Home
How to

ఒకరికి బదులు వేరొకరికి నగదు బదిలీ చేశారా.. వెంటనే ఇలా చేయండి?

పెద్ద నోట్ల రద్దు, కరోనా తర్వాత డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. పేటీయం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ల ద్వారా చెల్లింపులు ఎక్కువ అయ్యాయి. అయితే కొన్నిసార్లు పొరపాటున తప్పుగా నగదు బదిలీ చేసిన సందర్భాలు ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆ నగదును ఎలా వెనక్కి తీసుకోవాలో సరైన అవగాహన ఉండదు. ఈ సమస్యకు పరిష్కారం మీకోసం.

UPI ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు కొన్ని సార్లు సమస్యలు ఎదురవుతాయి. మరియు ఒకరికి బదులు వేరొకరికి నగదు బదిలీ జరుగుతుంది. ఇలాంటి సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. అయితే ఇలా పంపిన నగదును వెనక్కి తీసుకు రావడం అంత సులభం కాదు.

if money transfered to wrong account

ఒకరికి బదులు వేరొకరికి నగదు బదిలీ అయితే ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి డిజిటల్‌ చెల్లింపుల సంస్థలు బాధ్యత వహించవు. అయినా తొలుత వారికి ఫిర్యాదు చేయాలి. మరియు యూపీఐ లింక్ చేయబడిన బ్యాంక్‌ను నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది. మరియు సదరు బ్యాంకు కస్టమర్ కేర్‌ తెలియజేయాల్సి ఉంటుంది. బ్యాంక్‌ను సందర్శించే ముందు సంబంధిత లావీదేవీ వివరాలను వారికి అందించాల్సి ఉంటుంది.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. తప్పుడు ఖాతాకు నగదు బదిలీ వంటి ఫిర్యాదులను 7 నుంచి 15 రోజుల్లోపు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. అందువల్ల నగదును తప్పుడు వ్యక్తికి బదిలీ చేసినట్లు గుర్తించిన వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించాలి. మరియు రాతపూర్వకంగా వారికి ఫిర్యాదు చేయాలి.

అప్పుడు బ్యాంక్‌లు మీ నగదు క్రెడిట్‌ అయిన బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదిస్తుంది. అనంతరం అవతలి బ్రాంచ్‌ మీ నగదు క్రెడిట్‌ అయిన బ్యాంకు ఖాతాదారుడుని సంప్రదిస్తుంది. మీ ఖాతాకు నగదును పంపించేందుకు అతని అనుమతి తీసుకుంటుంది. అతను అంగీకరిస్తే.. మీ నగదు మీకు జమ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు సుమారు 8 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది.

తప్పుడు ఖాతాకు నగదు బదిలీ చేసిన ఫిర్యాదుపై వీరెవరు సరిగా స్పందించకుంటే ఆర్‌బీఐ ఏర్పాటుచేసిన ఫిర్యాదుల విభాగం అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అన్ని సందర్భాల్లో నగదు వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల నగదును వేరే యూపీఐ, బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాల్సి ఉంటుంది.

అలాగే యూపీఐ పిన్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు. యూపీఐ చెల్లింపులు చేసేందుకు పిన్‌ కచ్చితంగా అవసరం అవుతుంది. కనుక, అత్యంత సీక్రెట్‌గా ఈ పిన్‌ను దాచిపెట్టాల్సి ఉంటుంది. ఏటీఎం పిన్‌ను ఎంత భద్రతంగా ఉంచుతారో.. యూపీఐ పిన్‌ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
if money transfered to wrong account what to do to get it credited
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X