గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారా ఇతర అప్లికేషన్ల పదాల అర్థాలను తెలుసుకోవచ్చు సింపుల్ టిక్స్

Posted By: ChaitanyaKumar ARK

గూగుల్ ట్రాన్స్లేట్ మరియు దాని ఉపయోగం: అత్యధిక స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉపయోగించే అప్లికేషన్స్ లో మొదటి పది స్థానాలలో ఉన్న ప్రముఖ అప్లికేషన్ గా గూగుల్ ట్రాన్స్లేట్ ను చెప్పుకోవచ్చు. డిక్షనరీ వాడేవారి కన్నా గూగుల్ ట్రాన్స్లేట్ ను వాడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది . అంత ప్రాచుర్యం కలిగిన ఈ గూగుల్ ట్రాన్స్లేటర్ మొదట్లో అత్యధికులు వేరే భాష వారితో మాట్లాడునప్పుడు అర్ధం కాని పదాలను తెలుసుకోవడానికి లేక తాము ఏదైనా మాటను వారి భాషలో తర్జుమా చేసి మాట్లాడుటకు వినియోగించేవారు.

గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారా ఇతర అప్లికేషన్ల పదాల అర్థాలను తెలుసుకోండి

డిక్షనరీ అప్లికేషన్లలో అత్యధిక భాషలలోని పదాలకు అర్ధం తెలుసుకొనుటకు వీలుపడదు. కాని ఆ సౌకర్యాన్ని గూగుల్ ట్రాన్స్లేటర్ వినియోగదారులకు కల్పించడంలో సఫలం అయింది. దీని తర్వాత Microsoft వంటి సంస్థలు సైతం ట్రాన్స్లేటర్ అప్లికేషన్ ను ప్రవేశపెట్టినా కూడా, వినియోగదారులు గూగుల్ ట్రాన్స్లేటర్ వైపే ఎక్కువ మొగ్గు చూపారు.

అద్బుతమైన ఫీచర్ల ఖజానా : ఈ అప్లికేషన్ లో ఆఫ్లైన్ లో మనం ఎంచుకున్న భాష యొక్క డేటాని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా ఆప్లికేషన్ చక్కగా పనిచేస్తుంది. దానికి తోడు ఈమధ్యనే మరికొన్ని ఫీచర్లని ప్రవేశపెట్టారు. అక్షరాలని రాయడం ద్వారా మరియు కెమెరాతో అక్షరాలను స్కాన్ చెయ్యడం ద్వారా పదాలను ,వాక్యాలను తర్జుమా చేసి దాని భావాన్ని మనం ఎంచుకున్న భాషలోనికి చూపెడుతుంది. ఈ ఫీచర్ల కారణంగా ఖచ్చితం గా మొబైల్ లో ఉండవలసిన అప్లికేషన్ల జాబితాలోకి గూగుల్ ట్రాన్స్లేట్ చేరింది.

వేరొక అప్లికేషన్ లోని అక్షరాలను తర్జుమా చెయ్యుట:

ఈమధ్య కాలం లో వచ్చిన అప్డేట్ లో ఈ సౌకర్యం కల్పించబడినది. గూగుల్ ట్రాన్స్లేట్ అప్లికేషన్ లో సెట్టింగ్స్ లో “tap to translate “ అను విభాగంలో ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఏ ఇతర అప్లికేషన్లలోని అక్షరాలను సైతం ఇది తర్జుమా చేసి చూపుతుంది.

ఉదాహరణకు ఫేస్ బుక్ అప్లికేషన్ లో ఏదైనా తెలుగు కంటెంట్ ని కాపీ చేసినప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ ఆటోమేటిక్ గా ఆ భాషను కనుగొని దానిని సెట్టింగ్స్ లో “preferred languages” లో మీరు ఇచ్చిన భాషలోనికి తర్జుమా చేసి చూపుతుంది.

అదే విధం గా ఏ ఇతర అప్లికేషన్లలో అయినా అర్ధం కాని పదాలను, వాక్యాలను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఆ అక్షరాలను లాంగ్ ప్రెస్ తో సెలెక్ట్ చేసుకుని కాపీ చేయడం ద్వారా, ట్రాన్స్లేటర్ మనకు అర్ధం అయ్యే భాషలో పక్కన బబుల్ నోటిఫికేషన్ ద్వారా చూపెడుతుంది. ఏంతో ఉపయోగకరమైన ఈ అప్లికేషన్ ను పొందుటకు ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యగలరు.  

అత్యంత తక్కువ ధరకే అంతర్జాతీయ విమాన టికెట్లు బుక్ చేయాలనుకుంటున్నారా..?

English summary
Google Translate is one of the very useful apps to help you when you are in a new country where they speak a different language that you do not know.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot