IND vs ENG మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా చూడడం ఎలా?
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ఫిబ్రవరి 5, 2021 ఉదయం 9:30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ప్రారంభమయింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ మొదలైంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభమైంది.

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) కార్యదర్శి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ ను నిర్వహిస్తున్నది. రెండవ మ్యాచ్‌లో 50 శాతం మంది హాజరవుతారని బీసీసీఐ ధృవీకరించారు. IND vs ENG మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా చూడటానికి గల మార్గాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇండియా vs ఇంగ్లాండ్ (IND vs ENG) టెస్ట్ మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో చేసే విధానం
మీరు క్రికెట్ యొక్క వీరాబిమాని అయ్యి ఇంటి వద్ద నుండే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌ను డిస్నీ + హాట్‌స్టార్ మరియు జియోటివి యాప్‌లో ఉచితంగా లైవ్ పద్దతిలో చూడవచ్చు. అలాగే ఈ టెస్ట్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్
డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ లో ఒక సంవత్సరానికి రూ.399 ధర వద్ద డిస్నీ + హాట్‌స్టార్ విఐపి ప్యాక్ మరియు సంవత్సరానికి రూ .1,499 ధర వద్ద డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం చందాతో లభిస్తుంది. విఐపి ప్యాక్ IND vs ENG క్రికెట్ స్ట్రీమింగ్, ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మరియు ఫార్ములా 1, మల్టీప్లెక్స్ బ్లాక్ బస్టర్స్, డిస్నీ + కంటెంట్ మరియు హాట్‌స్టార్ స్పెషల్స్‌తో సహా లైవ్ స్పోర్ట్స్ చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

జియో ప్రీపెయిడ్ ప్లాన్ లు
రిలయన్స్ జియో యొక్క కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ లు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సభ్యత్వంను ఉచితంగా అందిస్తున్నాయి. అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 3GB డేటా ప్రయోజనంతో 28 రోజుల వాలిడిటీతో అందించే జియో క్రికెట్ ప్యాక్ రూ.401 ధర వద్ద లభిస్తుంది. అలాగే రూ.588 విలువైన మరో జియో ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందాను 56 రోజుల పాటు 112GB డేటా మరియు అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు అందిస్తుంది. డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్‌స్క్రిప్షన్‌కు ఉచిత చందా అందించే ఇతర జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో రూ.777 ప్లాన్, రూ.2599 ప్లాన్ లు కూడా ఉన్నాయి. జియో యొక్క అన్ని ప్లాన్ లు జియో టీవీకి ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి.


Click it and Unblock the Notifications








