Friendsతో కలిసి సినిమాలను చూడడాన్ని మిస్ అవుతున్నారా?? ఇలా చేయండి...

|

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటికి మాత్రమే పరిమితం అవ్వడం వలన స్నేహితులతో కలిసి సినిమాలను చూసే అద్భుతమైన సందర్భాలను మిస్ అవుతున్నారా? అయితే అటువంటి అద్భుతమైన అవకాశాన్ని ప్రముఖ వీడియో యాప్ నెట్‌ఫ్లిక్స్ తన వినియోగదారులకు అందిస్తున్నది. ఇండియాలో ఇప్పటికీ సినిమా థియేటర్లు మూసివేయబడినప్పటికీ మీరు మీ స్నేహితులతో ఆన్‌లైన్‌లో సినిమాలు చూడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కొన్ని వారాల క్రితం నెట్‌ఫ్లిక్స్ వాచ్ పార్టీ ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ సాయంతో మీరు మీ యొక్క స్నేహితులతో వీడియోలను ఒకేసారి చూడవచ్చు మరియు ఒకరితో మరొకరు చాట్ కూడా చేయవచ్చు.

స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో వీడియోలను చూడడానికి అనుమతించే యాప్
 

స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో వీడియోలను చూడడానికి అనుమతించే యాప్

యూజర్స్ "రేవ్" యాప్ సహాయంతో నెట్‌ఫ్లిక్స్ యొక్క వీడియోలనే కాకుండా యూట్యూబ్ వీడియోలను కూడా ఆన్‌లైన్‌లో చూడవచ్చు. ఇది iOS మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ పార్టీ అనేది యాప్ కాదు మరియు ఇది ప్రాథమికంగా క్రోమ్ కు పొడిగింపుగా స్నేహితులతో కలిసి వీడియోలను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది ప్రజలు తమ ప్రోగ్రామ్‌లను రిమోట్‌గా సమకాలీకరించడానికి కూడా అనుమతిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ పార్టీ సహాయంతో స్నేహితులతో కలిసి రిమోట్‌గా వీడియోలను చూడడానికి కింద ఉన్న పద్దతులను పాటించండి.

నెట్‌ఫ్లిక్స్ పార్టీ యాప్ తో ఆన్‌లైన్‌లో స్నేహితులతో సినిమాలు చూసే పద్ధతులు

నెట్‌ఫ్లిక్స్ పార్టీ యాప్ తో ఆన్‌లైన్‌లో స్నేహితులతో సినిమాలు చూసే పద్ధతులు

స్టెప్1: Chrome ఎక్సటెన్షన్ ను ఇన్‌స్టాల్ చేసి, తరువాత దాన్ని Chrome టూల్‌బార్‌కు పిన్ చేయండి. నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి సినిమా లేదా ఏదైనా ప్రోగ్రాం ఎపిసోడ్ ను చూడటం ప్రారంభించండి. అడ్రస్ బార్ పక్కన ఉన్న నెట్‌ఫ్లిక్స్ పార్టీ పొడిగింపు చిహ్నం ఎరుపు రంగులో ఉండాలి.

స్టెప్ 2

స్టెప్ 2: క్రొత్త లింక్‌ను రూపొందించడానికి మీరు "NP" చిహ్నంపై క్లిక్ చేయాలి. ఈ లింక్ మీరు చూస్తున్న కంటెంట్‌ను మీతో పాటుగా చూడటానికి మీ స్నేహితులను అనుమతిస్తుంది. ఈ సులభమైన మార్గం ద్వారా మీ స్నేహితులకు లింక్‌ను పంపవచ్చు. నెట్‌ఫ్లిక్స్ పార్టీకి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి కూడా ప్లేబ్యాక్‌ను ఎవరు నియంత్రించవచ్చో నిర్ణయించుకోవాలి.

స్టెప్ 3: వినియోగదారులు ఇప్పటికే తమ నెట్‌ఫ్లిక్స్ అకౌంటుల్లోకి సైన్ ఇన్ చేసి బ్రౌజర్ విండోలో ఓపెన్ చేసినట్లు నిర్ధారించుకోండి. టూల్‌బార్‌లోని ఎరుపు "NP" ఇనిషియల్స్ పై క్లిక్ చేస్తే ఫీడ్‌ను సమకాలీకరిస్తుంది మరియు మీ స్క్రీన్ కుడి వైపున చాట్ ఏరియాను కూడా అందుబాటులో ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Watch Online Movies With Close Friends on Netflix

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X