గూగుల్ క్రోమ్‌క్యాస్ట్‌ను ఉపయోగించటం ఏలా..?
గూగుల్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన పెన్‌డ్రైవ్ తరహా గాడ్జెట్ ‘క్రోమ్‌క్యాస్ట్'. ఈ యూఎస్బీ తరహా డివైస్ సహాయంతో మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌లోని వీడియోలు, ఫోటోలు ఇంకా మ్యూజిక్‌ను స్మార్ట్‌టీవీలో ప్లే చేసుకోవచ్చు. మీ సూచనలు ఆధారంగా వెబ్ కంటెంట్‌ను సైతం క్రోమ్‌క్యాస్ట్ స్ట్రీమ్ చేయగలదు.

ఏలా కనెక్ట్ చేయాలి..? యూఎస్బీ డ్రైవ్ తరహాలో ఉండే క్రోమ్‌క్యాస్ట్‌ను ముందుగా టీవికి అనుసంధానించాలి. టీవి ఖచ్చితంగా హెచ్‌డిఎమ్ఐ పోర్ట్‌నుసపోర్ట్ చేసిదిగా ఉండాలి. క్రోమ్‌క్యాస్ట్‌కు కనెక్ట్ అయ్యేందుకు మీ మొబైల్ లేదా కంప్యూటర్‌కు వై-ఫై కనెక్షన్ అలానే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అవసరం.

chromecast.com/setupలోకి వెళ్లి ఓ సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా క్రోమ్‌క్యాస్ట్‌ను సెటప్చే సుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌కు సంబంధించిన వై-ఫై నెట్‌వర్క్ ద్వారా క్రోమ్‌క్యాస్ట్‌కు కనెక్ట్ అయితే చాలు మీ స్మార్ట్‌టీవీ కాస్తా ఆన్‌లైన్ హబ్‌గా మారిపోతుంది. ఇక పై మీరు స్మార్ట్‌ఫోన్‌లలో, టాబ్‌లలో వీక్షించే కంటెంట్‌ను మొత్తాన్ని స్మార్ట్‌టీవీలో ఆస్వాదించవచ్చు.


Click it and Unblock the Notifications








