ఓవర్‌హీట్ అవుతోన్న ల్యాప్‌టాప్‌ను చల్లబరచటం ఎలా..?

Written By:

ముద్దుగా ల్యాపీ అని పిలవబడుతోన్నల్యాప్‌టాప్‌ దశదిశలా తన ప్రాముఖ్యతను చాటుకుంటోంది. ల్యాప్‌టాప్‌ల తయారీ విభాగంలో గతకొన్ని సంవత్సరాలుగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పర్యావసానంగా వీటి పనితీరు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ల్యాప్‌టాప్‌లలోని ప్రతి విభాగం ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయబడుతోంది.

 ఓవర్‌హీట్ అవుతోన్న ల్యాప్‌టాప్‌ను చల్లబరచటం ఎలా..?

పలుచటి శరీరాకృతి, హై రిసల్యూషన్ స్ర్కీన్, వేగవంతమైన ప్రాసెసర్, హైఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ వంటి ఆధునిక ఫీచర్లు ల్యాప్‌టాప్ పనితీరునే మార్చేసాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ల్యాప్‌టాప్‌లకు ఓవర్ హీటింగ్ సమస్య కొరకరాని కొయ్యగా మారింది. ఈ సమస్యకు సరైన పరిష్కార మార్గాన్ని తయారీదారులు కొనుగొనే లేకపోతున్నారు.

Read More : మోటరోలా నుంచి మరో సంచలనం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓవర్‌హీట్ అవుతోన్న ల్యాప్‌టాప్‌ను చల్లబరచటం ఎలా..?

ల్యాప్‌టాప్‌లలో తలెత్తే ఓవర్ హీటింగ్ డివైస్ హార్డ్‌వేర్ ఫెయిల్యూర్‌కు కారణమయ్యే ప్రమాదముంది. ఓవర్ హీటింగ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ల్యాప్‌టాప్ జీవితకాలమే దెబ్బతింటుంది.

ఓవర్‌హీట్ అవుతోన్న ల్యాప్‌టాప్‌ను చల్లబరచటం ఎలా..?

మీ ల్యాప్‌టాప్ ఓవర్ హీటింగ్ ఇష్యూను ఫేస్ చేస్తున్నట్లయితే ఈ లక్షణాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. లోపలి ఫ్యాన్ గరిష్ట వేగంతో తిరుగుతున్నప్పటికి హీట్ జనరేట్ అవుతూనే ఉంటుంది. సీపీయూ పనితీరు పూర్తిగా మందగిస్తుంది. ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే డివైస్ సడెన్ షట్‌డౌన్‌కు దారితీస్తుంది.

ఓవర్‌హీట్ అవుతోన్న ల్యాప్‌టాప్‌ను చల్లబరచటం ఎలా..?

ల్యాప్‌టాప్ ఓవర్ హీటింగ్‌కు ప్రధాన కారణం లోపలి కూలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే. ఫ్యాన్‌లో దుమ్ము అమితంగా పేరుకుపోవటం వల్ల గాలి బ్లాక్ అయిపోతుంది. ఈ కారణంగా గాలి వ్యవస్థ పూర్తిగా స్తంభించి హీటింగ్ సమస్య ఉత్పన్నమవుతుంది.

 

ఓవర్‌హీట్ అవుతోన్న ల్యాప్‌టాప్‌ను చల్లబరచటం ఎలా..?

కూలింగ్ ఫ్యాన్‌లో పేరుకుపోయిన దుమ్మును క్లీన్ చేయటం ద్వారా హీటింగ్ సమస్యను అధిగమించవచ్చు. ఈ ఫ్యాన్‌ను క్లిన్‌ చేసే క్రమంలో ల్యాపీని షట్‌డౌన్ చేసి బ్యాటరీని తొలగించాల్సి ఉంటుంది. వ్యాక్యుమ్ క్లీనర్‌ను ఉపయోగించటం ద్వారా దుమ్మును త్వరగా క్లీన్ చేయవచ్చు.

 

ఓవర్‌హీట్ అవుతోన్న ల్యాప్‌టాప్‌ను చల్లబరచటం ఎలా..?

మీ ల్యాప్‌టాప్ కూల్‌గా ఉండాలంటే ల్యాప్‌టాప్‌ను ఉంచే ప్రదేశం చదునుగా ఇంకా ధృడంగా ఉండాలి. టేబుల్ ఇందుకు కరెక్టుగా సూట్ అవుతుంది. మంచం కాదు. 

ఓవర్‌హీట్ అవుతోన్న ల్యాప్‌టాప్‌ను చల్లబరచటం ఎలా..?

మీ ల్యాప్‌టాప్ నిరంతరం కూల్‌గా ఉండాలంటే లోపల పేరుకుపోయే దుమ్మును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. ల్యాపీ క్లీనింగ్‌లో భాగంగా మొత్తటి దుస్తును వాడండి.

 

ఓవర్‌హీట్ అవుతోన్న ల్యాప్‌టాప్‌ను చల్లబరచటం ఎలా..?

ల్యాప్‌టాప్స్ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన స్టాండ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మీ ల్యాపీని చల్ల బరచటంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ ల్యాప్‌టాప్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు టేబుల్ ఫ్యాన్ సదుపాయంతో కూడిన అనేక కూలింగ్ ప్యాడ్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Is Your Laptop Overheating? 3 Tips to Fix it in 10 Minutes. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot