మీ బ్రౌజింగ్‌ను ఎవరైనా ట్రాక్ చేస్తున్నారా ? పరిష్కారాలివిగో..

|

ఈ టెక్నాలజీ యుగంలో మీ డేటా సురక్షితమేనా ? అంటే పలు సందేహాలు తలెత్తడం సహజమే.. ఎందుకంటే ఈ కాలంలో డేటా చౌర్యం అనేది అన్ని స్థాయిల్లోనూ జరుగుతోంది. రక్షణ శాఖ వెబ్ సైట్ నుంచి సామాన్యుల ఈ మెయిల్ అకౌంట్ల వరకూ హ్యాకర్ల బారిన పడని డేటా అంటూ లేదు. మరి ఇంతలా గూడుకట్టుకున్న హ్యాకర్ల వ్యవస్థ నుంచి మీ డేటాను కాపాడకోవడం ఒక సవాలే.. సాధారణంగా మీరు విజిట్ చేస్తున్న ప్రతీ వెబ్ సైట్ కూడా కొంత డేటా మీ కంప్యూటర్ లో విడిచి వెళుతుంది. విడిచిన డేటాలో సాధారణంగా మీరు రీ విజిట్ చేసే యూనిక్ యూజర్ ఐడీ కలిగి ఉంటుంది. ముఖ్యంగా మీరు రీ లాగిన్ అయినప్పుడు సదరు వెబ్ సైట్ కుకీ రూపంలో వదిలిన కంటెంట్ ద్వారా మీ డేటాను కొంత మేర భద్రపరుస్తుంది. ఉదాహరణకు ఏదైన ఒక షాపింగ్ వెబ్ సైట్ కార్ట్ లో ఎంపిక చేసుకున్న సామాగ్రి లేదా సరుకుల డేటాను భద్రపరచడం లాంటిది.

 

ఇకపై వాట్సప్‌లో ప్లే కానున్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వీడియోలు..ఇకపై వాట్సప్‌లో ప్లే కానున్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వీడియోలు..

సబ్ స్క్రిబ్షన్ పేజ్ ను క్లిక్ చేయమని..

సబ్ స్క్రిబ్షన్ పేజ్ ను క్లిక్ చేయమని..

అయితే సదరు వెబ్ సైట్ లు సాధారణంగా తమ అడ్వర్టయిజ్ మెంట్లను, సబ్ స్క్రిబ్షన్ పేజ్ ను క్లిక్ చేయమని పలు అభ్యర్థనలను పంపుతాయి. అప్పుడే మీ డేటా థర్డ్ పార్టీ చేతుల్లోకి వెళుతుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కుకీస్ అనేవి వెబ్ సైట్ ల యాడ్ రెవిన్యూకు తప్పదు. కానీ బ్రౌజింగ్ చేసే వారికి ఇవి విసుగు పుట్టిస్తాయి. అయితే కొన్ని సార్లు కుకీస్ ను బ్లాక్ చేస్తే మనకు కావాల్సిన వెబ్ సైట్ కూడా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మీ పర్సనల్ సమాచారం హ్యాక్ కాకుండా.. మీకు కావాల్సిన సమాచారం పొందే కొన్ని ఎక్స్‌టెన్షన్స్ చూద్దాం.

పాన్ఆప్టిక్లిక్...

పాన్ఆప్టిక్లిక్...

ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ వారు ప్రవేశపెట్టిన ఈ ఎక్స్‌టెన్షన్ ప్రతీ వెబ్ సైట్ ను పరిశీలిస్తుంది. మీరు చేసే సర్ఫింగ్ ను ట్రాక్ చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే యాడ్ ఆన్ లోని ఆరెంజ్ రంగు బటన్ నొక్కితే చాలు. టెస్ట్ మీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు సదరు బ్రౌజర్ వెబ్ సైట్ లతో ఏఏ సమాచారాన్ని పంచుకున్నది తెలుసుకోవచ్చు.

యామ్ ఐ యునిక్...
 

యామ్ ఐ యునిక్...

ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఈ ఎక్స్ టెన్షన్ ద్వారా ఏఏ సమాచారాన్ని బ్రౌజర్ నోటిస్ చేసిందో తెలుసుకునే వీలుంది. దీని ద్వారా వ్యూ మై బ్రౌజర్ ఫింగర్ ప్రింట్ ప్రెస్ చేయడం ద్వారా మొత్తం వివరాలు గ్రాఫ్ లతో సహా బయటపడతాయి. క్రోమ్, ఫైర్ ఫాక్స్ లలో లభించే ఈ ఎక్స్‌టెన్షన్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం భద్రతను కాపాడుకునే వీలుంది.

డిస్‌కనెక్ట్ :

డిస్‌కనెక్ట్ :

డిస్‌కనెక్ట్ అనేది ఒక ప్రముఖ ట్రాకర్ బ్లాకర్. ఇది సుమారు రెండువేలకు పైగా ట్రాకర్లను బ్లాక్ చేస్తుంది. అలాగే ఈ ఎక్స్‌టెన్షన్ వల్ల వెబ్‌సైట్ బ్రౌజింగ్ స్పీడ్ 27 శాతం పెరుగుతుంది. ఇందులో మూడు రకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవి ఒకటి బేసిక్, అలాగే ప్రో, మరియు ప్రీమియం రకాలుగా ఈ ఎక్స్ టెన్షన్ అందుబాటులో ఉంది. వీటిలో బేసిక్ ఒక్కటే ఫ్రీ సర్వీసు. ఈ ఎక్స్ టెన్షన్ క్రోమ్, సఫారీ, ఫైర్ ఫాక్స్, ఒపెరా బ్రౌజర్లలో అందుబాటులో ఉంది.

 లైట్ బీమ్..

లైట్ బీమ్..

ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో మాత్రమే ఉండే ఈ ఎక్స్ టెన్షన్ ద్వారా మీరు గతంలో ఏఏ వెబ్ సైట్ లను బ్రౌజ్ చేసారో ఇట్టే తెలిసిపోతుంది. అలాగే ట్రాకర్స్ సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఎక్స్ టెన్షన్ లో కనిపించే లైట్ బీమ్ ను క్లిక్ చేస్తే ఈ ఫీచర్ కళ్లముందు కనిపిస్తుంది.

ట్రాకో గ్రఫీ..

ట్రాకో గ్రఫీ..

ఈ ఎక్స్ టెన్షన్ చాలా ఉపయోగకరమైనది. దీని ద్వారా మీరు హోస్ట్ నేషన్, అలాగే మీరు విజిట్ చేసిన ట్రాకర్స్ కూడా ఈ ఎక్స్ టెన్షన్ ద్వారా తెలుసుకునే వీలుంది.

Best Mobiles in India

English summary
Is someone spying on you online, here is a way to find out More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X