట్ తో పనిలేకుండా వాడుకోవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?
వాట్సాప్, టెలీగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్, వుయ్‌చాట్ తదితర ప్రముఖ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌ను ఈ సిమ్‌కార్డ్ ద్వారా వాడుకోవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?
chatsim ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో పనిచేస్తోంది. ఇండియన్ యూజర్లు ఈ సిమ్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.900, సర్వీసులను యాక్టివేట్ చేసుకునేందుకు మరో రూ.900ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?
మొత్తం షిప్పింగ్ ఛార్జీలతో కలుపుకుని ఈ సిమ్ మీకు అందాలంటే రూ.2,369 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సిమ్ ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మీడియో ఫైల్ షేరింగ్ వంటి సర్వీసులను పొందేందుకు ప్యాకేజీని బట్టి రూ 900, రూ. 2250 , రూ 45000 వరకు చెల్లించాల్సి ఉంటంది.


Click it and Unblock the Notifications








