యూట్యూబ్ ‘Incognito Mode’ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ఎలా?

By Anil
|

ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ విభాగంలో అగ్రగామి సర్వీసుగా గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబ్ రోజు రోజుకి తన క్రేజ్ ఇంకా పెంచుకుంటు పోతుంది.ఈ నేపధ్యం లో Incognito Mode అనే సరికొత్త ఫీచర్‌ను యూట్యూబ్ అందిస్తుంది.ఈ Incognito Mode ప్రతి బ్రౌజర్ లో అందుబాటులో ఉంటుంది అయితే యూట్యూబ్ మాత్రం రీసెంట్ గా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది . ఈ Incognito మోడ్ యొక్క గొప్పతనం ఏంటంటే మీరు చూసే వీడియోస్ హిస్టరీ కానీ క్యాచీ హిస్టరీ కానీ ,పాస్వర్డ్స్ కూడా ఇందులో సేవ్ కాకుండా ఉంటుంది. ఆటోమేటిక్ గా మీరు చూసిన హిస్టరీ పూర్తిగా డిలీట్ అయిపోతుంది.ఈ Incognito Mode ఫీచర్ ను ఎలా అప్ డేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు తెలుపుతున్నాము...

 

స్టెప్ 1:

స్టెప్ 1:

మీ యూట్యూబ్ యాప్ లో కుడి పక్కన ఉన్న మీ ప్రొఫైల్ పిక్చర్ దగ్గర క్లిక్ చేయగానే Turn on Incognito అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఒకే వేళ మీకు ఈ "Turn on Incognito"అనే ఆప్షన్ కనిపించకపోతే గూగుల్ ప్లే స్టోర్ లో యూట్యూబ్ యాప్ ను అప్ డేట్ చేసుకోండి.

స్టెప్ 2:

స్టెప్ 2:

ఈ Turn on Incognito ఆప్షన్ ను క్లిక్ చేసాక మీకు ఒక నోటిఫికేషన్ వెలువడుతుంది దానిని వెంటనే ok చేసి ఇక మీరు చూడాలనుకున్న వీడియోస్ ను ప్రైవేట్ గా చూసుకోండి.

స్టెప్3:
 

స్టెప్3:

మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ Incognito Mode లో ట్రేండింగ్ మరియు హోమ్ సెక్షన్స్ మాత్రమే యాక్సిస్ చేయగలము. మీరు ఈ మోడ్లో ఇన్బాక్స్, లైబ్రరీ మరియు సభ్యత్వాలను యాక్సిస్ చేసే వీలు ఉండదు . అలాగే మీరు మీ ప్లే లిస్టుల వీడియోలను సేవ్ చేయలేరు.

Incognito Modeను Turn of చేసుకోవడం ఎలా?

Incognito Modeను Turn of చేసుకోవడం ఎలా?

మీరు Incognito Mode లో కాకుండా మాములు యూట్యూబ్ యాప్ లో వీడియోస్ చూడాలి అనుకుంటే మీ ప్రొఫైల్ పిక్చర్ ఉండే ప్లేస్ లో చిన్న బొమ్మ కనిపిస్తుంది దానిని క్లిక్ చేయగానే Turn of Incognito అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి తిరిగి మళ్ళీ మీరు మీ జిమెయిల్ అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వచ్చు

మరికొద్ది రోజుల్లో iOS యూజర్లకు...

మరికొద్ది రోజుల్లో iOS యూజర్లకు...

ఇప్పటివరకు ఈ Incognito Mode ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది మరికొన్ని రోజుల్లో iOS యూజర్లకు కూడా అప్ డేట్ రోబుతుంది అని సమాచారం.

Best Mobiles in India

English summary
Incognito mode is a boon if you want to browse in private without anyone else getting to know what you are looking out for. The same feature on YouTube will be a great option if you do not want videos to find their way to your watch history. So long, the video streaming platform missed out on this feature but not anymore.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X