ప్రయాణికులకు IRCTC బంపరాఫర్, రూ.10 వేల నగదు మీ సొంతం

దేశీయ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ప్రయాణికులను కొత్త కొత్త శుభవార్తలను అందిస్తోంది.

|

దేశీయ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ప్రయాణికులను కొత్త కొత్త శుభవార్తలను అందిస్తోంది. కొత్త యాప్ లు తీసుకొస్తున్నామని ప్రకటించిన వారంలోపే యూజర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో ఆధార్‌ కార్డు నెంబర్‌ను యూజర్లు లింక్‌ చేస్తే, వారికి 10వేల రూపాయల వరకు నగదు బహుమతి అందించనున్నట్టు ఐఆర్‌సీటీసీ తెలిపింది. దేశీయ రైల్వే జారీ చేసిన సర్క్యూలర్‌లో ఇది పేర్కొంది. కాగా 2018 జూన్‌ వరకు ఈ స్కీమ్‌ అందుబాటులో ఉండనుంది. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో ఆధార్‌ లింక్‌ చేసి, ట్రైన్‌లో ప్రయాణించిన యూజర్లు 'లక్కీ డ్రా స్కీమ్‌' ద్వారా ఈ నగదును గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు.

మాసివ్ మిమో టెక్నాలజీతో దేశంలో తొలి 5జీ పరిచయం, జియో, Airtel మధ్యనే పోటీమాసివ్ మిమో టెక్నాలజీతో దేశంలో తొలి 5జీ పరిచయం, జియో, Airtel మధ్యనే పోటీ

లక్కీ డ్రా..

లక్కీ డ్రా..

ప్రతి కేలండర్‌ నెలా లక్కీ డ్రా స్కీమ్‌ ఉంటుంది. ముందు నెలలో ప్రయాణించిన ఐదు లక్కీ ప్రయాణికులను, తర్వాతి నెల రెండో వారంలో కంప్యూటరైజ్డ్‌ ర్యాండమ్‌ లక్కీ డ్రా ప్రాసెస్‌ ద్వారా ఎంపికచేసి వారికి ఈ నగదు బహుమతి అందిస్తారు.

నగదు బహుమతితో పాటు..

నగదు బహుమతితో పాటు..

ఈ నగదు బహుమతితో పాటు, వారు ఆ నెల్లో ప్రయాణానికి అయిన రైల్‌ టిక్కెట్‌ నగదంతా రీఫండ్‌ చేస్తారు. అయితే పీఎన్‌ఆర్‌(ప్యాసెంజర్‌ నేమ్‌ రికార్డు)ల్లో ఆధార్‌ ఆధారితంగా బుక్‌ చేసుకున్న యూజర్లకు మాత్రమే ఈ లక్కీ డ్రా స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది.

ఒకటి కంటే ఎక్కువ పీఎన్‌ఆర్‌లు కలిగి ఉంటే..
 

ఒకటి కంటే ఎక్కువ పీఎన్‌ఆర్‌లు కలిగి ఉంటే..

ఒకే యూజర్‌ ఒకటి కంటే ఎక్కువ పీఎన్‌ఆర్‌లు కలిగి ఉంటే, కేవలం ఒకే ఒక్క పీఎన్‌ఆర్‌ను ఎంపిక చేస్తారు. నగదు బహుమతి గెలుచుకున్న విన్నర్ల పేర్లను ఐఆర్‌సీటీసీ తన వెబ్‌సైట్‌లో తదుపరి నెలలో పేర్కొంటోంది. అయితే ఐఆర్‌సీటీసీ ఉద్యోగులు ఈ లక్కీ డ్రా స్కీమ్‌కు అర్హులు కారు.

ఆధార్‌ కార్డులు లేకుండా ..

ఆధార్‌ కార్డులు లేకుండా ..

ఇప్పటికే ఆధార్‌ కార్డులు లేకుండా నెలకు ఆరు టిక్కెట్లను ప్రయాణికులు బుక్‌ చేసుకోవచ్చని, ఒకవేళ ఆరుకు మించితే ఐఆర్‌సీటీసీ పోర్టల్‌పై ప్రయాణికులు తమ ఆధార్‌ నెంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపిన సంగతి విదితమే.

ఆధార్ లింక్ చేయడం ఎలా..?

ఆధార్ లింక్ చేయడం ఎలా..?

యూజర్లు ముందుగా www.irctc.co.in లోకి వెళ్లాలి. ఆ సైట్లోకి వెళ్లిన తరువాత మీరు లాగిన్ కావడానికి "User ID" and "Password ఎంటర్ చేసి సబ్ మిట్ బటన్ నొక్కాలి. అక్కడ మీకు కనిపించే మై ప్రొఫైల్‌' కేటగిరీ కింద ఆధార్‌ కేవైసీను క్లిక్‌ చేయాలని, అనంతరం ప్రయాణికులు తమ ఆధార్‌ నెంబర్‌ను అప్‌డేట్‌ చేయాలి.

 మీ ఆధార్ వివరాలు ఎంటర్ చేయగానే..

మీ ఆధార్ వివరాలు ఎంటర్ చేయగానే..

అక్కడ మీరు మీ ఆధార్ వివరాలు ఎంటర్ చేయగానే ఆధార్‌ లింక్‌ చేసి ఉన్న మొబైల్‌ నెంబర్‌కు ఓటపీ వస్తుందని, దాన్ని ధృవీకరణ కోసం నమోదుచేయాలని చెప్పారు. ఈ ప్రాసెస్ విజయవంతంగా ముగిస్తే మీ ఆధార్ లింక్ సక్సెస్ అయినట్లు వస్తుంది.

ప్రయాణీకుల్లో ప్రతి ఒక్క వ్యక్తి

ప్రయాణీకుల్లో ప్రతి ఒక్క వ్యక్తి

కాగా ప్రయాణీకుల్లో ప్రతి ఒక్క వ్యక్తి ఆధార్ నంబర్ కూడా మాస్టర్ జాబితాలో అప్‌డేట్‌ చేయాలి. ఇది కూడా ఓటీపీ ద్వారా ధృవీకరిస్తారు. వినియోగదారులు 'మాస్టర్ జాబితా' తో పాటుగా ధృవీకరించిన ప్రయాణికుల పేర్లను స్టోర్‌ చేయవచ్చు. అనంతరం ఇక నెలకు ఆరుకు మించి టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Indian Railways Offer Rs. 10,000 On Linking Aadhaar To Your IRCTC Account. 10 Points More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X