వాట్సాప్‌లో సీక్రెట్ ఫాంట్ వాడటం ఎలా..?
మొబైల్ ఇంటర్నెట్ యూసేజ్ పెరిగేకొద్ది వాట్సాప్ వినియగం కూడా పెరుగుతూ వస్తోంది.
ఇన్‌స్టెంట్ మెసేజింగ్ విభాగంలో వాట్సాప్ నమోదు చేస్తున్న సంచలనాలు మనందరికి తెలసినవే. మొబైల్ ఇంటర్నెట్ యూసేజ్ పెరిగేకొద్ది వాట్సాప్ వినియగం కూడా పెరుగుతూ వస్తోంది.

ఇటీవల లాంచ్ చేసిన లేటెస్ట్ అప్‌డేట్‌లో భాగంగా వాట్సాప్ సరికొత్త ఫాంట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. విభిన్నంగా అనిపించే ఈ ఫాంట్ ఫీచర్ పేరు Fixedsys.ఈ ఫాంట్‌ను మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లు చాలా కాలంగా నోట్ ప్యాడ్ అలానే ఎంఎస్ వర్డ్ ప్యాడ్‌లలో ఉపయోగించుకుంటున్నారు.

ఈ ఫాంట్ ను వాట్సాప్ టెక్స్టింగ్‌లో ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లయితే మీరు పంపాలనుకుంటున్న వాఖ్యానికి ముందు వెనుక () బ్రాకెట్లలో కనిపించే సింబల్‌ను మూడేసి సార్లు యాడ్ చేయండి. ఆండ్రాయిడ్ గూగుల్ కీబోర్డ్‌లో ఈ ప్రత్యేకమైన సింబల్ (~) తరువాత కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications








