మీ ఈమెయిల్ ఇన్‌బాక్స్ క్లీన్‌గా ఉండాలంటే..?

Posted By:

మీ ఈమెయిల్ ఇన్‌బాక్స్ క్లీన్‌గా ఉండాలంటే..?

ఆధునిక కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థలో ఈమెయిల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈమెయిల్ అకౌంట్‌లను కలిగి ఉన్న నెటిజనులు తమ అకౌంట్ లకు సంబంధించిన ఇన్‌బాక్స్‌ను సురక్షితంగా ఇంకా వైరస్ రహితంగా ఉంచుకునే క్రమంలో నిపుణులు పలు సలహాలను సూచిస్తున్నారు. అవేటంటే...

మీ ఇమెయిల్‌ అడ్రస్‌ను యథాతథంగా ఇంటర్నెట్‌లో ఉంచకండి. ఒకవేళ మీ ఇమెయిల్‌ అడ్రస్‌ పెట్టవలసిన అవసరం ఏర్పడితే, దాన్ని ముందు వెనకాల చిన్న చిన్న మార్పులతో, లేక అడ్రస్‌నే ముందు వెనుకలుగా మార్చి ఇంటర్నెట్‌లో పెట్టండి. స్పామర్లు గూగుల్‌ వంటి వెబ్‌సెర్చ్‌ ఇంజన్‌లలో ప్రవేశించిన వెంటనే మీ ఇమెయిల్‌ అడ్రస్‌ సులువుగా వారికి కన్పించేలా ఉందేమో గమనించండి.

చాలా రకాల ISP ఉచిత ఇమెయిల్‌ అడ్రస్‌లను ఇస్తున్నాయి. అందులో మీరు రెండు ఇమెయిల్‌ అడ్రస్‌లను క్రియేట్‌ చేసుకొని ఒకటి స్నేహితులకు, సహ ఉద్యోగులకు, బంధువులకు మెయిల్‌ చేసేందుకు ఉపయోగించవచ్చు. రెండవదాన్ని న్యూస్‌ లెటర్‌లను రాసుకోవడానికి లేక ఫోరమ్స్‌ను పోస్టింగ్‌ చేయడానికి మరియు ఇతర పబ్లిక్‌ లొకేషన్ల కోసం వినియోగించుకోండి. చాలా ISPలు ఉచితంగా ‘స్పామ్‌' ఫిల్టరింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వీటిని తప్పక ఉపయోగించండి. అయినా మీకు వచ్చే స్పామ్స్‌ గురించి మీ ISPకి ఫిర్యాదు చేయండి.

- ఇన్‌బాక్స్‌లో పేరుకుపోయి ఉన్న అనవసర ఈమెయిల్స్‌ను డిలీట్ చేయటం మంచిది.

- మీ అకౌంట్‌కు వచ్చే ముఖ్యమైన ఈమెయిల్స్ కోసం ప్రత్యేకమైన ఫోల్డర్‌ను ఏర్పాటు చేసుకుని ఆ మెయిల్స్‌ను సదరు ఫోల్డర్‌లోకి మూవ్ చేసుకోండి.

- స్పామ్ మెయిల్స్‌ను ఫిల్టర్ చేసే అనేక అప్లికేషన్‌లను అంతర్జాలంలో లభ్యమవుతున్నాయి. వీటి సహాయం తీసుకోండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot