Just In
- 1 hr ago ఈ OnePlus ఫోన్ పై ధర తగ్గింది! కొత్త ధర, ఆఫర్ల వివరాలు
- 1 hr ago వాట్సాప్ స్టేటస్ బార్లో భారీ మార్పులు.. ఈ అప్డేట్ ఎలా ఉపయోగపడనుంది.. పూర్తి వివరాలు..!
- 2 hrs ago శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ కీలక వివరాలు లీక్.. Wi-fi, eSIM సహా 32GB స్టోరేజీతో లాంచ్..?
- 3 hrs ago రాబోయే ఏప్రిల్ నెలలో లాంచ్ కానున్న స్మార్ట్ఫోన్లు! లిస్ట్
Don't Miss
- Sports రూ.కోట్లు పలికిన స్టార్ ప్లేయర్ బెంచ్‌కే..ముంబైతో ఆడే SRH తుది జట్టు ఇదే!
- Automobiles శృతి మించిన హోలీ సంబరాలు.. స్కూటర్‌పై యువతుల వికృత చేష్టలు.. మెట్రోలో రొమాన్స్
- Finance Gold Price: తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..!
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
- News తెలంగాణ ప్రజల నెత్తిన పాలు పోసిన నరేంద్రమోడీ
- Movies నా భార్య అలాంటిది.. ఆ విషయం తెలిశాక వదిలేద్దామనుకున్నా.. :పూరీ జగన్నాథ్ షాకింగ్ కామెంట్స్
- Lifestyle Pesara punugulu పెసర పునుగులు లేదా పెసరపప్పుతో పుల్లుంటలు హెల్తీ బ్రేక్ ఫాస్ట్
Strawberry Supermoon 2021: గులాబీ రంగులో సూపర్‌మూన్!! ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుంది?
2021 సంవత్సరం జూన్ నెల మొత్తం ఖగోళ సంఘటనలతో నిండి ఉంది. ప్రజలు ఇప్పటికే ఈ నెలలో వార్షిక సూర్యగ్రహణంను చూసారు. అలాగే వేసవి కాలం కూడా ఈ నెలలోనే మొదలైంది. అయితే ఇప్పుడు స్ట్రాబెర్రీ సూపర్‌మూన్‌ను చూడనున్నారు. అవును ఇది నిజం. జూన్ 24 న అంటే రేపు చంద్రుడు ఎరుపు రంగు లేదా గులాబీ రంగులో కనిపించనున్నాడు. వాతావరణాన్ని బట్టి ఎరుపు రంగుతో పాటుగా బంగారు కలర్ లో కనిపించనున్నది. ఈ ఖగోళ సంఘటన రాత్రి సమయంలో ఆకాశంలో మెరిసే అవకాశం ఉంది.
"పౌర్ణమి సమయంలో సాధారణంగా సూర్యుడు, భూమి మరియు చంద్రుడు 180 డిగ్రీల రేఖ వరుసలో ఉంటారు. కానీ ప్రస్తుతం చంద్రుని యొక్క కక్ష్య భూమికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది (ఇది భూమి కక్ష్య కంటే 5 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది). ఇది సాధారణంగా ఖగోళ శ్రేణి పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు భూమి యొక్క నీడ కంటే కొంచెం ఎక్కువ లేదా కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే సూర్యుని కాంతి భూమికి ఎదురుగా ఉన్న చంద్రుని వైపు పూర్తిగా ప్రకాశిస్తుంది." అని నాసా యొక్క సైన్స్ కమ్యూనికేషన్ ఆండ్రియా జోన్స్ లైవ్ సైన్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
స్ట్రాబెర్రీ సూపర్‌మూన్ అంటే ఏమిటి?
పౌర్ణమి రోజున చంద్రుడు గులాబీ రంగులో కనిపించడాన్ని స్ట్రాబెర్రీ మూన్ అని పిలుస్తారు. ఇది వసంత ఋతువు యొక్క చివరి పౌర్ణమి మాత్రమే కాకుండా వేసవి సీజన్లో వచ్చే మొదటిది కూడా. వేసవి కాలం మొదలైన తరువాత వచ్చే మొదటి పౌర్ణమి ఇదే కానుంది. ఈ ఖగోళ దృగ్విషయం ఉత్తర అమెరికాలోని పురాతన అల్గోన్క్విన్ తెగల నుండి వచ్చింది, వీరు పౌర్ణమిని స్ట్రాబెర్రీల కోత కాలం ప్రారంభంతో గుర్తించారు.
Covid-19 వాక్సిన్ బుక్ చేస్తున్నారా?? వీటిలో బుక్ చేసారో అంతే సంగతులు...
స్ట్రాబెర్రీ సూపర్‌మూన్ టైమింగ్
నివేదికల ప్రకారం ఆకాశంలో సూపర్‌మూన్ జూన్ 24వ తేదీన గురువారం మధ్యాహ్నం 2:40 గంటలకు EDT (18:40 GMT) వద్ద కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఇది కొద్ది నిమిషాల ముందు లేదా ఖగోళ సంఘటన తర్వాత పూర్తిగా కనిపిస్తుంది.
స్ట్రాబెర్రీ సూపర్‌మూన్‌ను ఎలా చూడాలి?
సూపర్‌మూన్‌ను పూర్తిగా ఉత్తర అమెరికాకు చెందిన హోరిజోన్ ప్రాంతంలో కనిపించనున్నది. అయినప్పటికీ స్టార్‌గేజర్లు న్యూయార్క్‌లోని రాత్రి 8:53 గంటలకు EDT వద్ద చంద్రకాంతి వద్ద క్షణం చూడవచ్చు.
భారతదేశంలో స్ట్రాబెర్రీ సూపర్‌మూన్ కనిపిస్తుందా?
దురదృష్టవశాత్తు IST రాత్రి 11:15 గంటల సమయానికి చంద్రుడు ఉదయించడంతో భారతీయులు చివరి సూపర్‌మూన్‌ను చూడలేరు. అయితే రాత్రి 11:15 గంటల సమయంకు చంద్రుడికి గ్రహణం ప్రారంభమవుతుంది మరియు తెల్లవారుజాము 2:35 వరకు ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470