సర్వీసింగ్ చేయకుండా AC వినియోగిస్తున్నారా.. పేలిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త...!
గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ప్రజలు భారీగా ఉక్కపోతకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాలు, నగరాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అనేక మంది ప్రజలు ఏసీ (AC), ఎయిర్‌కూలర్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఏసీలు కలిగిన వారు సర్వీసింగ్ చేయించి, తిరిగి వినియోగించుకొనేందుకు వీలుగా మరమ్మతులు చేయిస్తున్నాయి.
అయితే కొంత మంది మాత్రం ఏసీలకు ఎటువంటి సర్వీసింగ్ చేయకుండా, తిరిగి వినియోగించుకోవచ్చు అనే ఆలోచనతో ఉంటారు. అయితే ఢిల్లీ లో ఓ ఘటన జరిగింది. ఏసీ సర్వీసింగ్ సెంటర్‌లో పాత ఏసీ అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించారు.

ఏసీ సర్వీసింగ్ సెంటర్‌లో పాత ఏసీని మరమ్మతు చేస్తుండగా పేలినట్లు తెలుస్తోంది. సరైన నిర్వహణ, ఇతర ఎలక్ట్రికల్ లోపాలు కారణంగా తెలుస్తోంది. ఏసీ పేలిపోయిన ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఏసీ పేలిపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.
కొత్త ఏసీలను నేరుగా ఉపయోగించవచ్చు. పాత ఏసీలను కొన్ని నెలలు తర్వాత తిరిగి ఉపయోగించే ఆలోచన ఉంటే మాత్రం కచ్చితంగా సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. సర్వీసింగ్ వల్ల ఏసీ మెరుగైన పనితీరును కనబరుస్తుంది, విద్యుత్‌ను ఆదా చేస్తుంది. మరియు ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు.
ఎలాంటి పరిస్థితుల్లో ఏసీ (ఎయిర్ కండిషనర్) పేలిపోయే ప్రమాదం ఉంది?
* చాలా కాలం తర్వాత ఏసీ ను తిరిగి ఉపయోగించే ముందు సర్వీసింగ్ కచ్చితంగా చేయించాలి. కొన్నిసార్లు ఏసీలోని విద్యుత్ కనెక్షన్‌లు డ్యామేజీ జరిగి ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏసీ ఆన్ చేస్తే పేలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల పాత ఏసీలను తిరిగి వినియోగించే ముందే విద్యుత్ కనెక్షన్‌లు సక్రమంగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి.
* ఏసీల్లో కంప్రెషర్‌ను ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. కంప్రెషర్ సరైన కండిషన్ లేకుంటే.. అతిగా వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా ఏసీలోని అంతర్గత భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో AC ఆన్ చేస్తే పేలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏసీని కొనుగోలు చేసే సమయంలోనే తగిన వోల్టేజ్ స్టెబిలైజర్ ను కొనుగోలు చేసి ఉపయోగించాలి.
* ఏసీని తిరిగి వినియోగించే ముందే గ్యాస్ లెవల్స్‌ను సరిగ్గా తనిఖీ చేయాలి. ఎక్కడైనా గ్యాస్ లీకేజీ జరుగుతున్నట్లు భావిస్తే వెంటనే మరమ్మతులు చేయించాలి. గ్యాస్ లీకేజీ సమయంలో ఏసీని ఆన్ చేస్తే పేలిపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు ఏసీ ఫిల్టర్‌లను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలి.
* ఏసీ అవుట్‌డోర్ యూనిట్‌ను సక్రమంగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. మరియు అందులో ఎటువంటి చెత్త సహా ఇతర వస్తువులు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా ఏసీ ఎయిర్ ఫిల్టర్‌లను శుభ్రం చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత ఏసీని వినియోగిస్తుంటే మాత్రం నిపుణులతో సర్వీసింగ్ చేయించాలి.


Click it and Unblock the Notifications








