పీఎఫ్ విత్‌డ్రా ఇక ఆన్‌లైన్‌లోనే.. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్

ఉద్యోగులు పీఎఫ్ విత్ డ్రాయల్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

|

ఉద్యోగులు పీఎఫ్ విత్ డ్రాయల్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రెస్ నోట్‌ ప్రకారం ఉద్యోగులు ఇక పై తమ పీఎఫ్ విత్ డ్రాయల్ ప్రాసస్‌ను ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయవల్సి ఉంటుంది. యూఏఎన్ (యూనివర్శల్ అకౌంట్ నెంబర్) పోర్టల్లోకి లాగిన్ అయి ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆ శాఖ వెల్లడించింది. యూఏఎన్ అకౌంట్, ఆధార్‌తో లింక్ అయి ఉన్నట్లయితే పీఎఫ్ విత్ డ్రాయల్ ప్రాసెస్ మూడే మూడు గంటల్లో ముగుస్తుందని ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ తెలిపింది. పీఎఫ్ ను ఆన్ లైన్ ద్వారా విత్ డ్రా చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

3 వేరియంట్లలో దిగిన Redmi 5, భారీ ఆఫర్లతో జియో..3 వేరియంట్లలో దిగిన Redmi 5, భారీ ఆఫర్లతో జియో..

మీ వద్ద ఉంచుకోవల్సిన వివరాలు..

మీ వద్ద ఉంచుకోవల్సిన వివరాలు..

ముందుగా మీకు కేటాయించబడిన యూనివర్శల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను మీవద్ద సిద్ధంగా ఉంచుకోండి. ఆధార్ నెంబర్‌తో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నెంబర్ కూడా వర్కింగ్ కండీషన్‌లో ఉండేలా చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ అలానే బ్రాంచ్ డిటెయిల్స్‌ను కూడా సిద్ధంగా ఉంచుకోండి. మీ సర్వీస్ 5 సంవత్సరాలలోపే అయినట్లయితే ఆధార్ అలానే పాన్ కార్డులు లింక్ అయి ఉండాలి.

UAN portalలోకి లాగిన్ అవ్వండి..

UAN portalలోకి లాగిన్ అవ్వండి..

పైన పేర్కొన్న వివరాలన్ని మీ వద్ద సిద్ధంగా ఉంచుకున్న తరువాత, మీ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా UAN portalలోకి లాగిన్ అవ్వండి. అకౌంట్ లోకి లాగిన్ అయిన తరువాత మీ KYC డిటెయిల్స్ వెరిఫై కాబడ్డాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ కానట్లయితే తప్పనిసరిగా వెరిఫై చేసుకోవల్సి ఉంది.

నగదు మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..

నగదు మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..

తదుపరి స్టెప్‌లో భాగంగా full PF Settlement ఆప్షన్‌ను మీరు సెలక్ట్ చేసుకుని మీ పీఎఫ్ క్లెయిమ్‌ను వన్‌టైమ్ పాస్‌వర్డ్ ద్వారా చెక్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ వన్‌టైమ్ పాస్‌వర్డ్ అనేది మీ యూఏఎన్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు పంపబడుతుంది. తదుపరి స్టెప్‌లో భాగంగా ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ మీ వివరాలను పూర్తిగా వెరిఫై చేసి క్లెెయిమ్ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్‌లోకి ప్రాసెస్ చేస్తుంది.

 

 

ఒక్క మిస్డ్ కాల్‌తో ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోండి

ఒక్క మిస్డ్ కాల్‌తో ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోండి

స్మార్ట్‌ఫోన్లో ఈపీఎఫ్ యాప్‌ను ఇన్‌స్టాల్..
స్మార్ట్‌ఫోన్లో ఈపీఎఫ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం, లేదా మిస్‌డ్ కాల్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ మొబైల్ యాప్ ప్రస్తుతం ఈపీఎఫ్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్ యూజర్లు ఈపీఎఫ్ యాప్‌ను..

ఆండ్రాయిడ్ యూజర్లు ఈపీఎఫ్ యాప్‌ను..

ఆండ్రాయిడ్ యూజర్లు ఈపీఎఫ్ యాప్‌ను www.Epfindia.com వెబ్‌సైట్‌కు వెళ్లి అందులోని ‘అవర్ సర్వీసెస్' నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో లేదు. వెబ్‌సైట్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో సభ్యుడు, ఉద్యోగి, పెన్షనర్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి.

మీరు దేనికి చెందితే దాన్ని ఎంచుకోవాలి..

మీరు దేనికి చెందితే దాన్ని ఎంచుకోవాలి..

మీరు దేనికి చెందితే దాన్ని ఎంచుకోవాలి. యాక్టివేటెడ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను ఎంటర్ చేయడం ద్వారా బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ ప్రతి ఉద్యోగికీ యూఏఎన్‌ను కేటాయిస్తోంది. ఉద్యోగులు వారి సంస్థ నుంచి ఈ నంబర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

మిస్‌డ్ కాల్ సర్వీస్

మిస్‌డ్ కాల్ సర్వీస్

మీ మొబైల్‌లో ఇంటర్నెట్ సౌలభ్యం లేదనుకోండి. అప్పుడు ఏవిధంగా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలి. మీ వద్ద యూఏఎన్ ఉంటే చాలు.మీరు 011-22901406 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. అప్పుడు ఈపీఎఫ్‌ఓ మీ మొబైల్ నంబర్‌కు పీఎఫ్ నంబర్, పేరు, పుట్టిన తే ది వంటి వివరాలను ఎస్‌ఎంఎస్ చేస్తుంది. అప్పుడు మీరు మీ యూఏఎన్ నంబర్‌ను మీ ఆధార్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్, పర్మనెంట్ అకౌంట్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.ఈ పనిని మీ సంస్థ చేస్తుంది. ఇలా అనుసంధాన ప్రక్రియ పూర్తైన తర్వాత మీరు మిస్‌డ్ కాల్ ఇచ్చిన ప్రతిసారీ ఈపీఎఫ్‌వో మీకు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను తెలియజేస్తుంది.

ఎస్‌ఎంఎస్‌తో

ఎస్‌ఎంఎస్‌తో

ఈపీఎఫ్ వివరాలు మీకు ఒకవేళ యాక్టివేటేడ్ యూఏఎన్ లేకపోతే అప్పుడేం చేస్తారు. అప్పుడు ఈపీఎఫ్‌ఓహెచ్‌ఓ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏసీటీ అని టైప్ చేసి కామా పెట్టి తర్వాత యూఏఎన్ నంబర్‌ను,22 డిజిట్ల పీఎఫ్ నంబర్‌ను ఎంటర్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపి మీ యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత..

యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత..

యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్‌ఓహెచ్‌ఓ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి యూఏఎన్ అని టైప్ చేసి మళ్లీ స్పేస్ ఇచ్చి ఈఎన్‌జీ అని ఎంటర్ చేసి పై నంబర్‌కే ఎస్‌ఎంఎస్ పంపాలి. అప్పుడు మీకు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి.

Best Mobiles in India

English summary
4 Steps to Withdraw EPF Online For Final Settlement. Nowadays, provisions for most of the financial transactions have been made online which means that now EPF members don't need to visit their employer or the EPFO staff and a claim can be settled within a few hours.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X