షియోమీ కొత్త ఫీచర్ ‘Mi గిఫ్ట్ కార్డ్’

Posted By: BOMMU SIVANJANEYULU

చైనా టెక్ దిగ్గజం షియోమీ, ఇండియన్ యూజర్ల కోసం Mi గిఫ్ట్ కార్డ్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ క్రింద గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేసి షియోమీ ఉత్పత్తులను కొనుగోలు చేేసే మీ ఆత్మీయులకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. ఈ ఎంఐ గిఫ్ట్ కార్డ్ ప్రోగ్రామ్‌ను క్విక్‌క్లైవర్ అనే ప్రెపెయిడ్ కార్డ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ భాగస్వామ్యంతో షియోమీ లాంచ్ చేసింది. రూ.100 నుంచి రూ.10,000 వరకు వివిధ డినామినేషన్‌లలో లభ్యమయ్యే ఈ గిఫ్ట్ కార్డులను ఈమెయిల్స్ ద్వారా మీ ఆత్మీయులకు పంపుకునే వీలుంటుంది. ఒక్కో ఆర్డర్‌లో 10 వరకు గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేసుకునే వీలుంటుంది. ఈ గిఫ్ట్ కార్డులకు సంబంధించిన ప్రత్యేకమైన గ్యాలరీని Mi.comలో షియోమీ ఏర్పాటు చేసింది. మీరు పంపిన గిఫ్ట్ కార్డును అవతలి వ్యక్తి రిసీవ్ చేసుకున్న వెంటనే అందులోని అమౌంట్ అతని ఎంఐ అకౌంట్‌లో ఇన్‌స్టెంట్‌గా యాడ్ అవుతుంది.

షియోమీ కొత్త ఫీచర్ ‘Mi గిఫ్ట్ కార్డ్’

ఎంఐ గిఫ్ట్ కార్డ్‌ను కొనుగోలు చేసే క్రమంలో ముందుగా Mi.comలోకి వెళ్లాలి. సైట్‌లోకి లాగిన్ అయిన తరువాత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన గిఫ్ట్ కార్డ్స్ పేజీలోకి వెళ్లి గిఫ్ట్ కార్డును సెలక్ట్ చేసుకుని సెండర్, రిసిప్టెంట్ డిటెయిల్స్‌‌తో పాటు గిఫ్ట్‌ కార్డ్ అమౌంట్, డెలివరీ డేట్ ఇంకా మెసేజ్ నోట్స్‌ను ఎంటర్ చేసి యూపీఐ లేదా ఈఎమ్ఐ పద్ధతిలో నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే మీ గిఫ్ట్ కార్డ్ ఈ-మెయిల్ ద్వారా రిసిప్టెంట్‌కు అందుతుంది.

షియోమి సంచలనం, నచ్చిన రంగుల్లోకి మీ ఫోన్‌ని మార్చుకోవచ్చు !

ఎంఐ గిఫ్ట్ కార్డ్‌ను మీరు రిడీమ్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి Mi Store యాప్‌లోకి వెళ్లి అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. అకౌంట్‌లోకి వెళ్లి యాడ్ గిఫ్ట్ కార్డ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని 16 అంకెల గిఫ్ట్ కార్డ్ నెంబర్‌తో పాటు 6 డిజిట్ల పిన్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. డిటెయిల్స్ ఎంటర్ చేసిన తరువాత 'Add Gift Card' బటన్ పై క్లిక్ చేసినట్లయితే గిఫ్ట్ కార్డ్ అమౌంట్ ఎంఐ అకౌంట్‌లో యాడ్ అవుతుంది. ఈ అమౌంట్‌తో నచ్చిన షియోమీ వస్తువును కొనుగోలు చేయవచ్చు.

కొనుగోలు చేసిన తేదీ నుంచి 12 నెలలలోపు మాత్రమే ఈ ఎంఐ గిఫ్ట్ కార్డ్స్ అనేవి వర్క్ అవుతాయి. ఆ తరువాత అవి అటోమెటిక్ గా ఎక్స్ పైర్ అయిపోతాయి.

English summary
Xiaomi has come up with the Mi Gift Card program for the buyers in India. This program lets you give gift cards those can be used to purchase Xiaomi products such as smartphones, televisions, smart devices and accessories.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot