రియల్‌మి నార్జో 30 4G/5G, స్మార్ట్‌టీవీ లాంచ్ ఈవెంట్‌ను చూడడం ఎలా??
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇండియాలో ఈ రోజు కొత్తగా తన యొక్క కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నది. కరోనా కారణంగా ఆన్‌లైన్ పద్దతిలో ఈ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో 4G మరియు 5G వేరియంట్లలో లభించే రియల్‌మి నార్జో 30 స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయనున్నాయి. వీటితో పాటుగా కంపెనీ కొత్త రియల్‌మి బడ్స్ Q2 మరియు కొత్త స్మార్ట్ టివి లను కూడా విడుదల చేయనున్నది. ఈ ఆన్‌లైన్ ఈవెంట్ ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం కానున్నది. పైన పేర్కొన్న అన్ని ఉత్పత్తులపై మీకు ఆసక్తి ఉంటే కనుక మరియు వాటి యొక్క అన్ని వివరాలను తెలుసుకోవడానికి ఈవెంట్ ను వీక్షించండి. ఈ ఈవెంట్‌ను ఎలా చూడాలో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నేటి రియల్‌మి ఈవెంట్‌ను లైవ్ లో ఎక్కడ చూడవచ్చు?
సాధారణంగా రియల్‌మి సంస్థ ఎప్పుడు తన కొత్త ఉత్పత్తులను ఆన్‌లైన్ పద్దతిలో విడుదల చేయడానికి ఉపయోగించే రియల్‌మి యొక్క యూట్యూబ్ ఛానెల్ లో ఈ రోజు లాంచ్ ఈవెంట్‌ను లైవ్ లో చూడవచ్చు. ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన అన్ని రకాల అప్ డేట్ లను మీరు ట్రాక్ చేయాలనుకుంటే మీరు సంస్థ యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు మరిన్నింటికి కూడా వెళ్ళవచ్చు.

రియల్‌మి కొత్త ఉత్పత్తుల వివరాలు
** రియల్‌మి నార్జో 30 ఫోన్ యొక్క 4G వేరియంట్ కొన్ని మార్పులు మినహా 5G మోడల్ మాదిరిగానే స్పెసిఫికేషన్స్ లను కలిగి ఉంటుంది అని భావిస్తున్నారు. ఇది మీడియాటెక్ హెలియో G95 SoC మరియు 30W ఫాస్ట్ ఛార్జింగ్ స్పెసిఫికేషన్స్ లను కలిగి ఉంటుంది. ఇది బహుళ ర్యామ్ / స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తూ 11,999 రూపాయల నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

** రియల్‌మి బడ్స్ Q2 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బాస్ పై దృష్టి పెట్టడం, 10mm డ్రైవర్, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ వంటి వాటి మద్దతుతో రూ.5000 పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
**32-అంగుళాల స్మార్ట్ టీవీ క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్‌తో ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, డాల్బీ ఆడియోతో 24W క్వాడ్ స్టీరియో స్పీకర్లు, గూగుల్ అసిస్టెంట్‌కు మద్దతు వంటి ఫీచర్లను కలిగి ఉండి రూ.30,000 లోపు ధర విభాగంలో లభించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications