ఐఫోన్‌ను అన్‌లాక్ చేయటం ఏలా..?

Posted By:

సాధారణంగా ఓ నెట్‌వర్క్ క్యారియర్ ద్వారా యాపిల్ ఐఫోన్‌ను కొనుగోలు చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఫోన్ సంబధిత నెట్‌వర్క్‌తో లాకై ఉంటుంది. ఈ క్రమంలో ఆ కాంట్రాక్ట్ ముగిసేంత వరకు ఆ ఫోన్‌లో వేరొక నెట్‌వర్క్‌ను ఉపయోగించటం సాధ్యపడదు.

ఐఫోన్‌ను అన్‌లాక్ చేయటం ఏలా..?

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

కాంట్రాక్ట్  ముగియకుండానే ఐఫోన్‌లో వేరొక నెట్‌వర్క్‌ను వినియోగించుకోవాలనుకుంటే చాలా రిస్క్ తీసుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా  ఐఫోన్‌ను అన్‌లాక్ చేయాలంటే సంబంధిత అన్‌లాక్ సాఫ్ట్‌‌వేర్‌ను సదరు డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయవల్సి ఉంటుంది. అయితే, ఈ  అన్‌లాక్ సాఫ్ట్‌వేర్‌ను యాపిల్ అంత సలువుగా దొరకనివ్వదు. ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు పలు ఉత్తమమైన మార్గాలు....

నెట్‌వర్క్ క్యారియర్‌ను సంప్రదించండి

ఐఫోన్‌ను అన్‌లాక్ చేయటం ఏలా..?

దాదాపు అన్ని ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ క్యారియర్లు కాంట్రాక్ట్ గడువు ముగిసిన తరువాతనే ఫోన్ అన్‌లాకింగ్‌కు ఉపకరిస్తాయి.  కాంట్రాక్ట్ సమయం గడవక ముందే మీరు మీ ఐఫోన్‌ను అన్ లాక్ చేయదలచుకుంటే కొంత మొత్తాన్నివాళ్లకి చెల్లిస్తే అన్‌లాక్ చేసే  అవకాశముంది. లేదా మీరు వేరొక దేశానికి వెళిపోతున్నట్లు చెబితే అన్‌లాక్ చేసే అవకాశముంది.

వేరొక నెట్‌వర్క్ క్యారియర్‌ను సంప్రదించండి:

ఐఫోన్‌ను అన్‌లాక్ చేయటం ఏలా..?

మీరు మారదలచుకుంటున్న నెట్‌వర్క్ క్యారియర్‌ను సంప్రదించి ఐఫోన్ అన్‌లాక్ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లినట్లయితే మీ ఐఫోన్ కథ సుఖాంతమయ్యే అవకాశముంది.

పెయిడ్ సర్వీసును ఆశ్రయించండి:

ఐఫోన్‌ను అన్‌లాక్ చేయటం ఏలా..?

ఫోన్‌లను అన్ లాక్ చేస్తామంటూ అనేక పెయిడ్ సర్వీసులు ఆన్‌లైన్‌లో ప్రకటనలను గుప్పిస్తున్నాయి. వాటిలో నమ్మకమైన  సర్వీసును ఆశ్రయించండి.

అన్‌లాక్ చేసే ముందు ఆలోచించుకోండి:

ఐఫోన్‌ను అన్‌లాక్ చేయటం ఏలా..?

మీ ఐఫోన్‌ను అన్‌లాక్ చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఫోన్‌ను అన్‌లాక్ చేయటం ద్వారా కంపెనీ అధికారిక  అప్‌డేట్ లు అందే అవకాశం ఉండదు.

English summary
How to Unlock an iPhone. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot