ఒకే ఫోన్‌లో రెండు Facebook అకౌంట్‌లను రన్ చేయటం ఎలా..?

చాలా మంది యూజర్లు తమ డివైస్‌లో రెండు ఆండ్రాయిడ్ ఫోన్‌లలో రెండు వేరువేరు Facebook అకౌంట్‌లను ఒకేసారి రన్ చేయాలనుకుంటారు.

ఒకే ఫోన్‌లో రెండు  Facebook అకౌంట్‌లను రన్ చేయటం ఎలా..?

Read More : Bsnl 4జీ సిమ్ పొందటం ఎలా..?

అటువంటి వారి కోసం ఫేస్‌బుక్ రెండు రకాల యాప్స్‌ను ఆఫర్ చేస్తోంది. వీటిని మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ ఫోన్‌లో ఏకకాలంలో మల్టిపుల్ ఫేస్‌బుక్ అకౌంట్‌లను రన్ చేసుకునే అవకాశంల లభిస్తుంది. అది ఏలాగో చూసేద్దామా మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

ముందుగా అఫీషియల్ ఫేస్‌బుక్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. డౌన్‌లోడ్ లింక్. ఈ యాప్‌‍లో మొదటి ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహించుకోండి.

#2

స్టెప్ 2

ఆ తరువాత Facebook Lite Appను కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందండి. డౌన్‌లోడ్ లింక్. ఈ యాప్‌ను 2015లో ఫేస్‌బుక్ లాంచ్ చేసింది. తక్కువ డేటాను మాత్రమే ఖర్చు చేసుకునే ఈ యాప్‌‍లో రెండవ ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహించుకోండి.

 

#3

స్టెప్ 3

ఈ రెండు యాప్స్ మధ్య యూజర్ ఎక్స్‌పీరియన్స్ కాస్తంత తేడాగా ఉంటుంది. మెయిన్ వర్షన్ ఫేస్‌బుక్ యాప్‌తో పోలిస్తే లైట్ వర్షన్ ఫేస్‌‍బుక్ యాప్‌ సింపుల్‌గా కనిపిస్తుంది. 2జీ నెట్‌వర్క్ పరిధిలోనూ లైటర్ వర్షన్ యాప్ పనిచేస్తుంది.

 

మరిన్ని ఫేస్‌బుక్ టిప్స్

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కు సెక్యూరిటీ చాలా అవసరం లేకుంటే ఎవరైనా దూరి అసభ్య పోస్టులు చేసే ప్రమాదం ఉంది .అందుకని సెట్టింగ్స్ లోకి కెళ్లి మీ సెక్యూరిటీని మరింత శక్తివంతంగా ఉండేలా చూసుకోండి. అక్కడ ఉన్న ఆప్సన్ అన్నీ ఓ సారి జాగ్రత్తగా చదివి మీకు కావలిసినివి సెట్ చేసుకోండి.

మరిన్ని ఫేస్‌బుక్ టిప్స్

మీరు మీ ఫేస్‌బుక్ పేజీలో వీడియోలను సేవ్ చేసుకుని తరువాత చూడొచ్చు. అలాగే నచ్చిన పోస్టులను కూడా హైడ్ చేయవచ్చు. అన్ ఫాలో కూడా చేసుకోవచ్చు.

మరిన్ని ఫేస్‌బుక్ టిప్స్

ప్రతి రోజు మీ ప్రెండ్స్ ఎంతోమంది తమ వాల్ లో పోస్టులు పెడుతుంటారు. అయితే అవి అందరికీ నచ్చకపోవచ్చు. వాటన్నింటిని చూడాలంటే అదనంగా డేటా ఖర్చవుతుంది. కాబట్టి వాటిని అన్‌ఫాలో చేస్తే ఏ సమస్యా ఉండదు.

 

 

మరిన్ని ఫేస్‌బుక్ టిప్స్

క్రోమ్ బ్రౌజర్‌లో ఫేస్‌బుక్ వాడేవారు మీ బ్యాటరీని కూడా సేవ్ చేసుకోవచ్చు. మీరు క్రోమ్‌లో డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లోకి వెళ్లడం ద్వారా మీరు మీ బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకుంటే అది ఎప్పుడూ ఆన్‌లో ఉండటం వల్ల మీ బ్యాటరీ తినేసే ప్రమాదం ఉంది.

 

 

మరిన్ని ఫేస్‌బుక్ టిప్స్

మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కు సంబంధించి మెసేజ్ లేదా నోటిఫికేషన్‌ను మ్యూట్ చేయాలంటే ముందుగా Facebook App >Messagesలోకి వెళ్లి మీరు మ్యూట్ చేయదలిచిన మిత్రుడిని ఎంపిక చేసుకోండి. మెనూ పైన కనిపించే ఐకాన్‌ను క్లిక్ చేయటం ద్వారా నోటిఫికేషన్‌లు ఓపెన్ అవుతాయి వాటిలో Mute notificationsను సెలక్ట్ చేసుకోండి.

మరిన్ని ఫేస్‌బుక్ టిప్స్

మీ ఫేస్‌బుక్ యాప్‌కు వచ్చే నోటిఫికేషన్‌లను పూర్తిగా డిసేబుల్ చేయాలంటే ఫేస్‌బుక్ యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని నోటిఫికేషన్స్‌ను అన్‌టిక్ చేయండి.

 

 

మరిన్ని ఫేస్‌బుక్ టిప్స్

మీ ఫేస్‌బుక్ ఐడీకి సంబంధించి టూ‌ స్టెప్ అథంటికేషన్‌ను ఎనేబుల్ చేయాలంటే ముందుగా ఫేస్‌బుక్ యాప్ అకౌంట్ సెట్టింగ్స్‌‌లోకి వెళ్ళి సెక్యూరిటీ మెనూలోని Login Approvalsను ఆన్ చేయవల్సి ఉంటుంది. స్టార్ట్ సెటప్‌లో మీ ఫోన్ నెంబర్‌ను టర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి.ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ కోడ్ అందుతుంది. ఈ కోడ్‌‌ను ఖాళీ బాక్సులో టైప్ చేసి కంటిన్యూ బటన్‌ను ప్రెస్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to use 2 Facebook accounts on 1 Android phone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot