IOS11 అప్డేట్ సమస్యలు వాటి పరిష్కారాలు: సింపుల్ ట్రిక్స్

Posted By: ChaitanyaKumar ARK

ఎంతో సెక్యూరిటీతో, అత్యధిక ఫీచర్లతో ప్రజలకి చేరువైన ఆపిల్ కి IOS11 అప్డేట్ లో వచ్చిన పదుల సంఖ్యలోని సమస్యలు కష్టతరంగా మారాయి. కొన్ని సమస్యలను అప్డేట్స్ ద్వారా పరిష్కరించగలిగినా కూడా కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. మరి వాటిని ఫిక్స్ చేయడం ఎలా అనే విషయం మీద చాలా మంది తర్జనభర్జన పడుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు రెడీగా ఉన్నాయి. యూజర్లు వాటిని పాటించడం ద్వారా ఈ సమస్యల నుండి ఈజీగా గట్టెక్కవచ్చు.

బడ్జెట్ ఫోన్లలో ఆల్‌రౌండర్ హానర్ 9 లైట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

IOS11అప్డేట్ లోని సమస్యలు వాటి పరిష్కారాలు:

ఆపిల్ తన అప్డేట్స్ ద్వారా బాటరీలపై భారం పడకుండా క్లాకింగ్ స్పీడ్ తగ్గిస్తామని చెప్పి వినియోగదారుల కోపానికి గురైన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా iphone6 వినియోగదారులు IOS11కు అప్డేట్ చేసుకున్నప్పుడు పనితీరు మందగించడం జరిగింది. దీనిని పరిష్కరించేందుకు పబ్లిక్betaవర్షన్11.3 అప్డేట్ ఇచ్చారు.

IOS11అప్డేట్ లోని సమస్యలు వాటి పరిష్కారాలు:

ఈమద్యకాలంలో వినే ఉంటారు ఒకతెలుగు అక్షరం "జ్ఞ" అనే అక్షరం మెసేజ్ వస్తే ఆయా అప్లికేషన్స్ క్రాష్ అవడం గురించి. ఈసమస్యను 11.3పబ్లిక్betaఅప్డేట్ ద్వారా పరిష్కరించగలిగింది. అదేవిధంగా మెసేజ్ కాన్వర్సేషణ్ ఒక ఆర్డర్లో లేకుండా డిస్ప్లే అవడం కాస్త వినియోగదారులు సహనం కోల్పోయేలా చేసింది. ఈసమస్యను 11.2.5 అప్డేట్లో సమస్యని పరిష్కరించింది.

IOS11అప్డేట్ లోని సమస్యలు వాటి పరిష్కారాలు:

ఒక్కోసారి ముఖ్యమైనపనుల్లో ఉండగా కొంతమంది iphones సడెన్ గా క్రాష్ అయి రీస్టార్ట్ అవడం జరిగింది. ముఖ్యంగా IOS 11.1.2అప్డేట్ చేసుకున్న కొందరు వినియోగదారులు ఈసమస్యని ఎదుర్కున్నారు. ఈసమస్య డిసెంబర్ 2వ తేదీన నోటిఫికేషన్ బార్ దగ్గర ఉత్పన్నమైంది. ఈ డేట్, టైం చేంజ్ చెయ్యడంద్వారా కూడా ఈసమస్యని పరిష్కరించవచ్చు. దీనికి IOSకొత్త అప్డేట్ ద్వారా పరిష్కారం ఇచ్చింది. ఇప్పటికీ ఎవరికైనా క్రాష్ అవుతుంటే డిసెంబర్ ముందు రోజులకి డేట్ ని చేంజ్ చేసుకుని అప్డేట్ చేసుకోవడం మంచిది.

IOS11అప్డేట్ లోని సమస్యలు వాటి పరిష్కారాలు:

IOS11 కి అప్డేట్ చేసుకున్న వారిలో i అని టైపు చేసి స్పేస్ ఇస్తే A? అని ఆటోకరెక్ట్ రావడం వినియోగదారులు అసహనానికి గురయ్యేలా చేసింది. దీనికి 11.1.1పాచ్ ద్వారా సరిచెయ్యగలిగింది. అప్డేట్ చేసుకోనివారు కీబోర్డు సెట్టింగ్స్ లో కుడివైపు పైనఉన్న+ బటన్ క్లిక్ చేసి "i"కు బదులుగా అప్పర్ కేస్ "I"ని సెట్ చేసుకోవడంద్వారా పరిష్కరించుకోవచ్చు.

IOS11అప్డేట్ లోని సమస్యలు వాటి పరిష్కారాలు:

IOS11 అప్డేట్లో కెమరాసెట్టింగ్స్ తరచూ డీఫాల్ట్ గా మారిపోవడంకూడా జరిగింది. కాని ఇదిIOS10లో మిస్ అయిన ఫీచర్, IOS11లో పొందుపరిచారు. మీసెట్టింగ్స్ అలాగేఉండాలి అనుకుంటే కెమరాసెట్టింగ్స్ లో preserved సెట్టింగ్స్ లో లైవ్ ఫోటో, filterLightening ఎఫెక్ట్స్ ఆన్ చేసుకోవడంద్వారా సమస్య పరిష్కారం అవుతుంది.

IOS11అప్డేట్ లోని సమస్యలు వాటి పరిష్కారాలు:

IOS11 బాటరీ సమస్య: IOS11 కి అప్డేట్ చేసుకున్న యూసర్స్ బాటరీ త్వరగా అయిపోతుంది అని కంప్లైంట్స్ ఇచ్చారు. దీనికి ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. ఇంకా సమస్య అలాగే ఉంటే బాటరీ సెట్టింగ్స్ లో ఏఅప్లికేషన్ ఎక్కువ బాటరీ తీస్కున్నాయో గమనించి డిసేబుల్ చెయ్యడం మంచిది. IOS11కు సపోర్టింగ్ ఫ్రెండ్లీ అప్డేట్ ఇచ్చినతర్వాత app ఎనేబుల్ చేసుకోండి.

IOS11అప్డేట్ లోని సమస్యలు వాటి పరిష్కారాలు:

కొన్ని అప్లికేషన్లు కూడా పనిచెయ్యలేదు IOS11అప్డేట్ చేసుకున్నవారిలో. incompatibility issues వలన. వారు ఆ అప్లికేషన్స్ తొలగించి IOS11కి ఫ్రెండ్లీ అప్డేట్స్ రిలీజ్ చేసాక ఆయా అప్లికేషన్లు ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది, డివైస్ unlock చేయునప్పుడు హోం బట్టన్ ఒక్కోసారి 10సెకండ్లు ఫ్రీజ్ అయి టైం తీసుకోవడం సమస్యగా మారింది. దీనికి 11.2.5 అప్డేట్ లో సొల్యూషన్ ఇచ్చారు.

IOS11అప్డేట్ లోని సమస్యలు వాటి పరిష్కారాలు:

అదేవిధంగా outlook/exchange ఈ-మెయిల్స్ పనిచెయ్యకపోవడం, వాయిస్ మెయిల్స్ వర్క్ కాకపోవడం, లాక్ స్క్రీన్ లో మ్యూజిక్ కంట్రోల్ కీస్ కనపడకపోవడం, కాల్క్యులేటర్ తప్పుడు సమాధానాలు చూపడం, కంట్రోల్ సెంటర్ లో అనుకున్న ఫీచర్లు లేకపోవడం, కంట్రోల్ సెంటర్ wifi,బ్లూటూత్ లను ఆపలేకపోవడం, ipadలో కింది డాక్ కనపడకపోవడం, HEICనుండి JPEG ఇమేజ్ కన్వర్టింగ్ లో సమస్యలు రావడం, icloud syncingసమస్యలు, ఆపిల్ పే పేమెంట్ సమస్యలు, యానిమోజి సమస్యలు, సిరి సౌండ్ మారడం, కొన్ని wifi సమస్యలు రావడం, అప్డేట్ తర్వాత ఫోన్ స్టార్ట్ అవకపోవడం వంటి ఎన్నో సమస్యలు IOS11అప్డేట్ లో కనిపించాయి. వీటన్నిటికి 11.3 పబ్లిక్ అప్డేట్ కాస్త ఊరటనిస్తుంది అని చెప్తున్నారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
New iOS 11 troubleshooting advice in our latest update more news at Gizbot telugu.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot