కోవిడ్-19 PF అడ్వాన్స్ ను ఉమాంగ్ యాప్‌ ద్వారా విత్డ్రా చేయడం ఎలా?

|

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మొదలైన తర్వాత మనందరి జీవితాల్లో భయం చాలా వరకు పెరిగింది. అయితే డెల్టా వేరియంట్ కంటే Omicron వేరియంట్ తక్కువ ప్రమాదకరమైనదిగా పరిగణించబడినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రజల కోసం కొత్తగా ఒక సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం ఉద్యోగులు కరోనా బారిన పడినప్పుడు మరియు మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో రెట్టింపు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించారు.

EPFO

అత్యవసర పరిస్థితుల్లో అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఇప్పుడు మీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ నుండి తక్షణ ప్రాతిపదికన 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం మీరు మీ EPFO ఫండ్ నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే మీరు సులభంగా 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు అని జూన్ 1, 2021న ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. EPFO ఖాతాదారులు ముందస్తు సౌకర్యాన్ని పొందాలనుకుంటే కనుక వారు EPFO వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు UMANG యాప్ ద్వారా మీ PF అకౌంట్ నుండి అడ్వాన్స్ మొత్తానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

EPF

ఆన్‌లైన్‌లో EPF అకౌంట్ నుండి డబ్బును విత్డ్రా చేసుకోవడానికి మీరు తప్పనిసరిగా యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని కలిగి ఉండాలి. ఇది కాకుండా ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. ఆధార్, పాన్ మరియు ఇతర బ్యాంక్ వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలి.

ఉమాంగ్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోనే విధానం
 

ఉమాంగ్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోనే విధానం

స్టెప్ 1: మీ పరికరాన్ని బట్టి గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ ప్లే స్టోర్ నుండి ఉమాంగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 2: యాప్‌ని ఓపెన్ చేసి "కొత్త వినియోగదారు"ని ఎంచుకోండి.

స్టెప్ 3: 'రిజిస్ట్రేషన్' స్క్రీన్‌పై మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి 'ప్రొసీడ్' ను ఎంచుకోండి. ఆ తర్వాత మొబైల్ నంబర్ వెరిఫికేషన్ పేజీ కనిపిస్తుంది.

స్టెప్ 4: OTPని నమోదు చేసి ఆపై MPINని సెట్ చేయడానికి కొనసాగండి. MPINని టైప్ చేసిన తర్వాత 'MPINని నిర్ధారించండి'పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: 'కొనసాగించు' ఎంచుకుని సెక్యూరిటీ ప్రశ్నకు సమాధానమిచ్చి ముందుకు కొనసాగండి.

స్టెప్ 6: మీరు లింక్ చేయాలనుకుంటే మీ ఆధార్ నంబర్‌ని నమోదు చేయండి లేదా 'ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్'కి 'స్కిప్' క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ సమాచారాన్ని నమోదు చేసి 'సేవ్ అండ్ ప్రొసీడ్'పై క్లిక్ చేయాలి.

స్టెప్ 7: దీని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది మరియు మీరు హోమ్ స్క్రీన్‌కి మళ్లించబడతారు.

స్టెప్ 8: ఆ తర్వాత మీరు మీ ఆధార్ నంబర్‌ని ఉపయోగించి యాప్‌కి లాగిన్ అవుతారు.

స్టెప్ 9: ఈ సమాచారం మొత్తం e-KYC కోసం ఉపయోగించబడుతుంది.

స్టెప్ 10: ప్రొఫైల్‌ని సృష్టించిన తర్వాత ఉమంగ్ ప్రొఫైల్ ఆటోమేటిక్‌గా ఆధార్ సమాచారాన్ని కాపీ చేస్తుంది.

 

ఉమాంగ్ యాప్‌ని ఉపయోగించి డబ్బును విత్డ్రా చేసే విధానం

ఉమాంగ్ యాప్‌ని ఉపయోగించి డబ్బును విత్డ్రా చేసే విధానం

స్టెప్ 1: మొబైల్ యాప్ సర్వీసును ఉపయోగించడానికి మీ ఫోన్‌లో యాప్‌ని తెరిచి లాగిన్ చేయండి.

స్టెప్ 2: డ్రాప్-డౌన్ మెను నుండి 'ఆల్ సర్వీస్' ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 3: ఇప్పుడు 'EPFO' కోసం శోధించండి.

స్టెప్ 4: డ్రాప్-డౌన్ మెను నుండి 'రైజ్ క్లెయిమ్' ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 5: OTPని రూపొందించడానికి మీరు మీ EPF UAN నంబర్‌ను నమోదు చేయాలి.

స్టెప్ 6: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.

స్టెప్ 7: ఇప్పుడు విత్డ్రా రకాన్ని ఎంచుకుని ఫారమ్‌ను పూర్తిగా పూరించండి.

స్టెప్ 8: అభ్యర్థన సమర్పించబడిన తర్వాత మీరు క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్‌ను పొందుతారు.

స్టెప్ 9: మీ విత్డ్రా రిక్వెస్ట్ ని ట్రాక్ చేయడానికి రిఫరెన్స్ నెంబర్ ను ఉపయోగించవచ్చు.

స్టెప్ 10: ఈ యాప్ పెన్షన్ విత్డ్రా, కోవిడ్-19 అడ్వాన్స్ మరియు ఎంప్లాయీ పాస్‌బుక్ యాక్సెస్ కోసం కూడా ఉపయోగించవచ్చు.

స్టెప్ 11: సభ్యులు స్కీమ్ సర్టిఫికేట్, UAN యాక్టివేషన్ మరియు కేటాయింపును కూడా అభ్యర్థించవచ్చు.

 

Best Mobiles in India

English summary
How To Withdraw Covid-19 PF Advance Fund Through Umang App Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X