IPL 2022 రేపటి నుంచి ప్రారంభం కానున్నది!! లైవ్ చూడడం ఎలా?

|

ఇండియాలో IPL క్రికెట్ మ్యాచ్ లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. 2022 సంవత్సరంలో కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 యొక్క 15వ ఎడిషన్ మార్చి 26న అంటే రేపు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు అన్ని సీజన్‌లలో 8 జట్లు పోటీపడేవి. అయితే ఇప్పుడు ఒకదానితో ఒకటి పోటీపడడానికి 8 జట్లకు బదులుగా 10 జట్లు ఉండటం ఈ సంవత్సరం హైలైట్. లక్నో సూపర్ జెయింట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ వంటి రెండు జట్లు ఈ సారి అదనంగా చేరాయి. ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి ఇతర IPL జట్లు ప్రతి సీజన్‌లో తలబడుతున్నాయి.

IPL 2022 is Starting From Tomorrow!! How to Watch Livestream?

టాటా IPL 2022 లైవ్ ని వీక్షించే విధానం

భారతదేశంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే IPL మ్యాచ్‌లను ప్రత్యక్షంగా లైవ్ లో వీక్షించడానికి వీక్షకులు స్టార్ స్పోర్ట్స్ లేదా డిస్నీ+ హాట్‌స్టార్‌కి ట్యూన్ చేయవచ్చు. ఈ రెండిటిలో వినియోగదారులు అన్ని మ్యాచ్‌లను చూడవచ్చు.

IPL 2022 is Starting From Tomorrow!! How to Watch Livestream?

మీరు Disney+ Hotstarకి సబ్‌స్క్రిప్షన్ పొందాలనుకుంటే కనుక మీరు సంవత్సరానికి రూ.499 చెల్లించి మొబైల్ ప్లాన్‌ని పొందవచ్చు. ఇది ఒక మొబైల్ డివైస్ లో మాత్రమే యాప్‌ను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. టీవీలు మరియు ల్యాప్‌టాప్‌లతో సహా 2 పరికరాలకు మద్దతు ఇచ్చే రూ.899 వార్షిక సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. చివరగా మీరు 4 డివైస్లు మరియు 4Kకి సపోర్ట్ చేసే రూ.1,499 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ తో మీరు అదనంగా యాడ్ లను చూడవలసిన అవసరం లేదు.

ఐపీఎల్ 2022 యొక్క క్రికెట్ మ్యాచ్ లు ముంబై, పూణేలలో జరగనుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్ మార్చి 27న రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో మొత్తంగా 74 క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Best Mobiles in India

English summary
IPL 2022 is Starting From Tomorrow!! How to Watch Livestream?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X