క్రికెట్ లవర్స్‌కు అలర్ట్.. IPL 2025 టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి..
IPL 2025: క్రికెట్ అభిమానుల్లారా అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధమైపోండి. టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ మరో మూడు వారాల్లో ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ సీజన్ సాగనుంది. మొత్తం 74 మ్యాచ్‌లు... 13 స్టేడియాల్లో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లంటే చాలా ఎంటర్‌టైన్ చేస్తాయి. మరి మీ ఫేవరెట్ టీమ్ మ్యాచ్ చూడటానికి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
* IPL 2025 మ్యాచ్ షెడ్యూల్ ఇదే
మీరు ఏ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక కానుంది. మధ్యాహ్నం మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు స్టార్ట్ అవుతాయి. సాయంత్రం మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు సందడి మొదలవుతుంది.

* ప్లేఆఫ్స్ షెడ్యూల్
క్వాలిఫైయర్ 1 మ్యాచ్ 2025, మే 20న హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇక రసవత్తర పోరు అయిన ఎలిమినేటర్ మే 21న హైదరాబాద్ వేదికగా జరుగుతుంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ విషయానికొస్తే ఇది మే 23న కోల్‌కతాలో ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీ పోటీగా మారుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్‌కతాలో విజేత ఎవరో తేలిపోతుంది.
* IPL 2025 టికెట్స్ ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి?
ఇంట్లోనే కూర్చొని టికెట్స్ కొనేయొచ్చు. ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకోవడం చాలా ఈజీ. ఇందుకు ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. బుక్‌మైషో లేదా పేటీఎం లాంటి అథరైజ్డ్ టికెటింగ్ పార్ట్‌నర్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. మ్యాచ్, స్టేడియం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో, ఏ స్టేడియంలో చూడాలనుకుంటున్నారో క్లిక్ చేయాలి.
జనరల్, మిడ్-రేంజ్, ప్రీమియం, VIP... మీకు నచ్చిన కేటగిరీ టికెట్ సెలెక్ట్ చేసుకోండి. డెబిట్/క్రెడిట్ కార్డు, UPI, నెట్ బ్యాంకింగ్... ఏదైనా వాడి పేమెంట్ చేయాలి. పేమెంట్ సక్సెస్ అయితే, మీ బుకింగ్ డీటెయిల్స్‌తో కన్ఫర్మేషన్ ఈమెయిల్ లేదా SMS మీ మొబైల్‌కి వచ్చేస్తుంది.
* IPL 2025 టికెట్స్ ఆఫ్‌లైన్‌లో ఎలా కొనాలి
ఒకవేళ మీరు డైరెక్ట్‌గా టికెట్ కొనాలంటేనే మీకోసం ఆఫ్‌లైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మ్యాచ్ జరిగే స్టేడియంలో బాక్స్ ఆఫీసులో ఉంటాయి. అక్కడ నుంచి డైరెక్ట్‌గా టికెట్స్ కొనొచ్చు. కొన్ని షాపుల్లో కూడా టికెట్స్ అమ్ముతారు. ఎక్కడో తెలుసుకొని వెళ్లాలి.
ఆఫ్‌లైన్‌లో టికెట్స్ కొనాలంటే ఏం చేయాలి?
స్టేడియం బాక్స్ ఆఫీస్ లేదా అథరైజ్డ్ షాపుకి డైరెక్ట్‌గా వెళ్లాలి. మీకు కావాల్సిన మ్యాచ్, సీటింగ్ టికెట్స్ ఉన్నాయో లేదో అడగాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ లాంటి ఏదైనా ఐడీ తీసుకెళ్లాలి. డబ్బులు, కార్డు, డిజిటల్ వాలెట్స్... వంటి వాటిలో ఏదో ఒకటి ఉపయోగించి పేమెంట్ చేయాలి. పేమెంట్ అయిపోగానే టికెట్ ఇస్తారు.
* ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..
కొన్ని టీమ్స్ ఈసారి వేర్వేరు స్టేడియాల్లో హోమ్ మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు విశాఖపట్నం, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీలో సందడి చేయనున్నారు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు గువహాటి (రెండు మ్యాచ్‌లు), సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్‌లో దుమ్మురేపనున్నారు.
పంజాబ్ కింగ్స్ టీమ్ ప్లేయర్లు న్యూ పీసీఏ స్టేడియం, న్యూ చండీగఢ్ (నాలుగు మ్యాచ్‌లు), హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాలలో (మూడు మ్యాచ్‌లు) ప్రత్యర్థులకు చుక్కలు చూపించనున్నారు. టికెట్స్ దొరికే వెబ్‌సైట్స్, డేట్స్, టైమింగ్స్ అన్నీ అఫీషియల్ IPL వెబ్‌సైట్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడే అప్‌డేట్స్ తెలుస్తాయి.


Click it and Unblock the Notifications








