PF Withdraw Online ఆన్‌లైన్‌లో PF అకౌంట్ నుంచి నగదు ఎలా విత్‌డ్రా చేయాలి..?
ఉద్యోగులు అందరూ ప్రస్తుతం PF ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లను కలిగి ఉంటున్నారు. మధ్య తరగతి ఉద్యోగులు అత్యవసర సమయాల్లో పీఎఫ్ ఖాతాల్లోని EPFO (Employees Provident Fund ) నగదును విత్‌డ్రా చేసుకొని వినియోగించుకొనేందుకు అవకాశం ఉంది. అనారోగ్యం, ఇంటి నిర్మాణం, ఇళ్ల కొనుగోలు, ఎడ్యూకేషన్, పెళ్లి సహా ఇతర అత్యవసర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే గతంలో పీఎఫ్ అకౌంట్ ల నుంచి నగదును విత్‌డ్రా చేసేందుకు ఎంతో కష్టపడాల్సి ఉండేది.
ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా సులభంగా వినియోగించుకొనేందుకు (How to Withdraw PF Amount online) అవకాశం ఉంది. అయితే పీఎఫ్ ఖాతా నుంచి నగదును విత్‌డ్రా చేయాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత కావాల్సిన సమాచారం, పత్రాల గురించి తెలుసుకోవడం మరియు ఒకే దగ్గరకి చేర్చుకోవడం వల్ల మన పని సులభతరం కానుంది.

ఉద్యోగులు అంతా పీఎఫ్ ఖాతాలను కలిగి ఉంటున్నా.. నగదును ఎలా విత్‌డ్రా చేయాలనే విధానంపై చాలా మందికి అవగాహన లేదు. ఆధార్, బ్యాంకు వివరాలు, UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) సాయంతో సులభంగా PF ఖాతా నుంచి నగదును సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో రెండు వారాల వరకు సమయం తీసుకొన్నా.. ప్రస్తుతం వారం కంటే తక్కువ రోజుల్లోనే అకౌంట్‌లోకి నగదు బదిలీ జరుగుతోంది.
PF అకౌంట్ నుంచి నగదు విత్‌డ్రా చేసుకొనేందుకు ముందుగా UAN నంబర్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. EPFO వెబ్‌సైట్‌లో హోం పేజీలోనే ఈ యాక్టివేట్ UAN అనే ఆప్షన్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. KYC కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. PF నగదు విత్‌డ్రా కోసం EPFO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
స్టెప్ 1 : EPFO వెబ్‌సైట్‌లోకి UAN, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ కావాలి.
స్టెప్ 2 : అనంతరం ఆన్‌లైన్ సర్వీస్ ట్యాప్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 3 : ఆ తర్వాత Claim కోసం Form 31, 19, 10C, 10D లలో మీకు సంబంధించిన వాటిని ఎంచుకోవాలి.
స్టెప్ 4 : అనంతరం వచ్చిన ఆన్‌లైన్ Form ను పూర్తి వివరాలతో నింపాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 5 : ఆన్‌లైన్ Claim ను పూర్తి చేశాక.. Submit చేసే ముందు వివరాలను మరోసారి సరిచూసుకోవాలి.
స్టెప్ 6 : సబ్‌మిట్ చేశాక.. మీకు ఒక ట్రాకింగ్ ఐడీ వస్తుంది. మరియు ధ్రువీకరణ కోసం SMS కూడా వస్తుంది.
అయితే కొన్నిసార్లు PF నగదును విత్‌డ్రా చేసేందుకు అదనపు సర్టిఫికేట్‌లు అప్‌లోడ్ చేయాల్సి రావచ్చు. PF విత్‌డ్రా రిక్వస్ట్ ఆమోదం పొందాక.. UAN లింక్ చేసిన బ్యాంకు అకౌంట్ లో నగదు జమ కానుంది. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
పీఎఫ్ నగదును ఆఫ్‌లైన్ లోనూ విత్‌డ్రా చేసేందుకు అవకాశం ఉంది. EPFO ప్రాంతీయ కార్యాలయాల్లో ఇందుకు సంబంధించిన దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది. వీటితోపాటు అవసరమైన ధ్రువపత్రాలను కూడా దరఖాస్తులతోపాటు సమర్పించాలి.


Click it and Unblock the Notifications