గూగుల్‌ను అలా కూడా ఉపయోగించుకోవచ్చు

Posted By:

గూగుల్ సెర్చ్ చాలా మందికి ఓ ఇంటర్నెట్ బ్రౌజర్‌గానే సుపరిచితం. అయితే, ఈ ఇంటర్నెట్ ద్వారాన్ని మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకోవచ్చన్న విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు!. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గూగల్ సెర్చ్‌లోని పలు ప్రత్యేక విశిష్టతను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిని క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

1998లో ప్రారంభించబడిన గూగుల్, ప్రపంచంలోని మారు మూల పల్లెలకు సైతం విస్తరించిన పేరు. అంతర్జాల యూజర్లు మెచ్చుకున్నబెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్ సైట్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌‌వర్క్‌. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్‌. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్‌ ఇంజిన్‌. రకరకాల అప్లికేషన్ల ద్వారా ప్రధమ స్థానానికి ఎగబాకుతున్న సంస్థ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డాలర్ టూ రూపాయి (dollar to rupee):

గూగుల్‌ను అలా కూడా ఉపయోగించుకోవచ్చు

డాలర్ టూ రూపాయి (dollar to rupee):

రూపాయి మారకపు విలువలను గూగుల్ సెర్చ్‌లో సులువుగా ఇంకా ఖచ్చితమైన సంఖ్యతో తెలుసుకోవచ్చు. ఉదాహరణను ఫోటోలో చూడొచ్చు....

 

మైల్ టూ కీమీ(mile to km)

మైల్ టూ కీమీ(mile to km):

మైళ్లకు, కిలోమీటర్లకు మధ్య వ్యత్యాసాన్నిఈ ప్రత్యేకమైన గూగల్ సెర్చ్ ఫీచర్ స్పష్టంగా సూచిస్తుంది. ఉదాహరణను ఫోటోలో చూడొచ్చు....

 

టైమ్ ఇండియా (time india)

3.) టైమ్ ఇండియా (time india):

కచ్చితమైన కాలమానాన్ని తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ బాక్సులో time india అని టైప్ చేయండి.ఉదాహరణను ఫోటోలో చూడొచ్చు....

 

వాతావరణం హైదరాబాద్ (weather hyderabad)

4.) వాతావరణం హైదరాబాద్ (weather hyderabad):

వాతావరణ వివరాలు తెలుసుకునేందకు గూగుల్ సెర్చ్ ప్రత్యేకమైన సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఉదాహరణకు మీర హైదరాబాద్ వాతావరణాన్ని తెలుసుకోవాలనుకుంటే గూగుల్ సెర్చ్ బాక్సులో
weather hyderabad అని టైప్ చేస్తే చాలు రాబోయే 8 రోజులకు సంబంధించి వాతావరణ సమాచారం స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఉదాహరణను ఫోటోలో చూడొచ్చు....

 

గనన యంత్రము (calculator)

5.) గనన యంత్రము (calculator):

గూగుల్ సెర్చ్‌ను గనన యంత్రము (calculator)లా ఉపయోగించుకోవచ్చు. మీ లెక్కను గూగుల్ సెర్చ్ బాక్సులో టైప్ చేసినట్లయితే గూగుల్ క్యాలిక్యూలేటర్ ప్రత్యేక్షమవుతుంది. ఇందుకు ఉదాహరణను ఫోటోలో చూడొచ్చు....

 

సూర్యాస్తమయం (sunset)

సూర్యాస్తమయం (sunset):

గూగుల్ సెర్చ్ ద్వారా మీ ప్రదేశానికి సంబంధించి సూర్యాస్తమయ సమయాన్ని తెలుసుకోవచ్చు. ఊదాహరణకు మీరు విజయవాడ సూర్యాస్తమయ సమయాన్ని తెలుసుకోవాలనుకుంటే sunset time in vijayawada అని గూగుల్ సెర్చ్ బాక్సులో టైప్ చేస్తే ఖచ్చితమైన జవాబు ప్రత్యక్షమవుతుంది. ఇందుకు ఉదాహరణను ఫోటోలో చూడొచ్చు..

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot