కీబోర్డ్‌ ఉపయోగిస్తున్నారా..?ఈ జాగ్రత్తలు పాటించండి

Posted By:

కంప్యూటర్ వినియోగంలో కీబోర్డ్ కీలక పాత్రపోషిస్తుంది. కీబోర్డ్‌లేని కంప్యూటర్‌ను ఊహించుకోవటం కష్టం. డెస్క్‌టాప్ కంప్యూటింగ్‌లో కీలక పాత్ర పోషించే కీబోర్డ్‌ను జాగ్రత్తగా ఉపయోగించుకునే చిట్కాలను మీకు సూచిస్తున్నాం.....

కీబోర్డ్‌ ఉపయోగిస్తున్నారా..?ఈ జాగ్రత్తలు పాటించండి

- కీబోర్డును ఉపయోగించేటప్పుడు బోర్డ్ మీద ఉన్న ‘కీ' బటన్‌లను సున్నితంగా నొక్కండి. కీబోర్డ్ ఆపరేటింగ్ సమయంలో కీబోర్డ్ బటన్ల పై ఎక్కువ ఒత్తిడి తీసుకురాకూడదు. అంటే బలప్రయోగం చేయకూడదు. కీబోర్డ్ బటన్‌లను గట్టిగా  ప్రెస్ చేయడం వల్ల త్వరగా మూలన పడే అవకాశాలు ఉన్నాయి.

- కంప్యూటర్ పై మీ పని పూర్తి అయిన వెంటనే కీబోర్డ్ పై డస్ట్ కవర్ వేయటం మరిచిపోవద్దు. డస్ట్ కవర్ వేయకుండా కీబోర్డును అలానే వదిలేసినట్లయితే బటన్‌ల మధ్య ఉండే రంధ్రాల ద్వారా దుమ్ము ఇంకా ధూళికణాలు లోపలికి ప్రవేశించి లోపలి ఎలక్ట్రికల్ వ్యవస్థను పాడుచేసే అవకాశం ఉంది. కాబట్టి, కంప్యూటర్ పై పని ముగిసిన వెంటనే డస్ట్ కవర్‌ను కప్పడం మరవద్దు.

- చాలా మంది కంప్యూటర్ నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మంచినీళ్లు, కాఫీ ఇతరత్రా వద్ద ద్రవ పదార్థాలను కీబోర్డ్ వద్ద ఉంచకండి.

- కీబోర్డ్‌ను క్లీన్ చేసేందుకు మార్కెట్లో ప్రత్యేక క్లీనింగ్ లిక్విడ్‌లు అందుబాటులో ఉన్నాయి. తరచూ వాటిని ఉపయోగించినట్లయితే మీ కీబోర్డ్ సురక్షితంగా ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot