ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా యూట్యూబ్‌లోకి వీడియోలను అప్‌లోడ్ చేయటమెలా..?

Posted By:

 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా యూట్యూబ్‌లోకి వీడియోలను అప్‌లోడ్ చేయట
యూట్యూబ్, ఓ వీడియో ప్రపంచం. అంశం ఏదైనా సరే సెర్చ్ కొడితే చాలు కావల్సి వీడియోలను మీముందు ప్రత్యక్షమవుతాయి. నేటి టెక్ చిట్కా భాగంగా మీరు చిత్రీకరించిన వీడియోలను మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారానే యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసే విధానాన్ని తెలుసుకుందాం.

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వర్షన్ అయినట్లయితే యూట్యూబ్ అప్లికేషన్ ముందుగానే ప్రీలోడై ఉంటుంది. ఒక వేళ మీది పాత వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అయినట్లయితే ‘ఆండ్రాయిడ్ యూట్యూబ్ అప్లికేషన్'ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఇన్స్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

వీడియో అప్‌లోడింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి యూట్యూబ్ అకౌంట్‌లోకి లాగిన్ కావాలి. తరువాత ఫోన్‌లోని మెనూ బటన్‌ను క్లిక్ చేసి దిగువ భాగంలో కనిపించే ‘అప్‌లోడ్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాతి చర్యగా మీరు అప్‌చేసే వీడియో ప్రపంచం చూడదగినదయితే పబ్లిక్ అప్షన్‌ను సెలక్ట్ చేసుకుని సదరు వీడియో ఫైల్‌ను ఆటాచ్ చేయాల్సి ఉంటుంది.

మీరు అప్‌లోడ్ చేసే వీడియో సైజును బట్టి నెట్‌వర్క్ స్సీడ్ ఉంటుంది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినట్లయితే మీ వీడియో ఆన్‌లైన్ ప్రపంచంలోకి విజయవంతంగా అడిగిపెట్టినట్లే. ఈ వీడియోను మీ మిత్రులకు సైతం షేర్ చేుసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot