వాట్సాప్‌ను డెస్క్‌టాప్ పై సెటప్ చేయటం ఎలా..?
వాట్సప్ తన వెబ్ వర్షన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. వెబ్ బ్రౌజర్‌లో వాట్సాప్‌ను వినియోగించుకునే యూజర్లు చాట్స్ ఇంకా గ్రూప్ సంభాషణలను నిర్వహించుకోవచ్చు. వాట్సాప్ మొబైల్ వర్షన్‌కు ఎక్స్‌టెన్సన్‌గా పనిచేస్తున్న వాట్సాప్ వెబ్ వర్షన్ ద్వారా ఫోన్‌కు వచ్చిన వాట్స్‌యాప్ సంభాషణలు ఇంకా సందేశాలను కంప్యూటర్ ఇంకా ల్యాప్‌టాప్‌లో మేనేజ్ చేసుకునేందుకు వీలుంటుంది.

తాజా సవరణల నేపథ్యంలో వెబ్ వర్షన్ ఇంటర్ ఫేస్ పై వినియోగదారులు తన ప్రొఫైల్ పిక్‌తో పాటు స్టేటస్ మెసేజ్‌లను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సెట్టింగ్స్ ఐకాన్ ఇన్-గోయింగ్ చాట్‌లను డిలీట్ ఇంకా ఆర్చివ్ చేసేందుకు యాక్సెస్‌ను కల్పిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ అకౌంట్‌ను డెస్క్‌టాప్ పై నిర్వహించుకునేందుకు ముఖ్యమైన చిట్కాలు...R
Read More : లీ 1ఎస్.. నెంబర్ వన్!

మీ వాట్సాప్ అకౌంట్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవటం ఎలా..?
వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించుకోవాలంటే మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో వాట్సాప్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి. ఈ డివైస్ మీ వద్ద సిద్దంగా ఉంచాలి. వాట్సాప్ వెబ్ సర్వీస్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ఫోన్, బ్లాక్‌బెర్రీ, నోకియా ఎస్60, నోకియా ఎస్40 కోసం డిజైన్ చేసిన వాట్సాప్ మొబైల్ యాప్స్ ను సపోర్ట్ చేస్తుంది. అలానే మీ ఫోన్‌కు రేర్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉండాలి.

మీ వాట్సాప్ అకౌంట్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవటం ఎలా..?
వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించుకోవాలంటే కంప్యూటర్ తప్పనిసరి. అది డెస్క్‌టాప్ , ల్యాప్‌టాప్, విండోస్, మాక్, క్రోమ్ ఏదైనా కావొచ్చు.

మీ వాట్సాప్ అకౌంట్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవటం ఎలా..?
మీ కంప్యూటర్‌లో వినియోగించే క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఓపెరా లేదా సఫారీ బ్రౌజర్ లేటెస్ట్ వర్షన్‌దై ఉండాలి. మీరు ఉపయోగించే రెండు డివైస్‌లకు యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి.

మీ వాట్సాప్ అకౌంట్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవటం ఎలా..?
ముందుగా మీ కంప్యూటర్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి http://web.whatsapp.comలోకి వెళ్లండి. ఇప్పుడు మీకు క్యూఆర్ కోడ్ తో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది. ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకునట్లయితే డెస్క్‌టాప్ సర్వీస్ యాక్సెస్ అవుతుంది.

మీ వాట్సాప్ అకౌంట్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవటం ఎలా..?
ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్‌లోని మెనూలోకి వెళ్లి "WhatsApp Web" ఆప్సన్ టాప్ చేయటం ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

మీ వాట్సాప్ అకౌంట్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవటం ఎలా..?
ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి "WhatsApp Web" ఆప్సన్ పై టాప్ చేయటం ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

మీ వాట్సాప్ అకౌంట్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవటం ఎలా..?
విండోస్ ఫోన్ యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ మెనూలోకి వెళ్లి "WhatsApp Web" ఆప్సన్ పై టాప్ చేయటం ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

మీ వాట్సాప్ అకౌంట్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవటం ఎలా..?
క్యూఆర్ కోడ్ స్కాన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత డెస్క్‌టాప్ సర్వీస్ యాక్సెస్ అవుతుంది.

మీ వాట్సాప్ అకౌంట్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవటం ఎలా..?
వాట్సాప్ వెబ్ ఎక్స్‌పీరియన్స్, ఫోన్ ఎక్స్‌పీరియన్స్ తరహాలోనే ఉంటుంది. వాట్స్‌యాప్ వెబ్ వర్షన్ మొబైల్ వర్షన్‌కు ఎక్స్‌టెన్సన్ మాత్రమే. యాజర్ తన ఫోన్‌కు వచ్చిన వాట్సాప్ సందేశాలను కంప్యూటర్‌లో చూసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








