ఇంటర్నెట్‌తో లాభమా నష్టమా..?

Posted By:

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో అంతర్జాలం (ఇంటర్నెట్) క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా నేటి ఇ-తరం ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బ్రతుకుతోంది. భవిష్యత్ తరాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారనుందన్న నగ్న సత్యం మనందరికి తెలుసు.

ఈ నేపధ్యంలో పలువురు తల్లిదండ్రులను అనేక ప్రశ్నలు? వేధిస్తున్నాయి!, తమతమ చిన్నారులకు కంప్యూటర్ ఇంకా ఇంటర్నెట్ వ్యవస్థను ఏ వయసు నుంచి అందుబాటులో ఉంచాలి..?, చిన్నతనంలోనే వారిని ఇంటర్నెట్‌కు చేరువచేయడం వల్ల లాభమా నష్టమా..? అసలు చిన్నారులకు ఇంటర్నెట్ అవసరమా..? ఇలా అనేక ప్రశ్నలు వారిలో ఉదయిస్తున్నాయి.

వాస్తవానికి, పూర్తిస్థాయి పర్యవేక్షణతో కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాధనాలను తల్లిదండ్రులు వారివారి చిన్నారులకు చేరువచేసినట్లయితే వారి పై అద్భుతంగా ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఇంటర్నెట్‌లో చిన్నారులకు ఉపయోగపడే బోలెడంత ఆసక్తికర సమాచారం దాగి ఉంది. మరిన్ని వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్‌తో లాభమా నష్టమా..?

పూర్వ కాలంలో చరిత్రను కేవలం పుస్తకాలు ఇంకా పటాల ద్వారానే తెలుసుకోగలిగేవాళ్లం. కానీ ఇపుడు ప్రపంచ దేశాలనే కాదు ఆయా దేశాల్లోని గ్రామాలను కూడా ఇంటర్నెట్ మ్యాప్స్ ద్వారా వీక్షించగలుగుతున్నాం. ఈ విధమైన సమాచారం చిన్నారులకు ఆసక్తికరంగానూ అదే సమయంలో విజ్ఞానపరంగానూ ఎంతగానో మేలుచేస్తుంది.

 

ఇంటర్నెట్‌తో లాభమా నష్టమా..?

చిన్నారులు తమ తరగతులకు సంబంధించిన ప్రాజెక్టులను ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ల సహాయంతో సులభంగా పూర్తి చేయవచ్చు. అప్పట్లో పిల్లలకు చిన్నపాటి పరిశోధన చేసేందుకు కూడ వనరులు అందుబాటులో ఉండేవి కాదు.

 

ఇంటర్నెట్‌తో లాభమా నష్టమా..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రహదారులు, రైల్వే లైన్లు, భవనాలు ఇలా అనేకమైన ఇంజినీరింగ్ అద్భుతాలకు సంబంధించిన అంశాలను ఇంటర్నెట్ మనకు చేరువస్తుంది. ఈ విధమైన సమాచారం చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడటమే

కాకుండా వారికి మార్గదర్శిగా నిలుస్తుంది.

 

ఇంటర్నెట్‌తో లాభమా నష్టమా..?

ముద్రాల లోతుల్లో జీవరాశి ఏలా ఉంటుంది..? ఏ నది పొడవు ఎంత..? అడవుల్లో నివశించే సాదు జంతువులు మొదలుకుని క్రూర జంతువుల వరకు జీవన విధానాలు ఏలా ఉంటాయి..? ఇలా అనేక రకాల ప్రశ్నలకు ఇంటర్నెట్ లో సమాచారం దొరుకుతుంది.

 

ఇంటర్నెట్‌తో లాభమా నష్టమా..?

ఇంటర్నెట్ ఓ పెద్ద గ్రంథాలయం లాంటిది. ఎటువంటి ప్రశ్నకైనా సమధానం ఇట్టే దొరకుతుంది. చిన్నారులకు అవసరమైన వివరమైన సమాచారాన్ని ఛాయా చిత్రాలు ఇంకా వీడియోల రూపంలో సేకరించవచ్చు.

 

ఇంటర్నెట్‌తో లాభమా నష్టమా..?

వినోదం అలానే విజ్ఞానాన్ని చేరువ చేసే ఆసక్తికరమైన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ గేమ్స్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి చిన్నారుల మేధస్సుకు మరింత పొదును పెడతాయి.

 

ఇంటర్నెట్‌తో లాభమా నష్టమా..?

చిన్నారుల తరగతులకు సంబంధించిన వివిధ సబ్జెక్టుల పాఠ్యాంశాలు వీడియో ఇంకా ఆడియో  రూపంలో ఇంటర్నెట్‌లో అందుబాటులోకి వచ్చేసాయి.

 

ఇంటర్నెట్‌తో లాభమా నష్టమా..?

లక్షలాది పోర్న్ సైట్‌లకు వేదికగా నిలుస్తున్న ఇంటర్నట్ యువత భవిష్యత్‌ను నాశనం చేస్తోంది. పోర్న్ వెబ్‌సైట్‌ల పై నియంత్రణ లేని ఇండియా వంటి దేశాల్లో ఈ జాడ్యం మరింత ముదిరిపోతోంది. చైనా, సౌదీ ఆరేబియా వింటి దేశాలు పోర్న్ వెబ్‌సైట్‌ల పై కాస్తో కూస్తో నియంత్రణ విధిస్తున్నాయి.

 

ఇంటర్నెట్‌తో లాభమా నష్టమా..?

పోర్న్ వెబ్‌సైట్‌లు నేటి యువతరంలో బలాత్కార ధోరణిని అలవరుస్తున్నాయి విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో విస్తరిస్తున్న విష సంస్కృతులలో ‘సెక్స్‌టింగ్' ఒకటి. అశ్లీల ఇంకా అసభ్యకర సందేశాలను సెల్‌ఫోన్ ద్వారా మిత్రులతో షేర్ చేసుకోవటాన్ని టెక్స్టింగ్ అంటారు. ఈ విష సంస్కృతి రోజు రోజుకు విస్తరిస్తుండటంతో అనేక సమాజ విలువలు దిగజారి

పోతున్నాయి. సెక్స్‌టింగ్ ఉచ్చులో పడి తమ పిల్లలు పాడవకుండా ఉండటానికి తల్లిదండ్రులను పాటించాల్సిన జాగ్రత్తలు.

 

ఇంటర్నెట్‌తో లాభమా నష్టమా..?

ఆన్‌లైన్ మిత్రులతో మీ పిల్లలు జరిపే చాటింగ్ పై ఓ కన్నేసి ఉంచండి. ల్యాప్‌టాప్ లేదా టేబుల్ టాప్ కంప్యూటర్‌నుఅందరూ చూసే విధంగా హాల్లో ఉంచాలి.

 

ఇంటర్నెట్‌తో లాభమా నష్టమా..?

ఆన్‌లైన్‌లో తరచూ మీ పిల్లలు చూస్తున్న వెబ్‌సైట్‌లకు సంబంధించిన వివరాలను హిస్టరీ ఆప్షన్‌లోకి వెళ్లి తెలుసుకోవాలి. మీ పిల్లలు ఉపయోగిస్తున్న కంప్యూటర్‌కు స్పైవేర్‌ను ఇన్‌స్టాల్ చేసి వారు ఏ సైట్లలోకి వెళ్తున్నారో గమనిచండి. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల ద్వారా మీ చిన్నారులు పంపిస్తున్న సందేశాల పై ఓ కన్నేసి ఉంచండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
How internet helpful to our children. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot