మీ ఆధార్ సేఫేనా.. లేక మోసగాళ్లు ఎవరైనా వాడుతున్నారా.. ఇప్పుడే ఇలా చెక్ చేసుకోండి!
ఆధార్ కార్డు (Aadhaar) మనదేశంలో చాలా ముఖ్యమైన గుర్తింపు కార్డు. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, కొత్త సిమ్ తీసుకోవాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. ఒకవేళ ఎవరైనా మీ ఆధార్‌ను దుర్వినియోగం చేస్తే, మీ పేరు మీద దొంగ అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు, సిమ్ కార్డులు కొనొచ్చు, ఇంకా చాలా మోసాలు చేయొచ్చు. అందుకే ఆధార్ కార్డును ఎవరైనా మీ అనుమతి లేకుండా వాడుతున్నారా లేదా అని తరచూ చెక్ చేసుకోవడం ముఖ్యం.
UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) సంస్థ మీ ఆధార్ ఎక్కడెక్కడ వాడారో తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది. మీ ఆధార్‌తో అనుమానాస్పద లావాదేవీలు ఏమైనా జరిగాయా అని కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడొచ్చు. మీ ఆధార్ కార్డును ఎవరైనా మీ పర్మిషన్ లేకుండా వాడారా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలో వేసుకుందాం.

UIDAI వెబ్‌సైట్‌లో మీ ఆధార్ హిస్టరీ చెక్ చేసుకునే ఫీచర్ ఉంది. దీని ద్వారా మీ ఆధార్ ఎప్పుడు, ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవచ్చు. నిజానికి రియల్ టైమ్ ట్రాకింగ్ సాధ్యం కాదు కానీ, రీసెంట్‌గా జరిగిన లావాదేవీల వివరాలు మాత్రం చూడొచ్చు.
* ఆధార్ హిస్టరీ చెక్ చేసుకోవడానికి స్టెప్స్
స్టెప్ 1: ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.inను ఓపెన్ చేయాలి. మీ 12 డిజిట్ల ఆధార్ నంబర్‌తో పాటు, కింద కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. లాగిన్ అయి హిస్టరీ చూడాలి.
స్టెప్ 2: వెబ్‌సైట్‌లో "అథెంటికేషన్ హిస్టరీ (Authentication History)" అనే సెక్షన్‌కు వెళ్లాలి. అనుమానాస్పద లావాదేవీలు చెక్ చేయాలి. అందుకు మీ ఆధార్ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ మొత్తం చూడాలి. మీకు తెలియని లావాదేవీలు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. మోసం జరిగితే లేదా ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే UIDAIకి రిపోర్ట్ చేయాలి.
* ఆధార్ దుర్వినియోగం అయితే ఏం చేయాలి..
మీకు తెలియని ట్రాన్సాక్షన్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే 1947 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి UIDAI హెల్ప్‌లైన్‌కు కంప్లైంట్ చేయాలి. [email protected] ఈ మెయిల్ IDకి మెయిల్ కూడా పెట్టొచ్చు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేదా మొబైల్ నంబర్ ద్వారా మోసం జరిగిందనిపిస్తే వెంటనే బ్యాంక్ లేదా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి.
* ఆధార్‌ను లాక్ చేస్తే మరింత సెక్యూర్
మీ ఆధార్‌ను ఎవరూ మిస్ యూజ్ చేయకుండా ఉండాలంటే, మీ బయోమెట్రిక్స్‌ను లాక్ చేసుకునే ఆప్షన్ కూడా UIDAI ఇస్తోంది. ఒకసారి లాక్ చేస్తే, మీ ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ స్కాన్ వెరిఫికేషన్ కోసం ఎవరూ వాడలేరు. ఆధార్‌ను లాక్ చేయడానికి సింపుల్ స్టెప్స్ చూద్దాం.
స్టెప్ 1: UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లాలి, "లాక్/అన్‌లాక్ ఆధార్" ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఉదాహరణకు మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఫిల్ చేyaali. OTP కోసం రిక్వెస్ట్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
స్టెప్ 2: ఆపై లాక్ కన్ఫర్మ్ చేయాలి. అందుకు ఓటీపీ ఎంటర్ చేసి మీ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయాలి. లాక్ చేస్తే, మళ్లీ మీరు అన్‌లాక్ చేసే వరకు వేలిముద్రలు, కనుపాపలతో ఆధార్ వెరిఫికేషన్ జరగదు. అంటే ఇతరులు ఎవరూ కూడా ఆధార్‌ను వెరిఫై చేసి మీ డీటెయిల్స్‌ను తమ ప్రయోజనాల కోసం వాడుకోలేరు.
* జాగ్రత్తగా ఉండండి.. మీ ఆధార్‌ను సేఫ్‌గా కాపాడుకోండి..
ఆధార్‌ను భద్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకు ఆధార్ హిస్టరీని రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండాలి. బయోమెట్రిక్ డేటాను లాక్ చేసి మిస్‌యూజ్ కాకుండా కాపాడుకోవాలి. మోసం జరిగిందని అనుమానం వస్తే వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఆధార్ కార్డును మోసాల నుంచి కాపాడుకోవచ్చు, పర్సనల్ ఐడెంటిటీని సేఫ్‌గా ఉంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








