ఇక డ్రైవింగ్ లైసెన్స్‌తో పనిలేదు.. ఫోన్ ఉంటే చాలు!

Written By:

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. ప్రయాణ సమయాల్లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ బుక్, ఇన్సూరెన్స్ పేపర్స్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్‌లను ఇక పై మీ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

ఇక డ్రైవింగ్ లైసెన్స్‌తో పనిలేదు.. ఫోన్ ఉంటే చాలు!

అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి బెస్ట్ డీల్స్ ఇక్కడే

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న TSTD అనే మొబైల్ యాప్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని, మీ వెహికల్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్‌లను ఈ యాప్‌తో అప్‌డేట్ చేయటం ద్వారా ఈ-లైసెన్స్, ఈ-ఆర్సీ, ఈ-బీమా, ఈ- పొల్యూషన్ వంటి డాక్యుమెంట్లను పొందవచ్చు. మొబైల్ యాప్‌లో నిక్షిప్తమై ఉండే ఈ - డాక్యుమెంట్‌లను ట్రాఫిక్ పోలీసుకులకు చూపిస్తే సరి. ప్రస్తుతానికి బేసిక్ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న TSTD మొబైల్ యాప్ కొత్త ఫీచర్లతో అప్‌డేట్ అవ్వాల్సి ఉంది.

Read More : Delete అయిన మెసేజ్‌లను తిరిగి పొందటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్‌కు అప్లై చేయటం ఎలా..?

ఇక ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకోదలచిన వారు, ముందుగా http://www.aptransport.org/ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో లైసెన్స్ (Licence) అనే మెనూలో లెర్నర్స్ లైసెన్స్ (Learner's Licence) అనే సబ్ మెనూని ఎంచుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్‌కు అప్లై చేయటం ఎలా..?

ఇప్పుడు లెర్నర్స్ లైసెన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లెర్నర్ లైసెన్స్ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవటానికి, మరొకటి లెర్నర్ లైసెన్స్ కోసం డెమో టెస్ట్‌ని బుక్ చేసుకోవటానికి. మనం ముందుగా లెర్నర్ లైసెన్స్ కోసం టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, CLICK HERE TO BOOK LEARNER LICENCE SLOT అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్‌కు అప్లై చేయటం ఎలా..?

అప్పుడు ఓ సెపరేట్ పేజీ/విండో ఓపెన్ అవుతుంది. అందులో మళ్లీ లైసెన్స్ (Licence) అనే మెనూ క్రింద లెర్నర్ సెన్స్ టెస్ట్ (Learner Licence Test) అనే సబ్ మెనూని ఎంచుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్‌కు అప్లై చేయటం ఎలా..?

ఆ తర్వాత మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో లేక ఏ జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్ ధరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ జిల్లాను ఎంచుకున్న తర్వాత మీకు సమీపంలో ఉండే లేదా మీరుకు టెస్ట్‌కు హాజరు కాబోయే సెంటరును ఎంచుకొని సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేయాలి.

ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్‌కు అప్లై చేయటం ఎలా..?

ఆ తర్వాత ఓ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అందులో అకెంలు రెడ్ కలర్‌లో ఉంటే ఆయా తేదీల్లో ఆన్‌లైన్ స్లాట్‌లు అందుబాటులో లేవని, అంకెలు గ్రీన్ కలర్‌లో ఉంటే ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉందని అర్థం.

ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్‌కు అప్లై చేయటం ఎలా..?

క్యాలెండర్‌లో గ్రీన్ కలర్ అంకెలపై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న సమయాలు, స్లాట్‌లు కనిపిస్తాయి. మీకు అనువైన సమయం ఎంచుకున్న తర్వాత సబ్‌మిట్ (SUBMIT)పై క్లిక్ చేయాలి.

ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్‌కు అప్లై చేయటం ఎలా..?

ఆ తర్వాత ఆన్‌లైన్ లెర్నర్స్ లైసెన్స్ అప్లికేషన్ ఫారమ్ (Online Learner's License Application Form) పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సుపై పేరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా నమోదు చేయాలి. దాంతో పాటుగా అక్కడ అన్ని తప్పనిసరి వివరాలను నమోదు చేసి తిరిగి (SUBMIT)పై క్లిక్ చేస్తే మీరు ఎంచుకున్న తేది, సమయానికి టైమ్ స్లాట్ బుక్ అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్‌కు అప్లై చేయటం ఎలా..?

మీరు ఎంచుకున్న తేదీలో ఆ సమయానికి మీరు ఎంచుకున్న ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి టెస్టుకు హాజరయ్యినట్లయితే, మీకు లెర్నర్ లైసెన్స్ వస్తుంది. సాధారణంగా లెర్నర్ లైసెన్స్ చెల్లుబాటయ్యే కాలపరిమితి ఒక నెల వరకు ఉంటుంది. దాని గడువు ముగియక ముందే మీరు మరోసారి ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్ లైసెన్స్‌ను పొందాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Use TSTD TG govt Hyderabad RTA mobile app. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot