ల్యాప్‌టాప్‌కి వైఫై హాట్‌స్పాట్ కనెక్ట్ అవ్వడం ఎలా..?

Written By:

ఈ రోజుల్లో చాలామంది వైఫై వాడుతుంటారు. ఎక్కువ మంది ఇంటర్నెట్ వాడాలనుకుంటే అదే సరైన పద్దతి. అందుకే అనోక చోట్ల వైఫఐ ఆఫర్ కంపెనీలు వైఫై ఆఫర్ చేస్తున్నాయి. ఈ వైఫైతో ల్యాప్‌టాప్‌కు కనక్టయి ఇంటర్నెట్‌ని వాడుకోవచ్చు. అయితే వైఫై కొంతమందికి రాకపోవచ్చు. వారి ల్యాప్ టాప్ కు ఆ ఆప్సన్ ఉండకపోవచ్చు. మరి అటువంటి సంధర్భంలొ ఏమి చేయాలి. ఇంటర్నెట్‌కు ఎలా కనెక్ట్ కావాలి. ఇందుకోసం మీరు వైఫూ హాట్ స్పాట్ ఉపయోగించవచ్చు. దానిద్వారా మీరు మీ ల్యాప్‌టాప్‌కి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వొచ్చు. మరి ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసుకుందాం.

Read more: పాతవే.. కాని కొత్తవై పరుగులెత్తుతున్నాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కనెక్టిఫై డౌన్ లోడ్ చేసుకుని

ముందుగా మీరు కనెక్టిఫై డౌన్ లోడ్ చేసుకుని మీ సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోవాలి. అది ఇన్ స్టాల్ కాగానే మీ కంప్యూటర్ ని రీ స్టార్ట్ చేయండి.

రీ స్టార్ట్ అయిన తరువాత

రీ స్టార్ట్ అయిన తరువాత నెట్ కనెక్ట్ ఎక్కడ ఉందో చెక్ చేయండి. అది కనెక్టివిటీ హట్ స్పాట్ మీద రన్ అవుతుందా లేదా చెక్ చేయండి.

అక్కడే క్రియేట్ వైఫై హాట్ స్పాట్

మీరు రెండు ట్యాబ్ లు గమనించాలి. సెట్టింగ్స్ అండ్ క్లయింట్స్, అక్కడే క్రియేట్ వైఫై హాట్ స్పాట్ అని వస్తుంది.

ఇంటర్నెట్ షేర్ లో డ్రాప్ మెనూని

ఇంటర్నెట్ షేర్ లో డ్రాప్ మెనూని ఓ సారి చూడండి. అక్కడ మీకు వైర్ డ్ కనెక్షన్ లేక వైర్ లెస్ కనెక్షన్ అని అడుగుతుంది. మీరు కరెక్ట్ దాన్ని సెలక్ట్ చేసుకుంటే చాలు

మీరు వైఫై పాస్ వర్డ్ యాడ్ చేసి స్టార్ట్ హాట్ స్పాట్

అక్కడ మీకు కొన్ని ఆప్సన్స్ కనిపిస్తాయి. మీరు వైఫై పాస్ వర్డ్ యాడ్ చేసి స్టార్ట్ హాట్ స్పాట్ మీద క్లిక్ చేయండి.

వైఫై నెట్‌వర్క్ మాదిరిగా కనెక్టివిటీ

సో మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయినట్లే వైఫై నెట్‌వర్క్ మాదిరిగా కనెక్టివిటీ ఉంటుంది, దానికి పాస్‌వర్డ్ ఇస్తే చాలు.

అయితే కనెక్టిపై అనేది పెయిడ్ యాప్

అయితే కనెక్టిపై అనేది పెయిడ్ యాప్. మీరు ఫ్రీ వర్షన్ లో అంటే ట్రయిల్ వర్సన్ లో వైఫై హాట్ స్పాట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అతి ప్రతి 30 నిమిషాలకు ఆగిపోతుంది. మీరు దీన్ని కొనుగోలు చేయండి అని అడుగుతూ ఉంటుంది.

దీని ధర 25 డాలర్లు వరకు

దీని ధర 25 డాలర్లు వరకు ఉంటుంది. పుల్ లైసెన్స్ తో 40 డాలర్ల వరకు ఉంటుంది. ఇది అన్ లిమిటెడ్ 3జీ ,4జీకి వాడుకోవచ్చు.

మాక్ ఇంటర్నెట్ కనెక్ట్ కోసం

ఇక మాక్ ఇంటర్నెట్ కనెక్ట్ కోసం సిస్టం ఫ్రిపరెన్స్ లో కెళ్లి అక్కడ షేరింగ్ మీద కిక్ చేస్తే మీకు ఇంటర్నెట్ షేరింగ్ ఆప్సన్ వస్తుంది.

ఇదర్ నెట్ లేక బ్లూటూత్ ,లేక వైఫై ఐఫోన్ యుఎస్ బి

అక్కడ మీకు అనేక రకాల ఆప్సన్స్ కనిపిస్తాయి. ఇదర్ నెట్ లేక బ్లూటూత్ ,లేక వైఫై ఐఫోన్ యుఎస్ బి వంటి ఆప్సన్స్ ఉంటాయి. మీకు కావలిసింది సెలక్ట్ చేసుకోండి.

ఇదర్ నెట్ అనేది మీరు వైర్ తో వాడే నెట్

ఇదర్ నెట్ అనేది మీరు వైర్ తో వాడే నెట్ . ఐమ్యాక్, ఐ ప్రో, మాక్ ప్రో వంటికి వాడుతారు. యుఎస్ బి ఇదర్ నెట్ లేకుంటే ధండర్ బోల్ట్ ఇదర్ నెట్ వంటివి కూడా అక్కడ ఉంటాయి. మీరు ఏదీ వాడుతున్నారన్నదే ముఖ్యం.

నెట్ వర్క్ పేరు. సెక్యూరిటీ టైప్, పాస్ వర్డ్

దాని తరువాత టూ కంప్యూటర్ యూజింగ్ అనే ఆప్సన్ ని చెక్ చేస్తే వైఫై కనిపిస్తుంది. అక్కడకెళ్లి మీరు నెట్ వర్క్ పేరు. సెక్యూరిటీ టైప్, పాస్ వర్డ్ ఇస్తే సరిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How to Use Your Laptop as a Wi-Fi Hotspot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot