నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారా..? జరభద్రం!

ఆన్‌లైన్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయ్. ముఖ్యంగా హ్యాకర్లు బ్యాంక్ అకౌంట్‌లకు సంబంధించిన వివరాలను దొంగిలించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తుంటారు. ప్రభుత్వం పెద్ద నోట్లను బ్యాన్ చేసిన నేపథ్యంలో చాలా మంది యూజర్లు నెట్ బ్యాంకింగ్ ద్వారానే తమ రోజువారి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో మీ ఆన్‌లైన్ బ్యాకింగ్ అకౌంట్లు హ్యాకర్ల భారిన పడకుండా అప్రమత్తం చేసేందుకు పలు సూచనలు...

Read More : రూ.3కే రోజంతా 3జీ ఇంటర్నెట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అటువంటి ఫోన్ కాల్స్ నమ్మకండి..

మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను అడుగుతూ ఫోన్ కాల్ వస్తే స్పందించకండి. ఒకవేళ చెప్పవల్సి వస్తే కాల్ చేసిన వ్యక్తిని నిర్థారించుకుని తరువాతి చర్యకు పూనుకోండి. మీరు గుర్తుంచుకోవల్సిన విషయం ఏమిటంటే బ్యాంకు నిర్వాహకులు ఏ సందర్భంలోనూ ఫోన్ కాల్ ద్వారా వ్యక్తిగత వివరాలను కోరరు.

వర్చువల్ కీబోర్డులను మాత్రమే ఎంచుకోండి

ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసే సందర్భంలో మాన్యువల్ కీబోర్డును కాకుండా ఆయా ఈ - బ్యాంకులు అందించే వర్చువల్ కీబోర్డులను మాత్రమే ఎంచుకోండి. ఈ చర్య ద్వారా సైబర నేరాలకు ఆస్కారం ఉండదు.

యాంటీ వైరస్ తప్పనిసరి...

యాంటీ వైరస్ రక్షణలేని పీసీలను నెట్ బ్యాంకింగ్‌కు ఉపయోగించొద్దు. సరి అయిన రక్షణ వ్యవస్థలేని పీసీలను హ్యాకర్లు సలువుగా ఆధీనంలోకి తీసుకోగలరు.

పాస్‌వర్డ్ వివరాలు జాగ్రత్త...

బ్యాంక్ అకౌంట్ ఇంకా పాస్‌వర్డ్ వివరాలను లిఖిత పూర్వకంగా రాసి ఎక్కడపడితే అక్కడ పెట్టొద్దు.

అలా చేయటం శ్రేయస్కరం కాదు

క్రెడిట్ కార్డ్ ఇంకా ఇతర బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ ద్వారా పంపడం శ్రేయస్కరం కాదు. అన్ని అకౌంట్ లకు ఒకే పాసవర్డ్ వద్దు. బెస్ట్ బ్యాటరీ, టాప్ క్వాలిటీ 4జీతో 10 స్మార్ట్‌ఫోన్‌లు

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Important Security Tips For Safe Online Banking. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot