ఐఫోన్ యూజర్ల కోసం ‘Files’ యాప్, బోలెడన్ని ఉపయోగాలు
ఐఫోన్‌లలోని వ్యక్తిగత ఫైల్స్‌ను నచ్చిన విధంగా ఆర్గనైజ్ చేసుకునేందుకుగాను సరికొత్త అప్లికేషన్‌ను యాపిల్ సంస్థ అందుబాటులోకి తీసుకుచ్చింది. Files పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. iOS 11, ఆపై వర్షన్ సాఫ్ట్‌వేర్ పై రన్ అయ్యే ఐఫోన్‌లను మాత్రమే ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. ఫైల్స్ యాప్ ద్వారా ఐఫోన్ యూజర్లు తమ ఐక్లౌడ్ అకౌంట్లలోని ఫైల్స్‌ను కావల్సిన విధంగా మేనేజ్ చేసకునే వీలుంటుంది.

థర్డ్ పార్టీ యాప్‌లను కూడా యాడ్ చేసుకునే అవకాశం..
ఐఫోన్ యూజర్లను ఉద్దేశించి ఆపిల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఫైల్స్ యాప్‌లో బాక్స్, డ్రాప్‌బాక్స్,
వన్‌డ్రైవ్ వంటి థర్డ్‌పార్టీ క్లౌడ్ యాప్‌లను యాడ్ చేసుకుని వాటిలోని ఫైల్స్‌ను యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. ఫైల్స్ యాప్‌లో థర్డ్ పార్టీ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..
స్టెప్ 1 : ముందుగా మీకు అవసరమైన థర్డ్ పార్టీ క్లౌడ్ యాప్‌లను ఐఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.
స్టెప్ 2 : తురువాతి స్టెప్‌లో భాగంగా ఫైల్స్ యాప్‌ను ఓపెన్ చేసి లొకేషన్స్‌లోని Edit సెక్షన్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 3 : ఎడిట్ సెక్షన్‌లోకి వెళ్లిన తరువాత థర్డ్ పార్టీ యాప్స్‌కు సంబంధించిన టాగిల్‌ను టర్న్ ఆన్ చేసుకుని Done బటన్ పై టాప్ చేసినట్లయితే థర్డ్ పార్టీ క్లౌడ్ యాప్స్‌ను ఫైల్స్ యాప్ విజయవంతంగా యాడ్ చేసుకోగలుగుతుంది.

ఫైల్స్‌ను సక్రమంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు..
ఫైల్స్ యాప్ ద్వారా ఐక్లౌడ్ డ్రైవ్‌లోని ఫైల్స్‌ను సక్రమంగా ఆర్గనైజ్ చేసుకునే వీలుంటుంది. ఒక డివైస్‌లో చేసిన ఎడిట్స్ ఆటోమెటిక్‌గా ఇతర డివైసెస్‌లో అప్‌డేట్ కాబడతాయి.

ఎక్కడి నుంచైనా ఫైల్ షేరింగ్...
ఫైల్స్ యాప్ సహాయంతో ఐక్లౌడ్ డ్రైవ్‌లో స్టోర్ అయిన ఫైల్స్‌ను నేరుగా అక్కడి నుంచే మిత్రులకు షేర్ చేసుకునే వీలుంటుంది. యాప్‌లో ముందుగా షేర్ చేయాలనుకుంటున్న ఫైల్‌ను సెలక్ట్ చేసుకుని Share icon పై టాప్ చేసినట్లయితే ఫైల్ విజయవంతంగా షేర్ కాబడుతుంది. ఎయిర్‌డ్రాప్, మెసేజెస్, మెయిల్, షేరుడ్ నోట్ వంటి ఆప్షన్స్ ద్వారా ఫైల్స్‌ను షేర్ చేసుకునే వీలుంటుంది.

అవసరంలేని ఫైల్స్‌ను డిలీట్ చేసుకునే అవకాశం..
ఐక్లౌడ్ డ్రైవ్‌లోని అన్‌వాంటెడ్ ఫైల్స్‌ను నేరుగా ఫైల్స్ యాప్ ద్వారానే డిలీట్ చేసుకునే వీలుంటుంది. ఫైల్‌ను సెలక్ట్ చేసుకుని delete icon పై క్లిక్ చేసినట్లయితే ఫైల్ ఆటోమెటిక్‌గా డిలీట్ కాబడుతుంది. డిలీట్ చేసిన ఫైల్స్ ఐక్లౌడ్ నుంచి రీసెంట్ డిలీటెడ్ ఫోల్డర్‌లోకి మూవ్ కాబడతాయి. ఒకవేళ మీరు ఆ ఫైల్‌ను తిరిగి పొందాలనుకుంటున్నట్లయితే, ఆ ఫోల్డర్‌లోకి వెళ్లి 30 రోజుల్లోపు రిట్రైవ్ చేసుకునే వీలుంటుంది.


Click it and Unblock the Notifications