Youtube ఛానల్ యొక్క కామెంట్ హిస్టరీని వీక్షించడం ఎలా?

|

అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ కంటెంట్ వినియోగ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన యూట్యూబ్ ని ప్రతి రోజు బిలియన్ల మంది వినియోగదారులు రోజువారీ ప్రాతిపదికన ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్ యొక్క కంటెంట్‌ను డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ మరియు మొబైల్ డివైస్ల నుండి ప్రసారం చేస్తున్నారు. యూట్యూబ్ లోని వీడియోలను చూడటమే కాకుండా వీడియోలపై తమ యొక్క నిర్ణయాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ ఉంటారు. అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌లో మీ కామెంట్లను ట్రాక్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. మీ యూట్యూబ్ ఛానెల్ యొక్క కామెంట్ చరిత్రను ఎలా వీక్షించాలో మరియు సవరించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. దీని కారణంగా మీరు కొన్ని ముఖ్యమైన కామెంట్లను తనిఖీ చేయవచ్చు మరియు వాటికి రిప్లయ్ కూడా ఇవ్వవచ్చు.

 
How to View and Edit your Youtube Channel Comment History

మీ Youtube ఛానల్ యొక్క కామెంట్ హిస్టరీని చూసే విధానం

 

మీ యూట్యూబ్ ఛానల్ యొక్క కామెంట్ హిస్టరీను కొన్ని క్లిక్‌లతోనే వీక్షించవచ్చు. అయితే మొబైల్ మరియు డెస్క్‌టాప్ రెండింటిలోనూ మీ కామెంట్ చరిత్రను వీక్షించడానికి సూచనలు వేరుగా ఉన్నాయి.

డెస్క్‌టాప్‌లో

How to View and Edit your Youtube Channel Comment History

స్టెప్ 1: ముందుగా మీ డెస్క్‌టాప్‌లో Youtube.comని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: ఎగువవైపు ఎడమ మూలలో ఉన్న హాంబర్గర్ మెనూ చిహ్నంపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: తరువాత హిస్టరీ ఎంపికను కనుగొని దానిపై క్లిక్ చేయండి.

స్టెప్ 4: మీరు హిస్టరీపై క్లిక్ చేసిన తర్వాత కుడి వైపున ఒక చిన్న విండో తెరవబడుతుంది. అందులో కామెంట్స్ ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 5: ఇప్పుడు మీరు మీ యూట్యూబ్ కామెంట్స్ చరిత్రను చూడగలరు మరియు దానిని సవరించగలరు.

మొబైల్‌లో

How to View and Edit your Youtube Channel Comment History

స్టెప్ 1: మీ మొబైల్‌లో Youtube అప్లికేషన్‌ యాప్ ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: తరువాత మీ ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: క్రిందికి స్క్రోల్ చేసి "యువర్ డేటా ఇన్ యూట్యూబ్" ఎంపిక కోసం వెతికి దానిపై క్లిక్ చేయండి.

స్టెప్ 4: మీరు దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క అకౌంటుతో సైన్ ఇన్ చేయాలి.

స్టెప్ 5: మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు "మీ యూట్యూబ్ డ్యాష్‌బోర్డ్" విభాగంలో కామెంట్స్ అనే ఎంపిక కోసం వెతికి దానిపై క్లిక్ చేయండి.

స్టెప్ 6: ఇప్పుడు మీరు వీక్షించిన యూట్యూబ్ వీడియోలకు వచ్చిన కామెంట్లను వీక్షించవచ్చు మరియు సవరించవచ్చు.

యూట్యూబ్ పాత కామెంట్లను తొలగించే విధానం

యూట్యూబ్ యొక్క కామెంట్లను చూడడానికి మీరు పైన ఉన్న పద్ధతుల్లో దేనినైనా ఉపయోగించి చివరి దశకు చేరుకున్నప్పుడు మీరు కామెంట్ యొక్క కుడివైపు ఎగువ మూలలో క్రాస్ చిహ్నాన్ని చూస్తారు. పాప్-అప్‌లోని డిలీట్ బటన్‌ను నొక్కడం ద్వారా దానిపై క్లిక్ చేయండి. మీరు ఇలా చేసిన తర్వాత నిర్దిష్ట కామెంట్ తొలగించబడుతుంది.

Best Mobiles in India

English summary
How to View and Edit your Youtube Channel Comment History

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X