Smartphone Tips మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతుందా.. అయితే వెంటనే ఇలా చేయండి..!!
స్మార్ట్‌ఫోన్ లు కొన్నిసార్లు అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతుంటాయి. లేదా తరచూ హ్యాంగ్ (Smartphone Hanging) అవుతుంటుంది. ముఖ్యమైన వారికి మెసేజ్ చేస్తున్నప్పుడు లేదా కాల్స్ చేస్తున్నప్పుడు పనిచేయడం ఆగిపోతుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ద్వారా అనేక పనులు చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అయితే ఫోన్ హ్యాంగ్ అయ్యేందుకు అనేక కారణాలున్నాయి. స్టోరేజీ నిండిపోవడం సహా యాప్ క్యాచీ కారణంగా ఫోన్ హ్యాంగ్ అవుతుంది.
అవసరం లేని యాప్ లను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి : అవసరం అయిన సందర్భాల్లో వివిధ రకాల యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటాం. అనంతరం ఆ యాప్ లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం మర్చిపోతుంటాం. అలాంటి యాప్‌లను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. ఫలితంగా స్టోరేజీ పెరుగుతుంది.

ఆ ఫైల్స్‌ను డిలీట్ చేయండి : ప్రతి స్మార్ట్‌ఫోన్ కు కొంత స్టోరేజీ ఉంటుంది. ఆ స్టోరేజీ సామర్థ్యం నిండిపోతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్ పనితీరు నెమ్మదిస్తుంది. మరియు తరచూ హ్యాంగ్ అవుతుంది. అందువల్ల ఫోన్ అంతర్గత స్టోరేజీలో ఉన్న అవసరం లేని ఫొటోలు, వీడియోలు, PDF ఫైల్స్ ను డిలీట్ చేయాలి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ : స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన అనంతరం రెండు నుంచి 5 అంతకంటే ఎక్కువ సంవత్సరాలపాటు తయారీ సంస్థలు OS, సెక్యూరిటీ అప్‌డేట్ లు ఇస్తుంటాయి. ఈ అప్‌డేట్ ల ద్వారా కొత్త ఫీచర్‌లు అందుబాటులోకి రావడంతోపాటు హ్యాండ్‌సెట్‌లోని సాంకేతిక సమస్యలు తొలగిపోతాయి. ఫలితంగా ఫోన్ వేగం పెరుగుతుంది.
ఎప్పటికప్పుడు యాప్ క్యాచీని తొలగించాలి : స్మార్ట్‌ఫోన్ లో అనేక యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటాం. యాప్ క్యాచీ కారణంగా హ్యాండ్‌సెట్ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యాప్ క్యాచీని వెంటనే తొలగించాలి. ఫోన్ సెట్టింగ్స్ లోని స్టోరేజీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అనంతరం యాప్ ను ఎంచుకొని క్యాచీని క్లియర్ చేయాలి.
తరచుగా హ్యాంగ్ అవుతుంటే.. : కొన్నిసార్లు ఫోన్ హ్యాంగ్ అవ్వడం లేదా సడన్ గా ఆగిపోవడం జరిగితే.. హ్యాండ్‌సెట్‌ను రీస్టార్ట్ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్‌లోని యాప్స్ రీసెట్ అవుతాయి. ఫలితంగా ఫోన్ పనితీరు కాస్త మెరుగుపడుతుంది. దీంతోపాటు ఫోన్‌లో వైరస్‌లను కనిపెట్టేందుకు ప్రత్యేక యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అయ్యేందుకు చాలా కారణాలు ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు కొత్తగా ఫోన్‌లో ఎటువంటి యాప్‌లు ఇన్‌స్టాల్ అయినా అప్రమత్తంగా వ్యవహరించాలి. కొన్నిసార్లు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అవసరం లేని ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








