ఫోన్ కెమెరాను webcamలా ఉపయోగించుకోవటం ఎలా..?

Posted By: BOMMU SIVANJANEYULU

వీడియో కాలింగ్ అందుబాటులోకి వచ్చిన తరువాత మానవ సంబంధాల కొత్త రంగును పులుముకున్న విషయం తెలిసిందే. మనకు కావల్సిన వారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే, చిటికెలో వీడియో కాల్ చేసి వారిని ప్రత్యక్షంగా చూస్తూ యోగక్షేమాలను తెలుసుకోగలుగుతున్నాం.

ఫోన్ కెమెరాను webcamలా ఉపయోగించుకోవటం ఎలా..?

చాలా మంది వీడియో కాల్స్‌ను వెబ్‌క్యామ్స్ ద్వారా నిర్వహించుకుంటుంటారు. వాస్తవానికి వెబ్‌క్యామ్స్ నాసికరకమైన వీడియో క్వాలిటీని ఆఫర్ చేస్తాయి. దీంతో క్వాలిటీ చాలా నాసిరకంగా ఉంటుంది. వీడియో కాల్స్ క్వాలిటీ విషయంలో రాజీపడకుండా ఉండాలంటే స్మార్ట్‌ఫోన్ కెమెరానే వెబ్‌క్యామ్‌లా ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఫోన్ కెమెరాను webcamలా మార్చేసేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'DroidCam’ అనే యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇదే సమయంలో DroidCamకు సంబంధించి web clientను కూడా మీ ల్యాప్‌టాప్‌ లేదా డెస్క్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. DroidCam యాప్, మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాను USB, Wi-Fi మార్గాల ద్వారా యాక్సెస్ చేసుకోగలుగుతుంది.

డ్రాయిడ్‌క్యామ్‌ను Wi-Fi ద్వారా సెటప్ చేసుకునే విధానం..

ఈ ప్రొసీజర్‌లో భాగంగా మీ స్మార్ట్‌ఫోన్ అలానే కంప్యూటర్ ఒకటే వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి. ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో డ్రాయిడ్‌క్యామ్‌ యాప్‌ను ఓపెన్ చేసి 'Wifi IP’ అలానే DroidCam Port వివరాలను నోట్‌డౌన్ చేసుకోండి. తరువాతి స్టెప్‌లో భాగంగా కంప్యూటర్‌లోని DroidCam web clientను ఓపెన్ చేసి అక్కడ కనిపించే Wi-Fi గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మరో మెనూ ఓపెన్ అవుతుంది.

ఆ మెనూలో నోట్‌డౌన్ చేసుకున్న వై-ఫై ఐపీ అలానే డ్రాయిడ్‌క్యామ్ పోర్ట్ వివరాలను ఎంటర్ చేయండి. ఆ తరువాత ఆడియో, వీడియోలను సెలక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ పై హిట్ చేసినట్లయితే మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా కాస్తా వెబ్‌క్యామ్‌లా వర్క్ అవటం ప్రారంభిస్తుంది.

డ్రాయిడ్‌క్యామ్‌ను USB కేబుల్ ద్వారా సెటప్ చేసుకునే విధానం..

మీ ఇంట్లోని వై-ఫై నెట్‌వర్క్ పూర్ క్వాలిటీతో వర్క్ అవుతున్నట్లయితే USB కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కెమెరాను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకుని webcamలా ఉపయోగించకునే వీలుంటుంది. ఇలా చేసేందుకుగాను ముందుగా మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌లోకి అన్ని USB డ్రైవర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

యూఎస్బీ కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసే క్రమంలో ముందుగా 'USB Debugging’ను మీ ఫోన్‌లో ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా చేసేందుకు ముందుగా, మీరు మీ ఫోన్‌లోని developer optionను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఫోన్ Settingsలోకి వెళ్లి About Phone ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే బిల్డ్ నెంబర్ కనిపిస్తుంది. ఆ Build Number పై 7 నుంచి 10 సార్లు టాప్ చేయటం ద్వారా developer option ఎనేబుల్ అవుతుంది.

2G, 3G, 4G సిమ్‌ కార్డ్‌లను గుర్తించటం ఎలా..?

డెవలపర్ ఆప్షన్స్ లోకి యాక్సెస్ లభించిన తరువాత, అందులోకి వెళ్లి USB Debuggingను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత మీ డివైస్‌ను ADB కమాండ్ ద్వారా పీసీకి కనెక్ట్ చేయవల్సి ఉంటుంది. కమాండ్ ప్రాంప్ట్‌లో 'adb devices’ కమాండ్‌ను రన్ చేయటం ద్వారా ఈ ప్రొసీజర్ వర్క్ అవుతుంది. ఈ మొత్తం తతంగం పూర్తి అయిన తరువాత మరోసారి DroidCam web clientలోకి వెళ్లి USB tabను నేవిగేట్ చేసి స్టార్ట్ బటన్ పై హిట్ చేసినట్లయితే మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా కాస్తా వెబ్‌క్యామ్‌లా వర్క్ అవటం ప్రారంభిస్తుంది.

English summary
How to use your Android smartphone camera as webcam. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot