Home
How to

AEPS ఆధార్‌ నంబర్‌ ద్వారా కూడా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని మీకు తెలుసా?.. పూర్తి వివరాలు

భారత్‌లో డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. కోవిడ్‌ అనంతరం డిజిటల్ చెల్లింపులు మరింత అధికమయ్యాయి. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నగదు ద్వారా చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. సాధారణంగా బ్యాంకులు లేదా ATM ల నుంచి నగదు విత్‌డ్రాలు చేస్తున్నారు. అయితే ఆధార్‌ కార్డును వినియోగించి కూడా నగదు విత్‌డ్రా చేయవచ్చు. ఇందుకోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (NPCI) ఆధార్‌ ఎనేబుల్డ్ పేమెంట్‌ సిస్టమ్ (AEPS- Aadhaar Enabled Payment System) ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆధార్‌ ఆధారిత పేమెంట్‌ వ్యవస్థలో బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌, ఆధార్‌ కార్డు నంబర్‌ ద్వారా బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించవచ్చు. బ్యాంకింగ్‌ ఏజెంట్లు, మైక్రో ఏటీఎంల వద్ద ఈ తరహా లావాదీవీలు నిర్వహించవచ్చు. నగదు బదిలీ, నగదు విత్‌డ్రా, బ్యాలెన్స్‌ తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ లింక్ చేయాల్సి ఉంటుంది.

You can withdraw by using aadhaar Enabled payment system

ఆధార్‌ నంబర్‌ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకొనేందుకు ఆధార్‌ ఎనేబుల్డ్ పేమెంట్‌ సిస్టమ్ ఉన్న బ్యాంకింగ్‌ ఏజెంట్‌ లేదా మైక్రో ATM వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. మైక్రో ATM వద్దకు వెళ్తే.. అక్కడ 12 అంకెల ఆధార్‌ కార్డు నంబర్‌ను నమోదు చేయాలి. అనంతరం బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాత అనేక ఆప్షన్‌లు కనిపిస్తాయి.

ఆ ఆప్షన్‌లో నుంచి క్యాష్‌ విత్‌డ్రాను ఎంచుకోవాలి. ఎంత నగదును విత్‌డ్రా చేయాలని భావిస్తున్నారో ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆధార్‌ నంబర్ లింక్‌ చేసి ఉన్న బ్యాంక్‌ అకౌంట్ నుంచి నగదు డెబిట్‌ అవుతాయి. అనంతరం అక్కడున్న బ్యాంకింగ్‌ ఏజెంట్ ఆ నగదును మీకు అందిస్తారు. ఇందుకు సంబంధించిన SMS కూడా రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కు వస్తుంది.

ఆధార్‌ ఎనేబుల్డ్ పేమెంట్‌ సిస్టమ్ ను కలిగి ఉన్న బ్యాంకులు నగదు విత్‌డ్రా పై పరిమితిలు విధిస్తాయి. సాధారణంగా ఈ పరిమితి రూ.10,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు ఈ ఆధార్‌ ఆధారిత పేమెంట్‌ వ్యవస్థ ద్వారా సేవలు అందించవు. భద్రతాపరమైన నిర్ణయాలు సహా ఇతర కారణాలతో సేవలు అందించడం లేదు.

ఈ తరహా వ్యవస్థలు గ్రామీణ ప్రాంతాలు సహా బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీపైన పూర్తిగా అవగాహన లేని వినియోగదారులు కూడా బయోమెట్రిక్‌ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ తరహా వ్యవస్థ ద్వారా ATM లపై భారం తగ్గుతుంది. భారత్‌లో అనేక జాతీయ బ్యాంకులు ఈ వ్యవస్థ ద్వారా సేవలు అందిస్తున్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to withdraw money from bank account using aadhaar number here is the detailed guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X